iDreamPost
android-app
ios-app

గుడ్‌న్యూస్‌.. రీఎంట్రీకి సిద్ధమైన మొహమ్మద్‌ షమీ! న్యూజిలాండ్‌ సిరీస్‌కి ముందు..

  • Published Aug 19, 2024 | 11:38 AM Updated Updated Aug 19, 2024 | 11:38 AM

Mohammed Shami, Ranji Trophy, IND vs NZ: టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఓ స్టార్‌ ప్లేయర్‌ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇది టీమిండియాకు గుడ్‌న్యూస్‌. మరి ఆ ప్టేయర్‌ ఎవరో ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Mohammed Shami, Ranji Trophy, IND vs NZ: టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఓ స్టార్‌ ప్లేయర్‌ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇది టీమిండియాకు గుడ్‌న్యూస్‌. మరి ఆ ప్టేయర్‌ ఎవరో ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Aug 19, 2024 | 11:38 AMUpdated Aug 19, 2024 | 11:38 AM
గుడ్‌న్యూస్‌.. రీఎంట్రీకి సిద్ధమైన మొహమ్మద్‌ షమీ! న్యూజిలాండ్‌ సిరీస్‌కి ముందు..

భారత క్రికెట్‌ జట్టుకు ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌లు లేకపోయినా.. దేశవాళి ప్రతిష్టాత్మక దులీప్‌ ట్రోఫీలో దాదాపు టీమిండియా క్రికెటర్లంతా ఆడుతున్నారు. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, జస్ప్రీత్‌ బుమ్రా, హార్ధిక్‌ పాండ్యా మినహా మిగతా టీమ్‌ అంతా దులీప్‌ ట్రోఫీ బరిలోకి దిగుతోంది. సెప్టెంబర్‌ 19 నుంచి బంగ్లాదేశ్‌లో ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్‌ కోసం టీమిండియాను సిద్ధం చేసేందుకు బీసీసీఐ అందర్ని డొమెస్టిక్‌ క్రికెట్‌ ఆడాలని ఆదేశించింది. అలాగే గాయంతో టీమిండియాకు దూరమైన ఆటగాళ్లు.. గాయం నుంచి కోలుకున్న తర్వాత.. టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వాలంటే కూడా కచ్చితంగా దేశవాళి క్రికెట్‌లో ఫిట్‌నెస్‌ నిరూపించుకోవాలని కూడా బీసీసీఐ రూల్‌ పెట్టింది.

వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన మొహమ్మద్‌ షమీ.. ఆ వరల్డ్‌ కప్‌ టోర్నీ తర్వాత.. గాయంతో టీమిండియాకు దూరమయ్యాడు. ఇన్ని రోజులు గాయం నుంచి కోలుకుని.. ఈ మధ్యే ప్రాక్టీస్‌ ప్రారంభించిన షమీ.. తిరిగి టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. వచ్చే నెల నుంచి టీమిండియాకు తిరికలేకుండా మ్యాచ్‌లు ఉన్నాయి. ఇలాంటి టైమ్‌లో షమీ తిరిగి గ్రౌండ్‌లోకి దిగుతుండటం టీమిండియా గుడ్‌న్యూస్‌ అనే చెప్పాలి. టెస్టుల్లో ఒక వైపు బుమ్రా, మరో వైపు షమీ బౌలింగ్‌ చేస్తూ.. వారిద్దరికీ తోడుగా మొహమ్మద్‌ సిరాజ్‌ చెలరేగితే.. టీమిండియా బౌలింగ్‌ ఎటాక్‌ను ఎదుర్కొవడం అంత ఈజీ కాదు.

good news for team india

అయితే.. టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చే ముందు.. దేశవాళి క్రికెట్‌లో ఆడాలని షమీ నిర్ణయించుకున్నాడు. రానున్న రంజీ ట్రోఫీ సీజన్‌లో తన రాష్ట్ర జట్టు బెంగాల్‌ తరఫున బరిలోకి దిగనున్నాడు షమీ. నిజానికి షమీ.. బంగ్లాదేశ్‌లో జరిగే టెస్టు సిరీస్‌తోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇస్తాడని అంతా భావించారు. కానీ, అక్టోబర్‌ 16 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న మూడు టెస్టుల సిరీస్‌తో షమీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. న్యూజిలాండ్‌తో టెస్ట్‌ సిరీస్‌ కోసమే.. రంజీ ట్రోఫీలో కొన్ని మ్యాచ్‌లు ఆడాలని షమీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.