అప్పుడు రోహిత్‌ శర్మనే తిట్టారు.. నువ్వెంతా? కెప్టెన్‌ సూర్యకు కైఫ్‌ సలహా

అప్పుడు రోహిత్‌ శర్మనే తిట్టారు.. నువ్వెంతా? కెప్టెన్‌ సూర్యకు కైఫ్‌ సలహా

Mohammad Kaif, Suryakumar Yadav, Rohit Sharma, IND vs SL: భారత టీ20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌కు ఒక సలహా ఇస్తూ.. మాజీ క్రికెటర్‌ కైఫ్‌ ఒక వీడియో రిలీజ్‌చేశాడు. అందులో అతను ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..

Mohammad Kaif, Suryakumar Yadav, Rohit Sharma, IND vs SL: భారత టీ20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌కు ఒక సలహా ఇస్తూ.. మాజీ క్రికెటర్‌ కైఫ్‌ ఒక వీడియో రిలీజ్‌చేశాడు. అందులో అతను ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ టీ20 కెప్టెన్‌గా తొలి ఛాలెంజ్‌ కోసం రెడీ అయిపోయాడు. టీ20 వరల్డ్‌ కప్‌ 2024 గెలిచిన తర్వాత.. రోహిత్‌ శర్మ అంతర్జాతీయ టీ20 కెరీర్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించడంతో అతని స్థానంలో టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌ను నియమించింది బీసీసీఐ. గతంలో కూడా సూర్య భారత జట్టకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. కానీ, అప్పుడు అతను తాత్కాలిక కెప్టెన్‌ మాత్రమే. కానీ, ఇప్పుడు రెగ్యులర్‌ కెప్టెన్‌గా అపాయింట్‌ అయ్యాడు.

టీ20 జట్టుకు పూర్తి స్థాయి కెప్టెన్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌ శ్రీలంకతో టీ20 సిరీస్‌లో యంగ్‌ టీమిండియాను నడిపించబోతున్నాడు. లంకతో మూడు టీ20ల సిరీస్‌ నేడు(జులై 27, శనివారం) ప్రారంభం కానుంది. తొలి టీ20 శనివారం పల్లెకలె వేదికగా రాత్రి 7.30 గంటలకు షురూ అవుతుంది. అయితే.. ఈ తొలి మ్యాచ్‌కి ముందు టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ కోసం భారత మాజీ క్రికెటర్‌ మొహమ్మద్‌ కైఫ్‌ ఒక వీడియోను రిలీజ్‌ చేశాడు. కొత్త టీ20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్ సక్సెస్‌ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు కైఫ్‌ వెల్లడించాడు.

వీడియోలో కైఫ్‌ మాట్లాడుతూ.. ‘సూర్యకుమార్‌ యాదవ్‌ టీ20 కెప్టెన్‌గా జట్టును నడిపించబోతున్నాడు. మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అండర్‌లో సూర్య చాలా కాలం పాటు ఆడాడు. అతని కెప్టెన్సీలో ఆడటం సూర్యకు ఎంతో కలిసొచ్చే అంశం. ఆ అనుభవం ఇప్పుడతను ఉపయోగించుకోవచ్చు. అయితే.. కెప్టెన్‌గా ఉన్న సమయంలో విమర్శలు రావొచ్చు. వాటిని తట్టుకొని సూర్య నిలబడాలి. అంతెందుకు మొన్న టీ20 వరల్డ్‌ కప్‌ 2024కి వెళ్లేందుకు రోహిత్‌ శర్మపై విమర్శలు వచ్చాయి. ఐపీఎల్‌ 2024లో దారుణంగా విఫలమైన రోహిత్‌ శర్మ టీ20 వరల్డ్‌ కప్‌కు ఎందుకు అన్నారు. కానీ, రోహిత్‌.. తన అనుభవంతో భారత్‌కు టీ20 వరల్డ్‌ కప్‌ అందించాడు. అలానే సూర్య కూడా టీమిండియాను అద్భుతంగా నడిపించాలి. కెప్టెన్‌గా కష్టకాలం, విమర్శలు వచ్చిన సమయంలో రోహిత్‌ శర్మను గుర్తుకు తెచ్చుకో’ అంటూ కైఫ్‌ సూర్యకు మంచి సలహా ఇచ్చాడు. మరి కైప్‌ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments