డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ ను ఉద్దేశించి షాకింగ్ కామెంట్స్ చేశాడు ఆ జట్టు మాజీ పేసర్ మిచెల్ జాన్సన్. అతడికి ఘన వీడ్కోలు ఎందుకు? అంటూ ప్రశ్నించాడు.
డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ ను ఉద్దేశించి షాకింగ్ కామెంట్స్ చేశాడు ఆ జట్టు మాజీ పేసర్ మిచెల్ జాన్సన్. అతడికి ఘన వీడ్కోలు ఎందుకు? అంటూ ప్రశ్నించాడు.
క్రికెట్ లో జాతీయ జట్టుకు తమ అమూల్యమైన సేవలను అందించిన ఆటగాళ్లకు చివర్లో ఘనమైన వీడ్కోలు పలకడం ఎన్నో ఏళ్లుగా సంప్రదాయంగా వస్తోంది. ఇక ఇదే సంప్రదాయాన్ని ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కు నిర్వహించాలని ఆసీస్ మేనేజ్ మెంట్ భావించింది. సొంతగడ్డపై పాకిస్థాన్ తో జరగనున్న టెస్ట్ సిరీస్ తర్వాత సూదీర్ఘ ఫార్మాట్ కు వీడ్కోలు పలకనున్నాడు వార్నర్. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రకటించాడు. ఈ క్రమంలో వార్నర్ వీడ్కోలు ను ఉద్దేశించి షాకింగ్ కామెంట్స్ చేశాడు ఆ జట్టు మాజీ పేసర్ మిచెల్ జాన్సన్. అతడికి ఘన వీడ్కోలు ఎందుకు? అంటూ ప్రశ్నించాడు.
పాకిస్థాన్ తో టెస్ట్ సిరీస్ అనంతరం డేవిడ్ వార్నర్ టెస్ట్ లకు రిటైర్ మెంట్ ప్రకటిస్తానని ఇప్పటికే ప్రకటించాడు. దీంతో వార్నర్ కు ఘనంగా వీడ్కోలు పలికేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే షాకింగ్ కామెంట్స్ చేశాడు ఆసీస్ మాజీ పేసర్ మిచెల్ జాన్సన్. “టెస్ట్ క్రికెట్ లో దారుణంగా విఫలం అవుతున్న వార్నర్ కు ఘనమైన వీడ్కోలు ఎందుకు? అదీకాక ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణం బాల్ టాంపరింగ్ వివాదంలో నిలిచిన వార్నర్ కు హీరోగా వీడ్కోలు పలకడం అవసరమా? అసలు అతడికి రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఎందుకిచ్చారు?” అంటూ క్రికెట్ ఆస్ట్రేలియాపై ప్రశ్నల వర్షం కురిపించాడు మిచెల్ జాన్సన్. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు క్రీడా ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి. కాగా.. బాల్ టాంపరింగ్ తప్పితే మిగతా ఏ వివాదాలూ లేని వార్నర్ పై జాన్సన్ కు ఎందుకింత కోపం అంటూ సగటు క్రికెట్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి వార్నర్ వీడ్కోలు పై జాన్సన్ చేసిన వ్యాఖ్యలు మీకేవిధంగా అనిపించాయో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Mitchell Johnson has not held back on his thoughts about David Warner! pic.twitter.com/GBJHZ1Xb2I
— Sky Sports Cricket (@SkyCricket) December 3, 2023