SRH బ్యాటర్‌ ట్రావిస్‌ హెడ్‌ ఆడినట్లు కోహ్లీ ఆడితే తిడతారు: టీమిండియా క్రికెటర్‌!

Mohammad Kaif, Virat Kohli, Travis Head: రాజస్థాన్‌ రాయల్స్‌పై ట్రావిస్‌ హెడ్‌ ఆడిన ఇన్నింగ్స్‌పై టీమిండియా మాజీ క్రికెటర్‌ మాట్లాడుతూ.. హెడ్‌లా కోహ్లీ ఆడి ఉంటే అంతా తిట్టే వారు అన్నాడు. అలా ఎందుకు అన్నాడో ఇప్పుడు చూద్దాం..

Mohammad Kaif, Virat Kohli, Travis Head: రాజస్థాన్‌ రాయల్స్‌పై ట్రావిస్‌ హెడ్‌ ఆడిన ఇన్నింగ్స్‌పై టీమిండియా మాజీ క్రికెటర్‌ మాట్లాడుతూ.. హెడ్‌లా కోహ్లీ ఆడి ఉంటే అంతా తిట్టే వారు అన్నాడు. అలా ఎందుకు అన్నాడో ఇప్పుడు చూద్దాం..

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో విరాట్‌ కోహ్లీ అద్భుతంగా ఆడుతున్నాడు. అయినా కూడా కోహ్లీపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా అతని స్ట్రైక్‌రేట్‌పై చాలా మంది కామెంట్‌ చేస్తున్నారు. రన్స్‌ చేసేందుకు ఎక్కువ బంతులు తీసుకుంటున్నాడని, ఇతర క్రికెటర్లు చాలా వేగంగా ఆడుతున్నా.. కోహ్లీ మాత్రం వన్డే ఇన్నింగ్స్‌లతో రన్స్‌ చేస్తున్నాడంటూ కొంతమంది విమర్శిస్తున్నారు. ఈ విషయంపై స్వయంగా కోహ్లీ కూడా స్పందించి.. తనపై వస్తున్న విమర్శలకు కౌంటర్‌ కూడా ఇచ్చాడు. చాలా మంది తన స్ట్రైక్‌ రేట్‌ గురించి మాట్లాడుతున్నారని, అయితే మ్యాచ్‌ గెలవడం కోసమే ఆడుతానని, గత 15 ఏళ్లుగా ఇదే చేస్తున్నాను అంటూ కోహ్లీ కాస్త ఘాటుగానే సమాధానం ఇచ్చాడు. అయినా కూడా అతనిపై విమర్శలు ఆడగడం లేదు.

ఈ క్రమంలోనే టీమిండియా మాజీ క్రికెటర్‌ మొహమ్మద్‌ కైఫ్‌ కోహ్లీకి మద్దతుగా మాట్లాడాడు. దాని కోసం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటర్‌ ట్రావిస్‌ హెడ్‌ ఆడిన ఇన్నింగ్స్‌ను ఉదాహరణగా పోలుస్తూ.. కోహ్లీకి సపోర్ట్‌ చేశాడు. రాజస్థాన్‌ రాయల్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌ 58 పరుగులతో రాణించాడు. ఈ సీజన్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో రెచ్చిపోతున్న హెడ్‌.. రాజస్థాన్‌పై మాత్రం 44 బంతులు ఎదుర్కొని 58 పరుగులు చేశాడు. కేవలం 131.82 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్‌ చేశాడు. ఇంత తక్కువ స్ట్రైక్‌రేట్‌తో ఈ సీజన్‌లో హెడ్‌ ఆడటం ఇదే మొదటి సారి. అయినా కూడా ట్రావిస్‌ హెడ్‌ ఆడింది చాలా మంచి ఇన్నింగ్స్‌ ఎందుకంటే.. పిచ్‌ బ్యాటింగ్‌కు అంత అనుకూలంగా లేదు.

ఇలాంటి ట్రిక్కి పిచ్‌పై ట్రావిస్‌ లాంటి విధ్వంసకర బ్యాటింగ్‌ 131 స్ట్రైక్‌రేట్‌తో ఆడాడు. కానీ, ఇదే పిచ్‌ విరాట్‌ కోహ్లీ కూడా సేమ్‌ ఇదే ఇన్నింగ్స్‌ ఆడితే మాత్రం చాలా మంది అతని స్ట్రైక్‌రేట్‌ గురించి విమర్శలు చేస్తారు. పిచ్‌ ఎలా ఉంది, టీమ్‌ ఏ పరిస్థితుల్లో ఉంది, ఎదురుగా ఎలాంటి బౌలర్‌ ఉన్నాడు.. ఇవేవి పట్టించుకోకుండా.. కేవలం కోహ్లీని విమర్శిస్తూ ఉంటారు కొంతమంది అంటూ కైఫ్‌ అన్నాడు. నిజానికి కైఫ్‌ చెప్పింది వందకు వంద శాతం నిజం. గురువారం హెడ్‌ ఆడిన ఇన్నింగ్స్‌లా కోహ్లీ కనుక ఆడి ఉంటే.. ఈ పాటికి సోషల్‌ మీడియాలో ఒక రేంజ్‌లో ట్రోలింగ్‌ జరిగేది. ఎందుకంటే.. విరాట్‌ కోహ్లీ సెట్‌ చేసిన సాండెడ్స్‌ అలాంటివి మరి. అతను ఆడిన ప్రతిసారి 50 బంతుల్లో సెంచరీ చేయాలని అంతా మానసికంగా ఫిక్స్‌ అయి ఉంటారు. అందుకే కోహ్లీ 60 బంతుల్లో సెంచరీ చేసినా.. అందరికీ అదో సాధారణ ఇన్నింగ్స్‌లా కనిపిస్తుంది. మరి కోహ్లీకి కైఫ్‌ మద్దతు పలకడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments