Somesekhar
జస్ప్రీత్ బుమ్రా లాంటి బౌలర్ ఐపీఎల్లోనే లేడంటే అతిశయోక్తి కాదు. మరి అలాంటి బౌలర్ కంటే డబుల్ ధరకు మిచెల్ స్టార్క్ ను ఎందుకు కొనుగోలు చేశారు? బుమ్రా కంటే స్టార్క్ గొప్పా? ఓసారి పరిశీలిద్దాం.
జస్ప్రీత్ బుమ్రా లాంటి బౌలర్ ఐపీఎల్లోనే లేడంటే అతిశయోక్తి కాదు. మరి అలాంటి బౌలర్ కంటే డబుల్ ధరకు మిచెల్ స్టార్క్ ను ఎందుకు కొనుగోలు చేశారు? బుమ్రా కంటే స్టార్క్ గొప్పా? ఓసారి పరిశీలిద్దాం.
Somesekhar
క్యాష్ రిచ్ లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు సంబంధించిన 2024 మినీ వేలం ముగిసింది. ఈ వేలంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లపై కోట్లు కుమ్మరించాయి ఫ్రాంచైజీలు. ఇక వీరితో పాటుగా భారత్ కు చెందిన అన్ క్యాప్డ్ ప్లేయర్లపై కూడా కాసుల వర్షం కురిసింది. కాగా.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయి రికార్డు నెలకొల్పాడు ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్. అతడిని కోల్ కత్తా నైట్ రైడర్స్ రూ. 24.75 కోట్ల భారీ ధరకు దక్కించుకుని అందరిని ఆశ్చర్యపరిచింది. ఇతడి తర్వాత వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ను రూ. 20.50 కోట్లకు కొనుగోలు చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం. ఈ క్రమంలోనే క్రికెట్ ప్రపంచానికి ఓ ప్రశ్న ఎదురౌతోంది. అదేంటంటే? జస్ప్రీత్ బుమ్రా లాంటి బౌలర్ ఐపీఎల్లోనే లేడంటే అతిశయోక్తి కాదు. మరి అలాంటి బౌలర్ కంటే డబుల్ ధరకు మిచెల్ స్టార్క్ ను ఎందుకు కొనుగోలు చేశారు? బుమ్రా కంటే స్టార్క్ గొప్పా? ఓసారి పరిశీలిద్దాం.
జస్ప్రీత్ బుమ్రా.. వరల్డ్ క్లాస్ బౌలర్, డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ గా, యార్కర్ల కింగ్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక తాజాగా జరిగిన వరల్డ్ కప్ లో అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్ గా అగ్రస్థానంలో నిలిచి ఘనతకెక్కాడు. ఇక ఐపీఎల్ లో బుమ్రాకు తిరుగులేదనే చెప్పాలి. ఐపీఎల్ కెరీర్ లో ఇప్పటి వరకు 120 మ్యాచ్ లు ఆడిన బుమ్రా 145 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఐదు వికెట్లు ఒకసారి పడగొట్టాడు. 2013లో ఐపీఎల్లోకి అరంగేట్రం చేసిన బుమ్రా.. అప్పటి నుంచి ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ టీమ్ లోనే కొనసాగుతూ వస్తున్నాడు. ఇక ఈ మెగాటోర్నీలో 7.4 ఎకానమీతో 145 వికెట్లు పడగొట్టి సత్తా చాటుతూనే ఉన్నాడు బుమ్రా. మరీ ముఖ్యంగా డెత్ ఓవర్లలో యార్కర్లు సంధిస్తూ.. ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించడంలో సిద్దహస్తుడు. ప్రస్తుతం టీమిండియా బౌలింగ్ దళానికి నాయకత్వం వహిస్తున్నాడు బుమ్రా.
మరి అలాంటి బుమ్రాను ఐపీఎల్ వేలంలో కేవలం 12 కోట్ల ధరకే దక్కించుకుంది ముంబై ఇండియాన్స్. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే? 2013లో ఈ ధర చాలా ఎక్కువనే చెప్పాలి. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం మిచెల్ స్టార్క్ టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాడు. దానికి కారణం అతడిని అత్యంత భారీ ధరకు కోల్ కత్తా కొనుగోలు చేయడమే. రూ.24.75 కోట్లు పెట్టి కోల్ కత్తా నైట్ రైడర్స్ స్టార్క్ ను కొనుగోలు చేసింది. ఈ ధర బుమ్రా ధరకు డబుల్ కావడం గమనార్హం. అయితే ఇంత ధరకు మిచెల్ స్టార్క్ ను కొనుగోలు చేయడం ఏంటని కొందరు క్రీడా పండితులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే స్టార్క్ ప్రధానంగా లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ కావడమే అతడి బలం. ఇలాంటి బౌలర్లను ఎదుర్కొవడం బ్యాటర్లకు సవాలనే చెప్పాలి. అందులోనా స్టార్క్ లాంటి స్పీడ్ స్టార్స్ ను ఎదుర్కోవాలంటే కాస్త గుండె ధైర్యం ఎక్కువే ఉండాలి. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ లో బంతులు సంధించడంలో స్టార్క్ దిట్ట.
ఇక మిచెల్ స్టార్క్ ఐపీఎల్ ఎంట్రీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ప్రారంభమైంది. 2014లో అతడిని రూ. 5 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే గాయాల కారణంగా ఎక్కువ కాలం ఐపీఎల్ లో కొనసాగలేకపోయాడు. ఐపీఎల్ లో అతడు కేవలం 27 మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. ఈ 27 మ్యాచ్ ల్లో 7.17 ఎకానమీతో 34 వికెట్లు పడగొట్టాడు. ఈ లెక్కన చూసుకుంటే.. ఐపీఎల్లో బుమ్రాకు ఉన్నంత అనుభవం స్టార్క్ కు లేదనే చెప్పాలి. అయితే స్టార్క్ తన మెరుపు బంతులతోనే ప్రత్యర్థి ఆటగాళ్ల వెన్నులో వణుకుపుట్టించగలడు. కాగా.. బుమ్రా, స్టార్క్ లలో ఐపీఎల్ బెస్ట్ బౌలర్ ఎవరు? అంటే చాలా మంది బుమ్రా అనే సమాధానం చెబుతారు. కానీ 2013లో 12 కోట్లు పెట్టి బుమ్రాను కొనుగోలు చేయడం చిన్న విషయం కాదు. ఈ లెక్కన చూసుకుంటే.. స్టార్క్ కంటే బుమ్రానే గొప్ప అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మరి ఐపీఎల్లో బెస్ట్ బౌలర్ ఎవరు? బుమ్రానా? లేక మిచెల్ స్టార్కా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.