iDreamPost
android-app
ios-app

వార్నర్ మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడా? SRH అందుకే తీసేసిందా? దానం ఏది నిజం?

  • Published Apr 05, 2024 | 8:25 PM Updated Updated Apr 05, 2024 | 8:25 PM

గతంలో సన్ రైజర్స్ కెప్టెన్ గా ఉన్నప్పుడు డేవిడ్ వార్నర్ మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడని ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించాడు. మరి నిజంగానే వార్నర్ మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడా? దానం అతడిపై కంప్లైంట్ ఇచ్చినందుకే తీసేశారా? ఏది నిజం? పూర్తి వివరాల్లోకి వెళితే..

గతంలో సన్ రైజర్స్ కెప్టెన్ గా ఉన్నప్పుడు డేవిడ్ వార్నర్ మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడని ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించాడు. మరి నిజంగానే వార్నర్ మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడా? దానం అతడిపై కంప్లైంట్ ఇచ్చినందుకే తీసేశారా? ఏది నిజం? పూర్తి వివరాల్లోకి వెళితే..

వార్నర్ మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడా? SRH అందుకే తీసేసిందా? దానం ఏది నిజం?

ఐపీఎల్ 2024 సీజన్ లో మరో హై ఓల్టేజ్ మ్యాచ్ జరుగుతోంది. హైదరాబాద్ హోం గ్రౌండ్ అయిన ఉప్పల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో ఢీ కొంటోంది సన్ రైజర్స్ టీమ్. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. నెక్ట్స్ సీజన్ లో హైదరాబాద్ జట్టులో హైదరాబాద్ కు చెందిన ప్లేయర్లు ఉండాలని, లేకుంటే ఉప్పల్ లో మ్యాచ్ లు జరగనివ్వమని వార్నింగ్ కూడా ఇచ్చారు దానం. లోకల్ ప్లేయర్లకు అండగా నిలిచిన దానం తన మంచి తనాన్ని చాటుకున్నారు. అయితే ఈ సందర్భంగా మరికొన్ని ప్రశ్నలను లేవనెత్తారు. గతంలో సన్ రైజర్స్ కెప్టెన్ గా ఉన్నప్పుడు డేవిడ్ వార్నర్ మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడని దానం ఆరోపించాడు. మరి నిజంగానే వార్నర్ మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడా? దానం అతడిపై కంప్లైంట్ ఇచ్చినందుకే తీసేశారా? ఏది నిజం? పూర్తి వివరాల్లోకి వెళితే..

సన్ రైజర్స్ వర్సెస్ చెన్నై మ్యాచ్ కు ముందు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం ఐపీఎల్ లో హాట్ టాపిక్ గా మారాయి. వచ్చే సీజన్ లో హైదరాబాద్ టీమ్ లో హైదరాబాద్ ప్లేయర్లు ఉండాలని, లేకుంటే ఉప్పల్ లో ఒక్క మ్యాచ్ కూడా జరగనివ్వమని వార్నింగ్ ఇచ్చాడు. ఇది ఆహ్వానించదగ్గ విషయమే. ఇంతవరకు బాగానే ఉన్నా.. తర్వాత చేసిన కామెంట్సే ప్రస్తుతం వైరల్ గా మారాయి. డేవిడ్ వార్నర్ మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడని నేను కంప్లైంట్ ఇవ్వడం వల్లే అతడిని తీసేశారని దానం చెప్పుకొచ్చాడు. అయితే ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల వల్ల కొన్ని ప్రశ్నలు క్రికెట్ అభిమానుల్లో రేకెత్తుతున్నాయి. అవేంటంటే?

Warner

డేవిడ్ వార్నర్ నిజంగానే మ్యాచ్ ఫిక్సింగ్ చేసుంటే? ఇన్ని రోజులు ఆ విషయం ఎందుకు బయటకి రాలేదు. అదీకాక వార్నర్ ఫిక్సింగ్ కు పాల్పడ్డట్లు ఏమైనా ఆధారాలు దానం నాగేందర్ దగ్గర ఉన్నాయా? అని ప్రశ్నిస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ఒకవేళ ఉంటే.. ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు? దానం ఇచ్చిన ఫిర్యాదు కారణంగానే వార్నర్ ను తొలగించారా? ఇన్ని ప్రశ్నలకు ఆన్సర్ దొరకాలంటే? ఈ విషయంలో డేవిడ్ భాయ్ కూడా స్పందించాల్సి ఉంది. తన అసాధారణ బ్యాటింగ్ తో సన్ రైజర్స్ కు ఎన్నో విజయాలను అందించిన వార్నర్.. తెలుగు ఫ్యాన్స్ హృదయాల్లో చోటు దక్కించుకున్నాడు. మరి వార్నర్ మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడన్న ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: Hardik Pandya: వీడియో: వరుస ఓటములు.. దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన పాండ్యా!