Somesekhar
ఇంగ్లాండ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ కు ముందు టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగలనున్నట్లు తెలుస్తోంది.
ఇంగ్లాండ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ కు ముందు టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగలనున్నట్లు తెలుస్తోంది.
Somesekhar
కొత్త సంవత్సరం వేళ టీమిండియా వరుస సిరీస్ లతో బిజీగా ఉంది. తాజాగా సౌతాఫ్రికా పర్యటనను అద్భుతంగా ముగించుకున్న భారత జట్టు వెంటనే ఆఫ్గానిస్తాన్ తో పొట్టి సిరీస్ లో పాల్గొననుంది. మూడు టీ20 మ్యాచ్ లకు తాజాగా టీమిండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఇక ఈ సిరీస్ తో చాలా కాలం తర్వాత రీఎంట్రీ ఇచ్చారు సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. అయితే ఈ సిరీస్ ముగిసిన వెంటనే ఇంగ్లాండ్ తో 5 టెస్టు మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది భారత జట్టు. ఈ క్రమంలోనే టీమిండియాకు ఓ ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
సౌతాఫ్రికాతో జరిగిన రెండు టెస్ట్ ల సిరీస్ ను డ్రాగా ముగించుకున్న టీమిండియా ఫుల్ జోష్ లో ఉంది. తొలి టెస్ట్ లో ఓడిపోయినా, నెక్ట్స్ మ్యాచ్ లో అనూహ్యంగా పుంజుకుని మ్యాచ్ ను ఒకటిన్నర రోజులోనే ముగించింది. ఇక ఈ సిరీస్ అనంతరం ఆఫ్గానిస్తాన్ తో జరగనున్న మూడు టీ20 మ్యాచ్ లకు సిద్దమవుతోంది భారత జట్టు. ఆఫ్గాన్ సిరీస్ తర్వాత ఇంగ్లాండ్ తో ఐదు టెస్ట్ మ్యాచ్ లు ఆడనుంది. ఈ నేపథ్యంలో ఓ బ్యాడ్ న్యూస్ భారత ఫ్యాన్స్ ను కలవరపెడుతోంది. వరల్డ్ కప్ హీరో మహ్మద్ షమీ గాయం కారణంగా తొలి రెండు టెస్టు మ్యాచ్ లకు దూరం కానున్నట్లు సమాచారం. యాంకిల్ ఇంజ్యూరీ కారణంగా ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న షమీ.. ఆ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు.
దీంతో తొలి రెండు మ్యాచ్ లకు జట్టుకు అందుబాటులో ఉండటం అనుమానమేనని తెలుస్తోంది. ఇది టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బనే చెప్పాలి. ఎందుకుంటే? ఇప్పటికే సౌతాఫ్రికా టూర్ కు అతడు లేకపోవడంతో ఏం జరిగిందో మనందరికి తెలిసిందే. ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ సిరీస్ కు కూడా షమీ జట్టులో లేకపోతే.. టీమిండియాకు తిప్పలు తప్పవు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే మిగిలిన మూడు మ్యాచ్ లకు అందుబాటులోకి వచ్చినా, సంతోషమే అంటున్నారు ఫ్యాన్స్. తాజాగా ముగిసిన వరల్డ్ కప్ లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు షమీ. గాయం నుంచి త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Mohammed Shami is likely to miss the first two Test matches against England due to ankle injury🤕🏏
[The Indian Express] pic.twitter.com/bKDGQfLs8R— CricketGully (@thecricketgully) January 8, 2024