వరల్డ్ కప్ 2023 మెగా టోర్నీకి టీమిండియా ఆటగాళ్లు సిద్దం అవుతున్నారు. ఈ క్రమంలోనే ఆసియా కప్ సాధించిన టీమిండియా.. ఆసీస్ తో వన్డే సిరీస్ కు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీకి భారీ ఊరట లభిచింది. గతంలో షమీ భార్య హసిన్ జహాన్ పెట్టిన గృహ హింస కేసులో అలీపూర్ లోని ట్రయల్ కోర్టు షమీకి బెయిల్ మంజూరు చేసింది. దీంతో వరల్డ్ ముంగిట అతడికి బిగ్ రిలీఫ్ దొరికింది. ఈ కేసు కోర్టు లో ఉన్నందున అతడు వరల్డ్ కప్ కు అందుబాటులో ఉంటాడా? లేదా? అన్న అనుమానం ఫ్యాన్స్ లో కలిగింది. ఈ నేపథ్యంలో షమీకి బెయిల్ లభించడం అతడికి బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి.
వరల్డ్ కప్ 2023 ముంగిట టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీకి భారీ ఊరట లభించింది. తన భార్య హసిన్ జహాన్ పెట్టిన గృహ హింస కేసులో అలీపూర్ లోని ట్రయల్ కోర్టు షమీకి బెయిల్ మంజూరు చేసింది. రెండు వేల రూపాయల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. కాగా.. షమీతో పాటుగా అతడి సోదరుడు హసీమ్ కు సైతం కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ.. ఉత్తర్వులను జారీ చేసింది. అలీపూర్ ట్రయల్ కోర్ట్ లో ఈ కేసుకు సంబంధించి మంగళవారం విచారణ జరిగింది. ఈ విచారణకు తన సోదరుడితో కలిసి హాజరయ్యాడు షమీ. షమీ తరపున లాయర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. రెండు వేల రూపాయాల పూచికత్తుతో ఇద్దరికి బెయిల్ మంజూరు చేసింది.
కాగా.. 2018లో షమీ భార్య హసిన్ జాహాన్ షమీపైనా, అతడి సోదరుడి పైనా గృహ హింస చట్టం కింద తనను వేధిస్తున్నారంటూ జాదవ్ పూర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. అదీకాక షమీకి వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లుగా ఆరోపణలు కూడా చేసింది. దీంతో విచారణ ఎదుర్కొంటున్న షమీకి 2019 ఆగస్టు 29న అలీపూర్ అడిషినల్ చీఫ్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ అరెస్ట్ వారెంట్ ను జారీ చేసింది. ఈ వారెంట్ పై అదే సంవత్సరం సెప్టెంబర్ 9న కోల్ కత్తా స్థానిక కోర్టు స్టే విధించింది. తాజాగా షమీకి బెయిల్ మంజూరు కావడంతో.. వరల్డ్ కప్ కు పూర్తి స్థాయిలో సిద్దం కానున్నాడు. మరి షమీకి బెయిల్ మంజూరు కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.