iDreamPost
android-app
ios-app

ఆ రాత్రి షమీ ఆత్మహత్యకు ప్రయత్నించాడు! సంచలన నిజం వెలుగులోకి..

  • Published Jul 24, 2024 | 10:52 AM Updated Updated Jul 24, 2024 | 10:52 AM

Mohammed Shami, Match Fixing, Umesh Kumar: అంతర్జాతీయ క్రికెట్‌గా ఎదిగి.. దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్న సమయంలో.. మొహమ్మద్‌ షమీ ఆత్మహత్య చేసుకోవాలని భావించాడని షమీ ఫ్రెండ్‌ వెల్లడించాడు. ఆ విషయం గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Mohammed Shami, Match Fixing, Umesh Kumar: అంతర్జాతీయ క్రికెట్‌గా ఎదిగి.. దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్న సమయంలో.. మొహమ్మద్‌ షమీ ఆత్మహత్య చేసుకోవాలని భావించాడని షమీ ఫ్రెండ్‌ వెల్లడించాడు. ఆ విషయం గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

  • Published Jul 24, 2024 | 10:52 AMUpdated Jul 24, 2024 | 10:52 AM
ఆ రాత్రి షమీ ఆత్మహత్యకు ప్రయత్నించాడు! సంచలన నిజం వెలుగులోకి..

టీమిండియా స్టార్‌ బౌలర్‌ మొహమ్మద్‌ షమీ గురించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. టీమిండియాకు ఆడుతున్న సమయంలోనే షమీ.. ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు షమీ ప్రాణస్నేహితుడు ఉమేష్‌ కుమార్‌ వెల్లడించాడు. ప్రముఖ జర్నలిస్ట్‌ శుభంకర్ మిశ్రాతో ఇంటర్వ్యూలో షమీతో పాటు ఉమేష్‌ కుమార్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ఉమేష్‌, షమీ గురించి ఈ సంచలన విషయం వెల్లడించాడు. షమీ మాజీ భార్య హషీన్‌ జహాన్‌.. షమీపై గతంలో తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. షమీపై డొమెస్టిక్‌ వైలెన్స్‌తో పాటు మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు చేసింది. పాకిస్థాన్‌ అమ్మాయి నుంచి డబ్బు తీసుకుని.. షమీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని వెల్లడించింది. ఆ సమయంలో షమీపై బీసీసీఐ విచారణ కూడా జరిపించింది.

ఆ సమయంలోనే షమీ మెదడులో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు మెదిలినట్లు ఉమేష్‌ కుమార్‌ వెల్లడించాడు. ఉమేష్‌ మాట్లాడుతూ.. ‘భార్యతో విభేదాలు, మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు వచ్చిన కఠిన పరిస్థితుల్లో షమీ నాతో ఉన్నాడు. ఒక రోజు రాత్రి నేను నీళ్లు తాగేందుకు లేచి.. కిచన్‌లోకి వెళ్తున్న సమయంలో బాల్కానీలో షమీ నిలబడి ఉన్నాడు. నాకు విషయం అర్థమైపోయింది. అతను ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు ఉన్నాడని.. కానీ, తనపై వచ్చిన మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణల్లో నిజం లేదని, బీసీసీఐ జరిపిన విచారణలో క్లిన్‌ చీట్‌ వచ్చిన తర్వాత షమీ ఎంతో సంతోష పడ్డాడు. ఆ 30 రోజులు షమీ జీవితంలో ఎంతో కఠినమైన రోజులు. మరో వ్యక్తి షమీ ప్లేస్‌లో ఉంటే.. బతికి ఉండే వాడు కాదు, మళ్లీ క్రికెట్‌ ఆడే వాడు కాదు.’ అని తెలిపాడు.

అయితే.. తనపై ఏ ఆరోపణలు వచ్చినా నేను తట్టుకోగలను కానీ, దేశానికి ద్రోహం చేశాననే ఆరోపణలు రావడం నేను తట్టుకోలేకపోతున్నాను అని షమీ తనతో అన్నట్లు ఉమేష్‌ పేర్కొన్నాడు. ఆ సమయంలో షమీ మనుసు ముక్కలైపోయింది. చాలా బాధపడ్డాడు. అయినా.. తట్టుకుని నిలబడి.. మళ్లీ కమ్‌బ్యాక్‌ ఇచ్చాడు. అయితే.. ఇదే విషయంపై షమీ మాట్లాడుతూ.. నేను ఇంత స్థాయికి రావడానికి కారణమైన క్రికెట్‌ను వదలొద్దని అనుకున్నాను. నేను షమీని కాకపోయి ఉంటే.. ఈ విషయం మీడియా కూడా పట్టించుకునేందుకు కాదు.. అలాంటి నన్ను ఇంతవాడిని చేసిన క్రికెట్‌ను ఎందుకు వదిలిపెట్టాలనే పట్టుదలతో పోరాడి.. ఇప్పుడు ఇలా ఉన్నాను అని షమీ చెప్పుకొచ్చాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.