SNP
Mayank Rawat, Ayush Badoni, Delhi Premier League 2024: ఢిల్లీ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్‌లో మయాంక్ విధ్వంసం సృష్టించాడు. ఒకే ఓవర్‌లో ఏకండా 5 సిక్సులు బాదాడు. ఆ ఇన్నింగ్స్ గురించి ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం..
Mayank Rawat, Ayush Badoni, Delhi Premier League 2024: ఢిల్లీ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్‌లో మయాంక్ విధ్వంసం సృష్టించాడు. ఒకే ఓవర్‌లో ఏకండా 5 సిక్సులు బాదాడు. ఆ ఇన్నింగ్స్ గురించి ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం..
SNP
మొన్నా మధ్య కేవలం 55 బంతుల్లోనే 165 పరుగులు చేసి.. టీ20 క్రికెట్‌లో విధ్వంసం సృష్టించిన ఆయూష్ బదోని.. ఇప్పుడు బౌలర్‌గా అంతే భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2024లో భాగంగా.. సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్జ్ జట్టు తరఫున ఆడుతున్న బదోని.. ఆ టీమ్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. ఆదివారం ఈస్ట్ ఢిల్లీ రైడర్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బౌలింగ్ వేసిన బదోని.. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో ఏకండా 5 సిక్సులు కొట్టించుకున్నాడు. అవి కూడా భారీ భారీ సిక్సులు. బదోని బౌలింగ్‌ను వీరబాదుడు బాదిన ఆ బ్యాటర్ గురించి, ఆ ఇన్నింగ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ తరఫున ఆడుతూ.. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చాడు మయాంక్ రావత్. 19 ఓవర్లు ముగిసే సమాయానికి 33 బంతుల్లో 38 పరుగులు చేసి ఒక నార్మల్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ సమయానికి జట్టు స్కోర్ కూడా 153 పరుగులు మాత్రమే. దీంతో.. ఇక ఈ డీపీఎల్ కప్పు సౌత్ ఢిల్లీదే అని అంతా అనుకున్నారు. కానీ, అప్పుడు తనలోని హార్డ్ హిట్టర్‌ను బయటి తీశాడు మయాంక్ రావత్. ఇన్నింగ్స్ లాస్ట్ ఓవర్ వేసేందుకు వచ్చిన ప్రత్యర్థి జట్టు కెప్టెన్ ఆయూష్ బదోనిని చీల్చిచెండాడు. లాస్ట్ ఓవర్‌లో ఏకంగా 5 సిక్సులు బాది.. జట్టు స్కోర్‌ను అమాంతం పెంచేశాడు. 153 టీమ్ స్కోర్ ఆ ఓవర్‌లో 183 పరుగులకు చేరుకుంది. మొత్తంగా రావత్ 39 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సులతో 78 పరుగులు చేసి.. ఒంటి చేత్తో మ్యాచ్‌ను మలుపుతిప్పాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఓపెనర్లు అనుజ్ రావత్, సుజల్ సింగ్ తక్కువ స్కోర్‌కే అవుట్ అయ్యారు. ఆ తర్వాత కెప్టెన్ హిమ్మత్ సింగ్, హార్ధిక్ శర్మ, కావ్య గుప్తా కూడా పెద్దగా రాణించలేదు. మయాంక్ చివరి ఓవర్ విధ్వంసంతో ఈస్ట్ ఢిల్లీకి మంచి స్కోర్ లభించింది. సౌతా ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 2, రాఘవ్ సింగ్ 2 వికెట్లతో రాణించారు. ఇక 184 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సౌత్ ఢిల్లీకి కూడా మంచి స్టార్ లభించలేదు. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య, వన్‌డౌనల్‌లో వచ్చిన కెప్టెన్ ఆయూష్ బదోని సింగిల్ డిజిట్ స్కోర్ అవుట్ అయ్యారు.
తేజస్వి 42 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సులతో 68 పరుగులు చేసి రాణించాడు. కానీ, తర్వాతి బ్యాటర్లు కూడా విఫలం కావడంతో 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 180 పరుగులు మాత్రమే చేసి.. 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది సౌత్ ఢిల్లీ జట్టు. ఈస్ట్ ఢిల్లీ బౌలర్లలో సిమర్‌జిత్ సింగ్, రౌనక్ వాఘేలా మూడేసి వికెట్లతో సత్తా చాటారు. మొత్తంగా ఈస్ట్ ఢిల్లీ రైడర్స్.. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ ఛాంపియన్‌గా నిలిచేందుకు మయాంక్ రావత్ బ్యాటింగ్ కారణమని చెప్పవచ్చు. అతనికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. మరి ఈ మ్యాచ్‌లో మయాంక్ రావత్ చివరి ఓవర్ విధ్వంసంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Mayank Rawat – remember the name 6️⃣6️⃣6️⃣6️⃣6️⃣#AdaniDPLT20 #AdaniDelhiPremierLeagueT20 #DilliKiDahaad | @delhi_cricket @JioCinema @Sports18 pic.twitter.com/qzWNHwnPjy
— Delhi Premier League T20 (@DelhiPLT20) September 8, 2024