iDreamPost
android-app
ios-app

ఆ స్టార్ బౌలర్ రికార్డ్ బ్రేక్.. షమీ అరుదైన ఘనత!

వరల్డ్ కప్ లో టీమిండియా అప్రతిహితంగా కొనసాగుతోంది. ఆరు మ్యాచుల్లో ఆరు విజయాలతో తిరుగులేకుండా దూసుకుపోతోంది. ఈ జైత్రయాత్రలో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో భారత జట్టు సమష్టి కృషితో రాణిస్తోంది.

వరల్డ్ కప్ లో టీమిండియా అప్రతిహితంగా కొనసాగుతోంది. ఆరు మ్యాచుల్లో ఆరు విజయాలతో తిరుగులేకుండా దూసుకుపోతోంది. ఈ జైత్రయాత్రలో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో భారత జట్టు సమష్టి కృషితో రాణిస్తోంది.

ఆ స్టార్ బౌలర్ రికార్డ్ బ్రేక్.. షమీ అరుదైన ఘనత!

వరల్డ్ కప్ 2023లో టీమిండియా దూసుకుపోతోంది. ఆడిన 6 మ్యాచుల్లో ఒక్క ఓటమి కూడా లేకుండా.. 12 పాయింట్లతో టేబుల్ టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. ఈ వరల్డ్ కప్ లో టీమిండియా బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టి కృషితో రాణిస్తోంది. బ్యాటింగ్ విభాగంలో విఫలమై.. తక్కువ స్కోర్ చేసినా కూడా బౌలర్లు ఆ టార్గెట్ ని ప్రొటెక్ట్ చేస్తూ విజయాలను అందిస్తున్నారు. బౌలింగ్ విభాగంలో మరీ ముఖ్యంగా మహ్మద్ షమీ రాణిస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. తాజాగా మహ్మద్ షమీ ఓ అరుదైన ఘనతను కూడా సొంతం చేసుకున్నాడు.

ఈ వరల్డ్ కప్ లో టీమిండియా జట్టు హవా కొనసాగుతోంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, పాకిస్తాన్ వంటి జట్లు కూడా భారత్ టీమ్ ముందు మోకరిల్లక తప్పలేదు. టీమిండియాకు వరల్డ్ కప్ సెమీస్ బెర్త్ దాదాపుగా ఖాయం అయిపోయినట్లే. ఈ జైత్రయాత్రలో కోహ్లీ, రోహిత్, కేఎల్ రాహుల్ వంటి బ్యాటర్లకు ఎంత భాగస్వామ్యం ఉందో.. అలాగే బౌలర్లది కూడా అదేస్థాయి పాత్ర ఉంది. ముఖ్యంగా మహ్మద్ షమీ టీమ్ లోకి వచ్చిన తర్వాత టీమిండియా బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారిపోయింది. భారత్ ను ఢీకొట్టాలి అంటే దాదాపుగా అసాధ్యం అయిపోయింది. ఎలాంటి బౌలర్ నైనా రోహిత్, విరాట్, రాహుల్ ఇరక్కొట్టేస్తుంటే.. ఎంతటి టాప్ బ్యాటర్ న అయినా కూడా షమీ పెవిలియన్ కి చేర్చేస్తున్నాడు. షమీ, బుమ్రా, సిరాజ్, కుల్దీప్, జడేజాలతో భారత్ బౌలింగ్ విభాగం కంచుకోటలా మారిపోయింది. ఇప్పుడు మహ్మద్ షమీ ఇంకో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే ఇంటర్నేషనల్స్ లో మొదటి బౌలర్ గా తన పేరును తిరగరాశాడు.

అజిత్ అగార్కర్ పేరిట ఉన్న ఒక అరుదైన రికార్డును మహ్మద్ షమీ తిరగరాశాడు. వన్డేల్లో ఒక ఇన్నింగ్స్ లో అత్యధికసార్లు 4 వికెట్లు తీసిన బౌలర్ గా షమీ రికార్డులకెక్కాడు. ఇప్పటి వరకు ఆ రికార్డు అజిత్ అగార్కర్(12సార్లు) పేరిట ఉండేది. తాజాగా ఇంగ్లాడ్ తో జరిగిన మ్యాచ్ తో షమీ ఈ రికార్డును అధిగమించాడు. 13సార్లు ఒకే ఇన్నింగ్స్ లో 4 వికెట్లు తీసిన బౌలర్ గా షమీ అరుదైన ఘనత సాధించాడు. ఈ రికార్డు గురించి పరిశీలిస్తే.. షమీ- 13 సార్లు, అజిత్ అగార్కర్- 12 సార్లు, అనిల్ కుంబ్లే- 10 సార్లు, జవగళ్ శ్రీనాథ్- 10 సార్లు, కుల్‌దీప్ యాదవ్- 9 సార్లు ఒకే ఇన్నింగ్‌లో నాలుగు వికెట్లను పడగొట్టారు. వరల్డ్ కప్ లో స్థానం దక్కించుకోవడం మాత్రమే కాకుండా షమీ ఇలాంటి అరుదైన ఘనతలను నమోదు చేస్తున్నాడు. షమీ ప్రదర్శనపై అటు క్రికెట్ అభిమానులు మాత్రమే కాకుండా విశ్లేషకులు, మాజీలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి.. మహ్మద్ షమీ సాధించిన ఈ అరుదైన ఘనతపై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.