SNP
Mohammad Rizwan, Babar Azam, PAK vs BAN: పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ మొహమ్మద్ రిజ్వాన్ 171 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పాక్ కెప్టెన్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. గ్రౌండ్ నుంచి డ్రెస్సింగ్ రూమ్‌కి వస్తూ.. రిజ్వాన్, బాబర్‌పై బ్యాట్ విసిరేశాడు. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Mohammad Rizwan, Babar Azam, PAK vs BAN: పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ మొహమ్మద్ రిజ్వాన్ 171 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పాక్ కెప్టెన్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. గ్రౌండ్ నుంచి డ్రెస్సింగ్ రూమ్‌కి వస్తూ.. రిజ్వాన్, బాబర్‌పై బ్యాట్ విసిరేశాడు. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
SNP
రెండు టెస్టుల సిరీస్ ఆడేందుకు బంగ్లాదేశ్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటిస్తోంది. ఈ నెల 21న రావాల్పిండి వేదికగా పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్.. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. బంగ్లాదేశ్ బౌలర్ల దెబ్బకు ఆరంభంలో ఇబ్బంది పడిన పాక్.. కేవలం 16 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ షఫీక్ 2, కెప్టెన్ షాన్ మసూద్ 6, బాబర్ ఆజమ్ డకౌట్ అయ్యారు. కానీ, ఆ తర్వాత.. సౌద్ షకీల్, మొహమ్మద్ రిజ్వాన్ సెంచరీలతో చెలరేగి పాకిస్థాన్ ఇన్నింగ్స్‌ను చక్కబెట్టారు. అంతకంటే ముందు ఓపెనర్ సైమ్ అయ్యూబ్ కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు.
సౌద్ షకీల్ 141 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కానీ, రిజ్వాన్ మాత్రం క్రీజ్‌లో పాతుకుపోయి.. డబుల్ సెంచరీ దిశగా పరుగులు తీస్తున్నాడు. కానీ, అతను 171 పరుగుల వద్ద ఉన్న సమయంలో పాకిస్థాన్ కెప్టెన్ షాన్ మసూద్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేస్తున్నట్లు ప్రకటించాడు. అప్పటికే పాక్ స్కోర్ 448 మాత్రమే. కానీ, బంగ్లాదేశ్‌కు అది సరిపోతుందని భావించి.. పాక్ కెప్టెన్ డిక్లేర్ చేశాడు. కానీ, రిజ్వాన్ 171 నాటౌట్‌గా ఉండి.. డబుల్ సెంచరీ చేసే అద్భుతమైన అవకాశాన్ని కోల్పోయాడు. షాన్ మసూద్ తీసుకున్న ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. రిజ్వాన్‌ను డబుల్ సెంచరీ చేయనివ్వకుండా అడ్డుకున్నారంటూ పాక్ క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే.. ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన తర్వాత.. గ్రౌండ్ వీడి డ్రెస్సింగ్ రూమ్‌కు వస్తున్న మొహమ్మద్ రిజ్వాన్‌కు పాకిస్తాన్ క్రికెటర్లు స్టాండింగ్ ఓవెషన్ ఇచ్చారు. సరిగ్గా బౌండరీ లైన్ దాటుతున్న సమయంలో తన కోసం నిల్చోని చప్పట్లు కొడుతున్న బాబర్ ఆజమ్‌పై రిజ్వాన్ తన బ్యాట్‌ను విసిరాడు. ఆ బ్యాట్‌ను బాబర్ క్యాచ్ అందుకున్నాడు. అయితే.. ఇదంతా సరదాగా జరిగింది. బాబర్-రిజ్వాన్ మంచి ఫ్రెండ్స్ అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ, 171 వ్యక్తిగత స్కోర్ వద్ద ఉన్న సమయంలో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయడంతో రిజ్వాన్‌కు కోపం వచ్చిందని, అందుకే బ్యాట్ విసిరేశాడని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. నిజానికి అది సరదాగా జరిగిన సంఘటన. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Muhammad Rizwan threw his bat towards Babar Azam after the innings was declared.
They are always having fun 😂❤️#PAKvBAN #PakistanCricket pic.twitter.com/Sbwfq6LHPN— Rao kashif (@raokash) August 22, 2024