Somesekhar
IPL.. క్యాష్ రిచ్ లీగ్ గా పేరుగాంచిన ఈ టోర్నీలో ఆడాలని ప్రతీ ఒక్క క్రికెటర్ కలలు కంటారు.
IPL.. క్యాష్ రిచ్ లీగ్ గా పేరుగాంచిన ఈ టోర్నీలో ఆడాలని ప్రతీ ఒక్క క్రికెటర్ కలలు కంటారు.
Somesekhar
IPL.. క్యాష్ రిచ్ లీగ్ గా పేరుగాంచిన ఈ టోర్నీలో ఆడాలని ప్రతీ ఒక్క క్రికెటర్ కలలు కంటారు. ఇక ఈ లీగ్ లో సత్తాచాటి.. జాతీయ జట్టులో స్థానం సంపాదించాలన్నది యువ క్రికెటర్ల భావన. అలాంటి ఐపీఎల్ టోర్నీలోకి 8 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నాడు ఆసీస్ స్పీడ్ స్టర్ మిచెల్ స్టార్క్. 2014 ఐపీఎల్ సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున ఎంట్రీ ఇచ్చిన ఈ స్టార్ బౌలర్ మరుసటి ఏడాది నుంచే ఐపీఎల్ నుంచి వైదొలిగాడు. అయితే 2024 ఐపీఎల్ కు అందుబాటులో ఉంటానని స్టార్క్ స్పష్టం చేశాడు. కాగా.. అతడి రీ ఎంట్రీకి భారీ ప్లాన్ తోనే వస్తున్నాడు.
మిచెల్ స్టార్క్.. ఆస్ట్రేలియా పేస్ దళానికి వెన్నముక. తన పదునైన పేస్ తో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బందులు పెట్టడంతో సిద్దహస్తుడు. పేస్, స్వింగ్, లైన్ అండ్ లెంగ్త్, స్పీడ్ అన్ని విభాగాల్లో స్ట్రాంగ్ బౌలర్ స్టార్క్. తాజాగా తన ఐపీఎల్ రీఎంట్రీ గురించి వెల్లడించాడు. ఓ స్పోర్ట్స్ ఛానల్ తో మాట్లాడుతూ.. “ఐపీఎల్ 2024 సీజన్ కు తప్పక అందుబాటులో ఉంటాను. ఇప్పటికే ఎనిమిదేళ్లు గడిచాయి. టీ20 ప్రపంచ కప్ ముందు ఈ టోర్నీ నాకెంతగానో ఉపయోగపడుతుంది. ఇలాంటి అవకాశాన్ని ఏ క్రికెటర్ వదులుకోడు. ఐపీఎల్ ఆడేందుకు ఆసక్తి చూపడానికి ఇది కూడా ఒక కారణం” అంటూ స్టార్క్ చెప్పుకొచ్చాడు.
ఇక ఈ విషయం తెలిసిన క్రికెట్ ఫ్యాన్స్ స్టార్క్ పెద్ద స్కెచే వేశాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. 2018లో కోల్ కత్తా నైట్ రైడర్స్ అతడిని కొనుగోలు చేయగా.. గాయం కారణంగా ఆడలేకపోయాడు. అయితే టెస్ట్ క్రికెట్ కే తన తొలి ప్రాధాన్యం అని ఐపీఎల్ కు దూరం అయ్యాడు. మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఓ మాస్టర్ ప్లాన్ తో ఐపీఎల్ రీఎంట్రీకి సిద్ధం అయ్యాడు స్టార్క్. ఇక ప్రపంచ కప్ 2023 టోర్నీకి ఆసీస్ ప్రకటించిన 15 సభ్యుల జట్టులో మిచెల్ స్టార్క్ స్థానం దక్కించుకున్న విషయం తెలిసిందే. మరి టీ20 ప్రపంచ కప్ ముందు స్టార్క్ భారీ ప్లాన్ తో రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.