iDreamPost

Mohammad Nabi: సరి కొత్త వరల్డ్ రికార్డ్.. 45 దేశాలపై మ్యాచ్ గెలిచిన తొలి క్రికెటర్ ఇతనే!

ఆస్ట్రేలియాపై సాధించిన విజయంతో ప్రపంచ క్రికెట్ లో సరికొత్త చరిత్ర సృష్టించాడు ఆఫ్గాన్ సీనియర్ క్రికెటర్ మహ్మద్ నబీ. బహుశా ఈ ఘనత వరల్డ్ క్రికెట్ లో ఏ ఆటగాడు కూడా ఈ ఘనత సాధించలేదనుకుంటా. ఆ వివరాల్లోకి వెళితే..

ఆస్ట్రేలియాపై సాధించిన విజయంతో ప్రపంచ క్రికెట్ లో సరికొత్త చరిత్ర సృష్టించాడు ఆఫ్గాన్ సీనియర్ క్రికెటర్ మహ్మద్ నబీ. బహుశా ఈ ఘనత వరల్డ్ క్రికెట్ లో ఏ ఆటగాడు కూడా ఈ ఘనత సాధించలేదనుకుంటా. ఆ వివరాల్లోకి వెళితే..

Mohammad Nabi: సరి కొత్త వరల్డ్ రికార్డ్.. 45 దేశాలపై మ్యాచ్ గెలిచిన తొలి క్రికెటర్ ఇతనే!

ప్రపంచ క్రికెట్ లో ఆఫ్గానిస్తాన్ ను మెున్నటి వరకు ఓ పసికూన జట్టుగా చూసేవారు. కానీ వన్డే వరల్డ్ కప్ 2023 లో పెద్ద జట్లకు షాకిచ్చి.. పసికూన అనే ట్యాగ్ ను తొలగించుకుంటూ వస్తోంది. తాజాగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లకు ఊహించని షాకిచ్చింది ఆఫ్గాన్. దాంతో ఇక నుంచి వరల్డ్ క్రికెట్ లో మమ్మల్ని పసికూనలుగా భావించకూడదని వార్నింగ్ ఇచ్చింది. ఇక తాజాగా ఆస్ట్రేలియాపై సాధించిన విజయంతో ప్రపంచ క్రికెట్ లో సరికొత్త చరిత్ర సృష్టించాడు ఆఫ్గాన్ సీనియర్ క్రికెటర్ మహ్మద్ నబీ.

మహ్మద్ నబీ.. ప్రపంచ క్రికెట్ లో మేటి ఆల్ రౌండర్లలో ఒకడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు. బ్యాటర్ గా, బౌలర్ గా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో సైతం టీమ్ విజయాల్లో తనవంతు పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఆస్ట్రేలియాపై విజయం సాధించడం ద్వారా సరికొత్త చరిత్రను నెలకొల్పాడు ఆఫ్గాన్ వెటరన్ ఆల్ రౌండర్ మహ్మద్ నబీ. 45 దేశాలపై జట్టు సాధించిన విజయాల్లో అతడు భాగస్వామ్యం అయ్యాడు. బహుశా వరల్డ్ క్రికెట్ లో ఏ క్రికెటర్ కూడా ఈ రికార్డ్ ను సాధించలేదనుకుంటా.

అయితే ఆఫ్గానిస్తాన్ విజయాలు సాధించిన 45 దేశాల్లో 8 దేశాలు పూర్తి ఐసీసీ సభ్యత్వం కలిగినవి కావడం విశేషం. అందులో ఐర్లాండ్, జింబాబ్వే, వెస్టిండీస్, శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ దేశాలు ఉన్నాయి. 45 దేశాలపై విజయం సాధించడం అంటే మామూలు విషయం కాదు. 39 సంవత్సరాల నబీ.. 2009లో స్కాట్లాండ్ తో జరిగిన వన్డే ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. గత 15 సంవత్సరాలుగా ఆప్గానిస్తాన్ టీమ్ లో కీలక సభ్యుడిగా రాణిస్తూ వస్తున్నాడు. మరి క్రికెట్ చరిత్రలో మహ్మద్ నబీ సరికొత్త చరిత్ర సృష్టించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి