iDreamPost
android-app
ios-app

ఆ బౌలర్​ను ఆడించకుండా తప్పు చేస్తున్నారు.. BCCIపై మాజీ కోచ్ సీరియస్!

  • Published Aug 21, 2024 | 4:55 PM Updated Updated Aug 21, 2024 | 4:55 PM

ఓ ఆటగాడి విషయంలో సెలెక్టర్లు, బీసీసీఐ వ్యవహరిస్తున్న తీరుపై భారత మాజీ బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే సీరియస్ అయ్యాడు. అతడ్ని ఆడించకుండా తప్పు చేస్తున్నారని అన్నాడు. దాచిపెట్టి ఏం సాధిస్తారని ప్రశ్నించాడు.

ఓ ఆటగాడి విషయంలో సెలెక్టర్లు, బీసీసీఐ వ్యవహరిస్తున్న తీరుపై భారత మాజీ బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే సీరియస్ అయ్యాడు. అతడ్ని ఆడించకుండా తప్పు చేస్తున్నారని అన్నాడు. దాచిపెట్టి ఏం సాధిస్తారని ప్రశ్నించాడు.

  • Published Aug 21, 2024 | 4:55 PMUpdated Aug 21, 2024 | 4:55 PM
ఆ బౌలర్​ను ఆడించకుండా తప్పు చేస్తున్నారు.. BCCIపై మాజీ కోచ్ సీరియస్!

ఓ ఆటగాడి విషయంలో సెలెక్టర్లు, బీసీసీఐ వ్యవహరిస్తున్న తీరుపై మాజీ బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే సీరియస్ అయ్యాడు. అతడ్ని ఆడించకుండా తప్పు చేస్తున్నారని అన్నాడు. దాచిపెట్టి ఏం సాధిస్తారని ప్రశ్నించాడు. చిన్న వయసులో ఉన్నప్పుడే ఎక్కువ క్రికెట్ ఆడాలని.. ఇప్పుడు ఆడించకుండా అలా వదిలేస్తే ఎలా అని క్వశ్చన్ చేశాడు. పరాస్ మాంబ్రే బోర్డుపై సీరియస్ అయింది మరే ప్లేయర్ గురించో కాదు.. ఐపీఎల్ సెన్సేషన్ మయాంక్ అగర్వాల్​ విషయంలోనే. ఈ ఏడాది ఐపీఎల్​లో లక్నో సూపర్ జియాంట్స్​ తరఫున బరిలోకి దిగిన మయాంక్ 4 మ్యాచుల్లో 7 వికెట్లు పడగొట్టాడు. 150 కిలోమీటర్ల వేగానికి తగ్గకుండా బౌలింగ్ చేస్తూ ఆకట్టుకున్నాడు. ఒక మ్యాచ్​లోనైతే 156 కిలోమీటర్ల బుల్లెట్ పేస్​తో బంతులు సంధిస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఈ దెబ్బకు అతడు భారత జట్టులోకి వస్తాడనుకుంటే గాయం కారణంగా ఎన్​సీఏకు వెళ్లిపోయాడు.

నేషనల్ క్రికెట్​ అకాడమీలో ఉంటూ ఇంజ్యురీ నుంచి కోలుకుంటున్నాడు మయాంక్. అయితే ఐపీఎల్ ముగిసి దాదాపు మూడ్నెళ్లు కావొస్తున్నా మయాంక్​ ఇంకా ఫుల్​గా రికవర్ కాకపోవడం, భారత టీమ్​లోకి ఎంట్రీ ఇవ్వకపోవడంపై టీమిండియా మాజీ బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే రియాక్ట్ అయ్యాడు. అతడ్ని ఎందుకు ఆడించడం లేదో అర్థం కావడం లేదన్నాడు. అతడి విషయంలో బీసీసీఐ, సెలెక్టర్లు తప్పు చేస్తున్నారని చెప్పాడు. ఆడించకుండా దాచి పెట్టి ఏం సాధిస్తారని ప్రశ్నించాడు. ఫిట్​గా లేడనే కారణంతో మయాంక్​ను ఆడించకపోవడం కరెక్ట్ కాదని.. ఈ వయసులోనే అతడు సాధ్యమైనంత ఎక్కువ క్రికెట్ ఆడాలని మాంబ్రే అన్నాడు. ఎంతగా బౌలింగ్ చేస్తే అంతగా బాల్ మీద నియంత్రణ సాధించొచ్చని సూచించాడు.

‘మయాంక్ యాదవ్ ఆడేందుకు రెడీగా లేడంటే నేను ఒప్పుకోను. సిద్ధంగా లేనంత మాత్రాన అతడ్ని ఆడించమంటే ఎలా? ఈ ఏజ్​లోనే కదా.. అతడు సాధ్యమైనంత ఎక్కువగా బౌలింగ్ చేయాల్సింది. ఇప్పుడు ఎంత ఎక్కువ బౌలింగ్ చేస్తే ఓ బౌలర్​గా అంత మెరుగవుతాడు. బాల్ మీద కంట్రోల్ వస్తుంది. ఎంత ఎక్కువగా బౌలింగ్ చేస్తే మీ శరీరం ఏంటి? అది ఎంత వరకు బౌలింగ్​ చేసేందుకు సహకరిస్తుంది? అనేది అర్థమవుతుంది. బౌలింగ్ చేస్తే గాయపడే ప్రమాదం ఉందని ఆడించకుండా కూర్చోబెట్టడం ఎంత వరకు కరెక్ట్? ఒక ఫాస్ట్ బౌలర్​గా అతడి సేవల్ని ఎంతవరకు, ఎలా వినియోగించాలనేది గ్రహించాలి. అతడ్ని కచ్చితంగా ఫస్ట్​క్లాస్ క్రికెట్​లో ఆడించాలి. అప్పుడే అతడి ఫిట్​నెస్​, బౌలింగ్​ మరింత మెరుగుపడతాయి’ అని మాంబ్రే చెప్పుకొచ్చాడు. మరి.. మయాంక్​ను ఆడించకపోవడం తప్పంటూ మాంబ్రే చేసిన వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా? వ్యతిరేకిస్తారా? మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.