iDreamPost

తల్లిని తలచుకుని మహ్మద్ షమీ ఎమోషనల్ పోస్ట్!

  • Author Soma Sekhar Published - 05:19 PM, Thu - 23 November 23

ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ కు ముందు షమీ తల్లి అంజుమ్ అరా తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో అడ్మిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక వరల్డ్ కప్ ముగియగానే ఇంటికి వచ్చిన షమీ తల్లిని తలచుకుని ఓ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశాడు.

ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ కు ముందు షమీ తల్లి అంజుమ్ అరా తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో అడ్మిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక వరల్డ్ కప్ ముగియగానే ఇంటికి వచ్చిన షమీ తల్లిని తలచుకుని ఓ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశాడు.

  • Author Soma Sekhar Published - 05:19 PM, Thu - 23 November 23
తల్లిని తలచుకుని మహ్మద్ షమీ ఎమోషనల్ పోస్ట్!

మహ్మద్ షమీ.. వరల్డ్ కప్ లో మారుమ్రోగిన పేరు. ఈ మెగాటోర్నీ మధ్యలో ఎంట్రీ ఇచ్చిన స్టార్ పేసర్ అందరి చూపును తనవైపు తిప్పుకునేలా చేశాడు. అద్భుత బౌలింగ్ తో ప్రత్యర్థి బ్యాటర్లను వణికిస్తూ.. టీమిండియాకు తిరుగులేని విజయాలను అందించాడు. కానీ భారత్ కు మాత్రం వరల్డ్ కప్ ను అందించడంలో విఫలం అయ్యాడు. కాగా.. ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ కు ముందు షమీ తల్లి అంజుమ్ అరా తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో అడ్మిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక వరల్డ్ కప్ ముగియగానే ఇంటికి వచ్చిన షమీ తల్లిని తలచుకుని ఓ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు ముందు టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ తల్లి అంజుమ్ అరా తీవ్ర అనారోగ్యానికి గురైయ్యారు. దీంతో వెంటనే ఆమెను దగ్గరలోని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. కాగా.. మెరుగైన వైద్యం కోసం ఆమెను సీటీలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పూర్తిగా కోలుకుంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ ముగిసిన వెంటనే ఇంటికి వచ్చిన షమీ తన తల్లితో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. “అమ్మా నువ్వంటే నాకు చాలా ఇష్టం. త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను” అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఈ ఫోటోకు ఓ హార్ట్ ఎమోజీని కూడ జతచేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.

“రెండు రోజులుగా స్వల్ప జ్వరంతో బాధపడుతున్న అంజుమ్ ఆరా.. ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ రోజుకి జ్వరం ఎక్కువ కావడంతో హాస్పిటల్ కు తీసుకెళ్లాం. ప్రస్తుతం మా అమ్మ పరిస్థితి బాగానే ఉంది” అని మహ్మద్ షమీ సోదరి షబీనా ఖాతూమ్ చెప్పుకొచ్చింది. కాగా.. ఈ వరల్డ్ కప్ లో షమీ తన కెరీర్ లోనే బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చాడనే చెప్పాలి. కేవలం 7 మ్యాచ్ ల్లోనే 24 వికెట్లు తీసి.. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. అంతేకాకుడా ఈ మెగాటోర్నీలో కనీవినీ ఎరుగని రీతిలో రికార్డులు బద్దలు కొట్టాడు షమీ. మరి షమీ ఎమోషనల్ పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి