iDreamPost

అదిరిపోయిన వరల్డ్‌ కప్‌ యాంథమ్‌ సాంగ్‌! స్పెషల్‌ అట్రాక్షన్‌గా చాహల్‌ భార్య

  • Published Sep 20, 2023 | 12:37 PMUpdated Sep 20, 2023 | 12:37 PM
  • Published Sep 20, 2023 | 12:37 PMUpdated Sep 20, 2023 | 12:37 PM
అదిరిపోయిన వరల్డ్‌ కప్‌ యాంథమ్‌ సాంగ్‌! స్పెషల్‌ అట్రాక్షన్‌గా చాహల్‌ భార్య

క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్‌ కప్‌ 2023 టోర్నీ మరికొన్ని రోజుల్లోనే ప్రారంభం కానుంది. భారత్‌ వేదికగా అక్టోబర్‌ 5 నుంచి ఈ మహా సంగ్రామం మొదలుకానుంది. ఇప్పటికే ఈ టోర్నీ కోసం దాదాపు అన్ని దేశాలు తమ తమ జట్లను సైతం ప్రకటించాయి. బీసీసీఐ సైతం రోహిత్‌ శర్మ కెప్టెన్సీలోని 15 మందితో కూడిన వరల్డ్‌ కప్‌ స్క్వౌడ్‌ను ప్రకటించింది. 2011లో వరల్డ్‌ కప్‌ టోర్నీకి భారత్‌ ఆతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ వరల్డ్‌ కప్‌ సమయంలో శంకర్‌ మహదేవన్‌ గాయంతో రిలీజ్‌ అయిన అధికారిక వరల్డ్‌ కప్‌ యాంథమ్‌ సాంగ్‌ ఎంత పెద్ద హిట్‌ అయిందో అందరికి తెలిసిందే.

మళ్లీ ఈ సారి వరల్డ్‌ కప్‌కు కూడా ఇండియనే ఆతిథ్యం ఇస్తుండటంతో.. వరల్డ్‌ కప్‌ థీమ్‌ సాంగ్‌ను రూపొందించారు. దాన్ని తాజాగా ఐసీసీ విడుదల చేసింది. రణ్‌వీర్‌ సింగ్‌ డ్యాన్సింగ్‌తో వన్డే ఎక్స్‌ప్రెస్‌ థీమ్‌తో సాంగ్‌ అయితే అదిరిపోయింది. ఈ సాంగ్‌లో టీమిండియా క్రికెటర్‌ యుజ్వేంద్ర చాహల్‌ భార్య కూడా కనిపించడం స్పెషల్‌ అట్రాక్షన్‌గా మారింది. అయితే.. ఈ సాంగ్‌కు ప్రీతమ్‌ సంగీతం అందించారు. శ్లోక్ లాల్, సావేరి వర్మ సాహిత్యం సమకూర్చారు. ప్రీతమ్, నకాష్ అజీజ్, శ్రీరామ చంద్ర, అమిత్ మిశ్రా, జోనితా గాంధీ, అక్సా, చరణ్ పాడారు. ర్యాప్‌ను చరణ్‌ రచించారు. మరి కిందున్న వీడియోను మీరు చూసి.. ‘దిల్‌ జష్న్‌ బోలే’ సాంగ్‌ను ఎంజాయ్‌ చేయండి. అలాగే యాంథమ్‌ సాంగ్‌ ఎలా ఉందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వరల్డ్‌ కప్‌: ICC కీలక నిర్ణయం! బ్యాటర్లకు బ్యాడ్‌ న్యూస్‌

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి