iDreamPost
android-app
ios-app

వీడియో: బాల్‌ ఆఫ్‌ ది టోర్నీ! స్టార్క్‌ అంటే ఏంటో చెప్పే డెలవరీ! చూస్తే వావ్‌ అనాల్సిందే

  • Published May 27, 2024 | 2:47 PM Updated Updated May 27, 2024 | 2:47 PM

Mitchell Starc, Abhishek Sharma: కేకేఆర్‌ వర్సెస్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ మధ్య జరిగిన ఐపీఎల్‌ 2024 ఫైనల్‌ మ్యాచ్‌లో మిచెల్‌ స్టార్క్‌ వేసిన ఓ బాల్‌ చూస్తే.. వావ్‌ అంటారు. ఆ డెలవరీ గురించి మరిన్ని విశేషాలు ఇప్పుడు చూద్దాం..

Mitchell Starc, Abhishek Sharma: కేకేఆర్‌ వర్సెస్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ మధ్య జరిగిన ఐపీఎల్‌ 2024 ఫైనల్‌ మ్యాచ్‌లో మిచెల్‌ స్టార్క్‌ వేసిన ఓ బాల్‌ చూస్తే.. వావ్‌ అంటారు. ఆ డెలవరీ గురించి మరిన్ని విశేషాలు ఇప్పుడు చూద్దాం..

  • Published May 27, 2024 | 2:47 PMUpdated May 27, 2024 | 2:47 PM
వీడియో: బాల్‌ ఆఫ్‌ ది టోర్నీ! స్టార్క్‌ అంటే ఏంటో చెప్పే డెలవరీ! చూస్తే వావ్‌ అనాల్సిందే

కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ ఐపీఎల్‌ 2024 ఛాంపియన్‌గా అవతరించింది. ఆదివారం చెన్నైలోని చెపాక్‌ క్రికెట్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాత నెగ్గి.. విజేతగా నిలిచింది. మ్యాచ్‌ ఆరంభం నుంచి ఎస్‌ఆర్‌హెచ్‌పై పూర్తిగా డామినేట్‌ చేసిన కేకేఆర్‌.. వార్‌ వన్‌సైడ్‌ చేసేసింది. ఈ విజయంతో.. మూడో కప్పును తమ ఖాతాలో వేసుకుంది కేకేఆర్‌. అయితే.. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ స్టార్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ వేసిన ఒక బాల్‌.. మ్యాచ్‌కే కాదు మొత్తం టోర్నీకే హైలెట్‌గా నిలిచింది. ఇలాంటి బౌలింగ్‌ కోసమే కదా మిచెల్‌ స్టార్క్‌ను తీసుకుంది అని ప్రతి కేకేఆర్‌ అభిమాని అనుకుని ఉంటాడు. ఆ డెలవరీ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రతిష్టాత్మక ఫైనల్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. సేమ్‌ పిచ్‌పై జరిగిన క్వాలిఫైయర్‌-2లో తొలుత బ్యాటింగ్‌ చేసి మ్యాచ్‌ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్‌.. సేమ్‌ మ్యాజిక్‌ను ఇక్కడ కూడా రిపీట్‌ చేద్దాం అనుకున్నాడు కమిన్స్‌. కానీ, అతని ప్లాన్స్‌కు మిచెల్‌ స్టార్క్‌ అడ్డుపడ్డాడు. ఈ సీజన్‌లో భీకరమైన ఓపెనింగ్‌ జోడీగా పేరు తెచ్చుకున్న ఎస్‌ఆర్‌హెచ్‌ ఓపెనింగ్‌ జోడీని తొలి ఓవర్‌నే విడదీశాడు. విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మను తొలి ఓవర్‌ ఐదో బంతికి క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. ఆ బాల్‌ చూస్తూ.. ఎవరైనా వావ్‌ అనాల్సిందే. ఈ సీజన్‌లో పవర్‌ ప్లేలో అద్భుతంగా ఆడుతూ.. మరో యువరాజ్‌ సింగ్‌ అంటూ పొగడ్తలు అందుకున్న అభిషేక్‌ శర్మ దిమ్మతిరిగే బాల్‌ వేశాడు స్టార్క్‌.

నిజానికి ఈ సీజన్‌ ఆరంభంలో స్టార్క్‌ చాలా దారుణంగా విఫలం అయ్యాడు. ధారళంగా పరుగులు సమర్పించుకుంటూ.. తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత ఎక్కువ ధర పలికిన ఆటగాడిగా స్టార్క్‌ నిలిచాడు. ఐపీఎల్‌ 2024 కోసం.. 2023 ఏడాది చివర్లో జరిగిన ఐపీఎల్‌ వేలంలో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ స్టార్క్‌ను ఏకంగా 24.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. అయితే.. సీజన్‌ ఆరంభంలో స్టార్క్‌ ప్రదర్శన చూసి.. 24 కోట్లు దండగా అన్నారు క్రికెట్‌ అభిమానులు. కానీ, క్వాలిఫైయర్‌-1, ఫైనల్‌ మ్యాచ్‌లో మిచెల్‌ స్టార్క్‌ బౌలింగ్‌ చూసి.. ముఖ్యంగా ఫైనల్‌లో అభిషేక్‌ శర్మను అవుట్‌ చేసిన బాల్‌ చూసి.. ఆ బాల్‌కు 24 కోట్లు తక్కువే అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.