iDreamPost
android-app
ios-app

రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఆల్​రౌండర్.. ఈసారి మెసేజ్ వస్తే డిలీట్ చేస్తానంటూ..!

  • Author singhj Published - 05:17 PM, Tue - 1 August 23
  • Author singhj Published - 05:17 PM, Tue - 1 August 23
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఆల్​రౌండర్.. ఈసారి మెసేజ్ వస్తే డిలీట్ చేస్తానంటూ..!

యాషెస్ సిరీస్ ఎందుకు అంత గ్రేట్ అనేది మరోమారు ప్రూవ్ అయింది. సంకుల సమరంగా చెప్పుకునే ఈ సిరీస్ మరోసారి అభిమానులను ఫుల్ ఎంటర్​టైన్ చేసింది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచుల యాషెస్ సిరీస్ టీ20 క్రికెట్​ను మించిన ఉత్కంఠతో సాగింది. ఈ సిరీస్​ను ఇరు జట్లు 2-2తో సమంగా పంచుకున్నాయి. ఆఖరి టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ 49 రన్స్ తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సిరీస్​కు గొప్ప ముగింపు లభించినట్లు అయింది. సిరీస్ ఆఖరి రోజు రెండు టీమ్స్ నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. ఒకవైపు వర్షం దోబూచులాడుతుండగా.. మరోవైపు గెలుపు కోసం ఇరు జట్లు భీకర పోరాటాన్ని కొనసాగించాయి.

చివరి వరకు హోరాహోరీగా సాగిన ఐదో టెస్టులో ఆఖరికి విజయం ఇంగ్లండ్​ సొంతమైంది. దీంతో లాస్ట్ టెస్ట్ ఆడుతున్న దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్​కు తన టీమ్ ఘనమైన వీడ్కోలు ఇచ్చినట్లయింది. రెండో ఇన్నింగ్స్​లో మర్ఫీ, కేరీలను ఔట్ చేసిన బ్రాడ్ తన కెరీర్​ను గొప్పగా ముగించాడు. ఈ సిరీస్​లో ఇంగ్లండ్ కమ్​బ్యాక్ ఇచ్చిన విధానాన్ని మెచ్చుకోక తప్పదు. తొలి రెండు టెస్టుల్లో ఓడిన తర్వాత ఆ జట్టు పుంజుకొని రెండు టెస్టులు గెలిచిన తీరు అసాధారణం అనే చెప్పాలి. ఒకవేళ చివరి రోజు వర్షంతో ఆట రద్దు కాకపోతే నాలుగో టెస్టులోనూ ఆ టీమే నెగ్గేది. కాగా, ఇంగ్లండ్ స్టార్ ఆల్​రౌండర్ మొయిన్ అలీ టెస్టు క్రికెట్​కు గుడ్​ బై చెప్పాడు.

యాషెస్ ఐదో టెస్టు తర్వాత మొయిన్ అలీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ మ్యాచ్​లో ఆసీస్​పై ఇంగ్లండ్ గెలుపులో అతడు కీలక పాత్ర పోషించాడు. మూడు వికెట్లు తీసి తన కంగారూలను కట్టడి చేశాడు. ఇక, మొయిన్ అలీ 2021 సెప్టెంబర్​లోనే టెస్టులకు రిటైర్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్​కు ముందు ఇంగ్లండ్ స్పిన్నర్ జాక్ లీచ్ గాయపడ్డాడు. అతడి ప్లేసులో ఆడాల్సిందిగా మొయిన్ అలీని జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్, కోచ్​ మెక్​కల్లమ్ నచ్చజెప్పారు. దీంతో అతడు తన రిటైర్మెంట్​ను వెనక్కి తీసుకున్నాడు. అయితే చివరి టెస్టు అనంతరం మొయిన్ అలీ మాట్లాడుతూ.. రిటైర్మెంట్ గురించి ఈసారి గనుక స్టోక్స్ నుంచి మెసేజ్ వస్తే వెంటనే డిలీట్ చేస్తానని చెప్పాడు. యాషెస్ సిరీస్​లో మోస్తరుగా రాణించిన అలీ.. 180 రన్స్​తో పాటు 9 వికెట్లు సాధించాడు.