VIDEO: పసికూనపై గెలిచి ప్రపంచ కప్‌ గెలిచినట్లు పాక్‌ కోచ్‌ ఓవర్‌ యాక్షన్‌!

పాకిస్థాన్‌ జట్టు సెమీస్‌కు వెళ్లాడం కష్టంగానూ.. ఇంటికి వెళ్లేందుకు రెడీగానూ ఉన్న జట్టు. నాలుగు వరుస ఓటముల తర్వాత ఆ జట్టుకు బంగ్లాదేశ్‌పై ఓ గెలుపు వచ్చింది. ఈ గెలుపుతో ఆ జట్టు కోచ్‌ ఎలా రియాక్ట్‌ అవుతున్నాడో మీరే చూడండి.

పాకిస్థాన్‌ జట్టు సెమీస్‌కు వెళ్లాడం కష్టంగానూ.. ఇంటికి వెళ్లేందుకు రెడీగానూ ఉన్న జట్టు. నాలుగు వరుస ఓటముల తర్వాత ఆ జట్టుకు బంగ్లాదేశ్‌పై ఓ గెలుపు వచ్చింది. ఈ గెలుపుతో ఆ జట్టు కోచ్‌ ఎలా రియాక్ట్‌ అవుతున్నాడో మీరే చూడండి.

ఈ వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో పాకిస్థాన్‌ జట్టు చెత్త ఆటతో విమర్శల పాలవుతోంది. టోర్నీ ఆరంభానికి ముందు హాట్‌ పేవరెట్స్‌లో ఒకటిగా ఉన్న పాకిస్థాన్‌.. ఆరంభంలో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి తాము నిజంగానే హాట్‌ పేవరెట్స్‌ అన్నట్లు కనిపించింది. కానీ, టీమిండియాతో ఆడిన మూడో మ్యాచ్‌తో ఆ జట్టు తలరాతే మారిపోయింది. అప్పటి వరకు ఎంతో బలంగా, పటిష్టంగా కనిపించిన పాకిస్థాన్‌.. టీమిండియా దెబ్బకు పసికూనలా మారిపోయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా చేతిలోనూ పాకిస్థాన్‌ చావు దెబ్బతింది. టీమిండియా, ఆస్ట్రేలియా పెద్ద టీమ్స్‌ అనుకుంటే.. అత్యంత ఘోరంగా పసికూన ఆఫ్ఘనిస్థాన్‌ చేతిలోను ఓడిపోయింది పాకిస్థాన్‌. ఈ ఓటమితో మానసికంగా కూడా పాకిస్థాన్‌ జట్టు దెబ్బతింది.

వరుసగా మూడు ఓటముల తర్వాత సెమీస్‌ చేరడంపై అనుమానాలు తలెత్తున్న సమయంలో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లోనూ ఓటమి పాలైయింది. దీంతో ఇక పాకిస్థాన్‌ సెమీస్‌ చేరడం కష్టమే అని దాదాపు ఆ దేశ క్రికెట్‌ అభిమానులు సైతం ఫిక్స్‌ అయ్యారు. అయితే.. ఇంకా పాకిస్థాన్‌ అధికారికంగా వరల్డ్‌ కప్‌ టోర్నీ నుంచి నిష్క్రమించలేదు. కొన్ని సమీకరణాలు వారు సెమీస్‌ చేరేందుకు అవకాశం కలిపిస్తున్నాయి. అవన్నీ అంత ఈజీ కాకపోయినా.. అసాధ్యం అయితే కాదు. వేరే టీమ్స్‌ విజయాలపై ఆధారపడటం కంటే ముందు.. సెమీస్‌ రేసులో నిలవాలంటే.. పాకిస్థాన్‌ కూడా మ్యాచ్‌లు గెలవాలి. ఈ క్రమంలోనే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై పాకిస్థాన్‌ విజయం సాధించి.. వరుస ఓటములకు బ్రేక్ వేసింది.

అయితే.. బంగ్లాదేశ్‌పై విజయం తర్వాత పాకిస్థాన్‌ జట్టులో ఓ కొత్త జోష్‌ వచ్చినట్లు కనిపిస్తోంది. కాగా, పాకిస్థాన్‌ కోచ్‌ మిక్కీ ఆర్థర్ మాత్రం కాస్త ఎక్కువగానే ఎగ్జైట్‌ అవుతున్నాడు. వరుసగా నాలుగు ఓటములు, అందులోనా ఆఫ్ఘనిస్థాన్‌ లాంటి జట్టు చేతిలో ఓడిపోయినా కూడా.. బంగ్లాదేశ్‌ లాంటి పసికూనపై గెలిచిన తర్వాత.. ఏదో వరల్డ్‌ కప్‌ గెలిచినట్లు డ్రెస్సింగ్‌ రూమ్‌లో సై సినిమాలో రాజీవ్‌ కనకాల ఇచ్చే అగ్రెసివ్‌ సీన్‌ రేంజ్‌లో ఇస్తున్నాడంటూ క్రికెట్‌ అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో పాకిస్థాన్‌ కోచ్‌ ఆర్థర్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌లో పాక్‌ ఆటగాళ్లకు ఇచ్చిన స్పీచ్‌ వైరల్‌గా మారింది. మరి కిందున్న వీడియో చూసి.. ఆర్థర్‌ స్పీడ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments