Mohammed Shami: షమి డైట్ గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే.. రోజూ ఎన్ని కిలోల మటన్ తింటాడంటే?

Mohammed Shami Diet: టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమి డైట్ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అతడు రోజుకు ఎంత మాంసం తింటాడో తెలిస్తే మీరు కూడా షాక్ అవ్వాల్సిందే.

Mohammed Shami Diet: టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమి డైట్ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అతడు రోజుకు ఎంత మాంసం తింటాడో తెలిస్తే మీరు కూడా షాక్ అవ్వాల్సిందే.

క్రీడల్లో రాణించాలంటే టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు. మెంటల్​గా, ఫిజికల్​గా కూడా ఆటగాళ్లు ఫిట్​గా ఉండాలి. అప్పుడే మంచి పెర్ఫార్మెన్స్​ ఇవ్వడంతో కెరీర్​ను సుదీర్ఘ కాలం పొడిగించుకునేందుకు వీలుంటుంది. క్రికెటర్లు కూడా దీనికి మినహాయింపేమీ కాదు. ఏళ్ల పాటు క్రికెట్ ఆడాలంటే ప్లేయర్లు చాలా ఫిట్​గా ఉండాలి. అందుకే మెంటల్ హెల్త్​ను కాపాడుకునేందుకు యోగా, ధ్యానం లాంటివి చేస్తుంటారు క్రికెటర్లు. ఫిజికల్ ఫిట్​నెస్​లో భాగంగా జిమ్​లో కసరత్తులు చేస్తూ చెమటోడ్చుతుంటారు. ఫిజికల్ ఫిట్​నెస్​ను మరింత మెరుగుపర్చుకునేందుకు మంచి పౌష్టికాహారాన్ని కూడా తీసుకుంటారు. ఇతర దేశాల ఆటగాళ్లను పక్కనబెడితే టీమిండియా క్రికెటర్లు మాత్రం పాలు, పండ్లు, చేపలు లాంటివి ఎక్కువగా తీసుకుంటారు.

డైట్​లో భాగంగా గుడ్లు, మాంసాన్ని కూడా టీమిండియా ప్లేయర్లు తీసుకుంటారు. అయితే వాటి మోతాదు తక్కువగానే ఉంటుంది. కానీ వెటరన్ పేసర్ మహ్మద్ షమి మాత్రం నాన్​వెజ్​ అందులోనూ మటన్​ను హెవీగా తీసుకుంటాడట. అతడి డైట్ గురించి తెలిస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. రోజూ కిలో మటన్ లేనిదే షమికి ముద్ద దిగదట. కిలో మటన్ తినకపోతే తర్వాతి రోజు అతడి బౌలింగ్ స్పీడ్ అమాంతం పడిపోతుందట. ఈ విషయాన్ని షమి క్లోజ్ ఫ్రెండ్ ఉమేశ్ కుమార్ రివీల్ చేశాడు. ‘డైలీ ఒక కేజీ మటన్ తినకపోతే షమి బౌలింగ్ స్పీడ్ ఏకంగా 15 కిలోమీటర్లు తగ్గిపోతుంది. అతడి డైట్​లో మటన్ ఉండి తీరాల్సిందే. దేన్నయినా అతడు తట్టుకుంటాడు. కానీ భోజనంలో మటన్ లేకపోతే మాత్రం షమి అస్సలు ఉండలేడు’ అని ఉమేశ్ కుమార్ చెప్పుకొచ్చాడు.

ఒకవేళ ఏదైనా రోజు మటన్ తినకపోతే నెక్స్ట్ డే షమి డిఫరెంట్​గా బిహేవ్ చేస్తాడని, మూడో రోజు అతడికి మెంటల్ ఎక్కుతుందని చెబుతూ ఉమేశ్ కుమార్ నవ్వుల్లో మునిగిపోయాడు. షమి పూర్తి నాన్​వెజిటేరియన్ అని చెప్పాడు. ఇక, వన్డే వరల్డ్ కప్-2023 తర్వాత గాయం తిరగబెట్టడంతో షమి చాన్నాళ్లుగా క్రికెట్​కు దూరంగా ఉంటూ వస్తున్నాడు. సర్జరీ అనంతరం కొన్నాళ్లు రెస్ట్ తీసుకున్న ఈ ఎక్స్​ప్రెస్ బౌలర్.. రీసెంట్​గా బౌలింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. స్లో రనప్​తో అతడు బౌలింగ్ చేస్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. బంగ్లాదేశ్​ సిరీస్​తో అతడు తిరిగి కమ్​బ్యాక్ ఇచ్చే అవకాశం ఉందని కొత్త కోచ్ గౌతం గంభీర్ ఇటీవల ప్రెస్​మీట్​లో క్లారిటీ ఇచ్చాడు. మరి.. షమి రాక కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.

Show comments