iDreamPost
android-app
ios-app

Ashes 2023: బెయిర్ స్టో వివాదాస్పద ఔట్! ఆ ముగ్గురిపై వేటు..

  • Author Soma Sekhar Published - 04:42 PM, Mon - 3 July 23
  • Author Soma Sekhar Published - 04:42 PM, Mon - 3 July 23
Ashes 2023: బెయిర్ స్టో వివాదాస్పద ఔట్! ఆ ముగ్గురిపై వేటు..

ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్ లో భాగంగా.. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆసీస్ 43 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో బెయిర్ స్టో ఔట్ అయిన విధానంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. క్రీడాస్ఫూర్తికి విరుద్దంగా ఆసీస్ ఆటగాళ్లు వ్యవహరించారని సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే లార్డ్స్ లాంగ్ రూమ్ లో ఈ ఔట్ పై గొడవ జరిగింది. ఆస్ట్రేలియా క్రికెటర్లను చీటర్స్ అంటూ ఎగతాళి చేయడంతో.. అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. దాంతో ముగ్గురిపై వేటు వేశారు.

ప్రస్తుతం క్రీడా ప్రపంచంలో బెయిర్ స్టో, ఆసీస్ పేర్లు మారుమ్రోగిపోతున్నాయి. యాషెస్ సిరీస్ లో భాగంగా.. జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో బెయిర్ స్టోను క్రీడాస్ఫూర్తికి విరుద్దంగా అవుట్ చేశారని బెన్ స్టోక్స్ తో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులు విమర్శలు చేస్తున్నారు. ఇక ఈ వివాదాస్పద అవుట్ పై లార్డ్స్ మైదానంలోని లాంగ్ రూమ్ లో గొడవ చోటుచేసుకుంది. ముగ్గురు మెల్ బోర్న్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) సభ్యులు ఆస్ట్రేలియా క్రికెటర్ల పట్ల అనుచితంగా ప్రవర్తించారు. ఆసీస్ ఆటగాళ్లను చీటర్స్ అంటూ ఎగతాళి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లంచ్ టైమ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ క్రమంలోనే ఆసీస్ ఆటగాళ్లు డ్రస్సింగ్ రూమ్ లోకి వస్తుండగా.. ఉస్మాన్ ఖవాజాను, డేవిడ్ వార్నర్ లను చీటర్స్ అంటూ ముగ్గురు ఎంసీసీ సభ్యులు దూషించారు. దాంతో వార్నర్, ఖవాజాలు వారితో వాగ్వాదానికి దిగారు. వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది వార్నర్, ఖవాజాలను రూమ్ లోకి పంపింది. ఇక ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ఎంసీసీ ఆ ముగ్గురు సభ్యులను సస్పెండ్ చేసింది. భవిష్యత్ తో ఆ ముగ్గురు లార్డ్స్ లోకి అడుగుపెట్టకుండా నిషేధం విధిస్తూ.. చర్యలు తీసుకుంది. దీనికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటనను సైతం విడుదల చేసింది. “దేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్ల పట్ల అనుచితంగా ప్రవర్తించడం సరికాదు. తమ సభ్యుల నుంచి ఆసీస్ ఆటగాళ్లకు కలిగిన ఇబ్బందికి చింతిస్తున్నాము. ఆ ముగ్గురు సభ్యులను లార్డ్స్ లోకి అడుగుపెట్టకుండా నిషేధం విధిస్తున్నాం. అలాగే ఈ ఘటనపై పూర్తి విచారణకు ఆదేశించాం” అంటూ ఆ ప్రకటనలో తెలిపింది.