iDreamPost
android-app
ios-app

షమీ 7 వికెట్లు తీస్తాడని ముందే చెప్పిన నెటిజన్! వైరలవుతున్న పోస్ట్..

  • Author Soma Sekhar Updated - 01:33 PM, Thu - 16 November 23

వరల్డ్ కప్ లో భాగంగా జరిగిన ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్ లో ఓ నెటిజన్ చెప్పినట్లే జరిగింది. సెమీఫైనల్లో టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ 7 వికెట్లు తీస్తాడని నెంబర్ తో సహా చెప్పాడు ఓ నెటిజన్. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ గా మారింది.

వరల్డ్ కప్ లో భాగంగా జరిగిన ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్ లో ఓ నెటిజన్ చెప్పినట్లే జరిగింది. సెమీఫైనల్లో టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ 7 వికెట్లు తీస్తాడని నెంబర్ తో సహా చెప్పాడు ఓ నెటిజన్. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ గా మారింది.

  • Author Soma Sekhar Updated - 01:33 PM, Thu - 16 November 23
షమీ 7 వికెట్లు తీస్తాడని ముందే చెప్పిన నెటిజన్! వైరలవుతున్న పోస్ట్..

కాకతాళీయమో.. యాదృచ్చికమో కొన్ని కొన్ని విషయాలు కొందరు చెప్పినట్లే జరుగుతూ ఉంటాయి. ఇక మరికొన్ని మాత్రం ఆ సంఘటన జరగక ముందే ఇలా జరుగుతుందని చెప్తూ ఉంటారు కొందరు వ్యక్తులు. అయితే ఇవి చాలా సందర్భాల్లో అసత్యాలుగా మిగిలిపోయినప్పటికీ.. కొన్ని సమయాల్లో మాత్రం అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతూ నిజాలుగా మారుతుంటాయి. తాజాగా వరల్డ్ కప్ లో భాగంగా జరిగిన ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్ లో ఓ నెటిజన్ చెప్పినట్లే జరిగింది. సెమీఫైనల్లో టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ 7 వికెట్లు తీస్తాడని నెంబర్ తో సహా చెప్పాడు ఓ నెటిజన్. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ గా మారింది. మరి అతడు ఎలా వందకు వంద శాతం కరెక్ట్ గా చెప్పాడో ఇప్పుడు ఓసారి చూద్దాం.

కివీస్ తో జరిగిన నాకౌట్ మ్యాచ్ లో టీమిండియా 70 రన్స్ తేడాతో విజయం సాధించి.. తిరుగులేని జట్టుగా వరల్డ్ కప్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. భారత్ నిర్దేశించిన 398 పరుగుల లక్ష్య ఛేదనలో కివీస్ 327 రన్స్ కు ఆలౌట్ అయ్యింది. ఇక ఈ మ్యాచ్ లో మరోసారి తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు మహ్మద్ షమీ. లక్ష్యం వైపు సాగుతున్న కివీస్ ను తన పేస్ తో కాకవికలం చేశాడు. 7 వికెట్లు తీయడమే కాకుండా ఎన్నో ప్రపంచ రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు షమీ. ఇదిలా ఉండగా.. మహ్మద్ షమీ సెమీఫైనల్ మ్యాచ్ లో 7 వికెట్లు తీస్తాడని ఒకరోజు ముందే చెప్పాడు ఓ నెటిజన్.

డాన్ మాటియో అనే వ్యక్తి ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని పంచుకున్నాడు. కచ్చితంగా 7 వికెట్లు తీస్తాడని అలా ఎలా చెప్పాడు అతడు అని చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. డాన్ మాటియోకి న్యూజిలాండ్ జరిగే మ్యాచ్ లో షమీ 7 వికెట్లు తీస్తాడని కల వచ్చిందట. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఈ నెటిజన్. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు పలు రకాలుగా అతడి కలపై రియాక్ట్ అవుతున్నారు. అదేంటి భయ్యా ఎంత కలొచ్చినా.. అంత కచ్చితంగా 7 వికెట్లు అని ఎలా చెప్పావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. టీమిండియా వరల్డ్ కప్ ముద్దాడినట్లు ఇంకో కల కను డాన్ బ్రో అంటూ ఇంకొందరు రాసుకొచ్చారు. ఇది అద్భుతం అని, నీ భవిష్యత్ గురించి మంచి కలలు కను అంటూ మరికొందరు అతడికి రిప్లైలు ఇచ్చారు. మరి షమీ 7 వికెట్లు తీస్తాడని ముందే చెప్పిన ఈ నెటిజన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss