SNP
Mohammad Rizwan, Virat Kohli: పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ మొహమ్మద్ రిజ్వాన్.. ఓ టీమిండియా క్రికెటర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అతన్ని చూసి ఎంతో నేర్చుకున్నాం అన్నాడు. అతను ఎవరో ఇప్పుడు చూద్దాం..
Mohammad Rizwan, Virat Kohli: పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ మొహమ్మద్ రిజ్వాన్.. ఓ టీమిండియా క్రికెటర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అతన్ని చూసి ఎంతో నేర్చుకున్నాం అన్నాడు. అతను ఎవరో ఇప్పుడు చూద్దాం..
SNP
ప్రస్తుతం పాకిస్థాన్ టీమ్ ఐర్లాండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా.. తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన పాక్ టీమ్ ప్రపంచ క్రికెట్ ముందు తమ పరువుపోగొట్టుకుంది. కానీ, రెండో మ్యాచ్‌లో తిరిగి పుంజుకుని.. తమ సత్తా చాటింది. ఈ మ్యాచ్ తర్వాత పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ రిజ్వాన్ ఓ టీమిండియా ఆటగాడిపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇన్‌ఫ్యాక్ట్ అతని ఆట చూసే తాము కొన్ని కీలక విషయాలు నేర్చుకున్నాం అంటూ ఆకాశానికెత్తేశాడు. ఇంతకీ రిజ్వాన్ మాట్లాడింది ఎవరి గురించి అనుకుంటున్నారా? ఇంకెవరు మన కింగ్ కోహ్లీ గురించి. విరాట్ కోహ్లి గొప్ప ప్లేయర్ అని, అతని ఆటను చూసి తమ జట్టు ఆటగాళ్లు ఎంతో నేర్చుకుంటున్నామని అన్నాడు.
ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తర్వాత రిజ్వాన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఆదివారం జరిగిన రెండో టీ20లో ఐర్లాండ్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది పాకిస్థాన్. సిరీస్‌ను 1-1తో సమం చేసింది. రిజ్వాన్ 46 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 75 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే ఫకార్ జమాన్ 40 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 78 పరుగులతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 193 పరుగుల భారీ స్కోర్ చేసింది. లోర్కన్ టెక్టర్ 34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51 పరుగులతో హాఫ్ సెంచరీ సాధించాడు.
అనంతరం ఛేజింగ్‌కు దిగిన పాకిస్థాన్ 16.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. టీ20 ఫార్మాట్‌లో కనీసం 1000కి పైగా పరుగులు సాధించిన ఆటగాళ్లలో 50 ప్లస్ సగటు సాధించిన ఆటగాళ్లు కేవలం ఇద్దరే ఇద్దరు. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లితో పాటు రిజ్వాన్ ఈ ఘనత అందుకున్నాడు. ఈ క్రమంలోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుంటూ.. ‘నంబర్ల గురించి నేను పట్టించుకోను. యావరేజ్ గురించి పట్టించుకుంటే మనం యావరేజ్ ప్లేయర్‌గానే మిగిలిపోతాం. మ్యాచ్ గురించి, మ్యాచ్ పరిస్థితుల గురించి ఆలోచిస్తే ఉత్తమంగా ఉంటుంది. ఇక విరాట్ కోహ్లి గురించి చెప్పాలంటే… అతను గొప్ప ఆటగాడు. అతని నుంచి మేం ఎంతో నేర్చుకున్నాం. అతని పట్ల నాకెంతో గౌరవం ఉంది’ అని రిజ్వాన్ అన్నాడు. మరి మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్లు ఆడటం కోహ్లీని చూసి నేర్చుకున్నాం అని రిజ్వాన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Mohammad Rizwan on Virat Kohli’s 50+ average in T20Is:
If you look at averages in T20 cricket, you are an average player 🇵🇰🇮🇳😭😭😭 #IREvPAK pic.twitter.com/MiQMIdAT91
— Farid Khan (@_FaridKhan) May 13, 2024