షాకింగ్‌ న్యూస్‌.. వరల్డ్‌ కప్‌ అంతా ఇంజెక్షన్స్‌ తీసుకుని ఆడిన టీమిండియా క్రికెటర్‌!

Mohammed Shami: వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో టీమిండియా ఫైనల్లో ఓటమి పాలై.. ఒక్క మ్యాచ్‌తో వరల్డ్‌ కప్‌ను చేజార్చుకుంది. అయితే.. ఈ టోర్నీ ఆసాంతం టీమిండియా అద్భుతంగా ఆడింది. అందులోనా కొంతమంది ప్లేయర్లు తమ ప్రాణం పెట్టి ఆడారు. ముఖ్యంగా ఓ ప్లేయర్‌ అయితే..

Mohammed Shami: వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో టీమిండియా ఫైనల్లో ఓటమి పాలై.. ఒక్క మ్యాచ్‌తో వరల్డ్‌ కప్‌ను చేజార్చుకుంది. అయితే.. ఈ టోర్నీ ఆసాంతం టీమిండియా అద్భుతంగా ఆడింది. అందులోనా కొంతమంది ప్లేయర్లు తమ ప్రాణం పెట్టి ఆడారు. ముఖ్యంగా ఓ ప్లేయర్‌ అయితే..

ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌ కప్‌ 2023 వంద కోట్లకు పైగా ఉన్న భారత క్రికెట్‌ అభిమానుల హృదయాలను ముక్కలు చేసింది. 2011 తర్వాత మళ్లీ టీమిండియా వన్డే ప్రపంచ కప్‌ను గెలిచి, విశ్వవిజేతగా నిలుస్తుందని ఇండియన్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఎంతో ఆశపడ్డారు. రోహిత్‌ శర్మ కెప్టెన్సీలోని టీమిండియా సైతం టోర్నీ ఆసాంతం అద్భుతంగా ఆడింది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా లాంటి పెద్ద టీమ్‌తో తలపడి అద్భుత విజయం సాధించింది. ఇక అక్కడి నుంచి రోహిత్‌ సేన వెనుతిరగి చూడలేదు. ఎదురుగా ఏ జట్టు వచ్చినా బెదురులేకుండా ఆడిన టీమిండియా.. అన్ని జట్లను ఓడించుకుంటూ.. ఫైనల్‌కు దూసుకెళ్లింది. టీమిండియాకు రెండు కళ్లలాంటి విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ.. అద్భుత ఆటతో టీమ్‌ను సూపర్‌గా ముందుకు నడిపించారు.

కానీ, ఫైనల్లో టీమిండియా, ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలై.. వరల్డ్ కప్‌ను చివరి మెట్టుపై చేజార్చకుంది. ఈ ఓటమి భారత క్రికెట్‌ అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. అయితే.. ఈ టోర్నీలో జట్టులోని అందరు ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా టీమిండియా స్టార్‌ బౌలర్‌ మొహమ్మద్‌ షమీ అయితే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఆరంభంలో షమీకి నాలుగు మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం కూడా రాలేదు. టీమ్‌ కాంబినేషన్‌ కుదరకపోవడంతో షమీ బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. కానీ, ఒక్కసారి షమీ టీమ్‌లోకి వచ్చిన తర్వాత.. తన సత్తా ఏంటో చాటి చెప్పాడు. ఐదు వికెట్ల హల్‌ సాధించి.. తాను బరిలోకి దిగితే ఎలా ఉంటుందో చెప్పాడు. దీంతో అక్కడి నుంచి షమీని కదిపే సాహసం రోహిత్‌ చేయలేకపోయాడు.

తొలి నాలుగు మ్యాచ్‌ లు ఆడపోయినా.. వరల్డ్‌ కప్‌ టోర్నీలో కేవలం 7 మ్యాచ్‌ లు మాత్రమే ఆడిన షమీ ఏకంగా 24 వికెట్లతో టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌ గా నిలిచాడు. కానీ, వరల్డ్‌ కప్‌ తర్వాత మళ్లీ షమీ మ్యాచ్‌ ఆడలేదు. గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. అయితే.. ఈ గాయాలు షమీని వరల్డ్‌ కప్‌ సమయంలోనే ఇబ్బంది పెట్టినట్లు తాజాగా జాతీయ మీడియా పేర్కొంటోంది. భరించలేని నొప్పిని పంటిబిగువన బిగబట్టి.. ఇంజక్షన్లు తీసుకుని మరీ.. షమీ దేశం కోసం వరల్డ్‌ కప్‌ లో ఆడాడని, అతని కష్టాన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే అంటూ నేషనల్‌ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే.. షమీ పడిన కష్టానికి టీమిండియా వరల్డ్‌ కప్‌ గెలిచి ఉంటే బాగుండేదని క్రికెట్‌ ఫ్యాన్స్‌ అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments