T20 World Cup: స్టార్‌ క్రికెటర్‌కు ICC వార్నింగ్‌! కారణం ఏంటంటే?

Matthew Wade, AUS vs ENG, T20 World Cup 2024: ఓ స్టార్‌ ప్లేయర్‌కు భారీ జరిమానా విధించి, వార్నింగ్‌ కూడా ఇచ్చింది ఐసీసీ. మరి ఆ స్టార్ ప్లేయర్‌ ఏం తప్పు చేశాడో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Matthew Wade, AUS vs ENG, T20 World Cup 2024: ఓ స్టార్‌ ప్లేయర్‌కు భారీ జరిమానా విధించి, వార్నింగ్‌ కూడా ఇచ్చింది ఐసీసీ. మరి ఆ స్టార్ ప్లేయర్‌ ఏం తప్పు చేశాడో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో మ్యాచ్‌లు ఊహకందని విధంగా జరుగుతున్నాయి. లో స్కోరింగ్‌ మ్యాచ్‌ జరుగుతున్నాయని క్రికెట్‌ అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నా.. ఊహించని ఫలితాలు, బౌలర్లు చేస్తున్న అద్భుతాలతో క్రికెట్‌లోని రెండో వైపు మజాను ఎంజాయ్‌ చేస్తున్నారు. ఆటతో పాటు కొన్ని వివాదాలు కూడా ఈ వరల్డ్‌ కప్‌ టోర్నీలో చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఓ స్టార్‌ క్రికెటర్‌కు అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) వార్నింగ్‌ ఇచ్చింది. ఇలాంటి తప్పు మళ్లీ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించి.. ప్రస్తుతానికి డీమెరిట్‌ పాయింట్‌, మ్యాచ్‌ ఫీజులో కోతతో సరిపెట్టింది. ఇంతకీ ఐసీసీ ఆగ్రహానికి గురైన ఆ క్రికెటర్‌ ఎవరు? అతను చేసిన తప్పు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఈ నెల 8న ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ కెప్టెన్‌ మ్యాథ్యూ వేడ్‌ ఫీల్డ్‌ అంపైర్‌తో వాదనకు దిగాడు. ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌లో ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ వేసిన బంతిని దెడ్‌ బాల్‌గా ప్రకటించాలని వేడ్‌ కోరాడు. అయితే.. ఆ బాల్‌నే వేడ్‌ డిఫెన్స్‌ ఆడటంతో ఫీల్డ్‌ అంపైర్‌ నితిన్‌ మీనన్‌ దాన్ని డెడ్‌ బాల్‌గా ప్రకటించలేదు. అంపైర్‌ నిర్ణయంతో కోపం తెచ్చుకున్న వేడ్‌ అతని వద్దకు వెళ్లి వాదనకు దిగాడు. ఫీల్డ్‌ అంపైర్‌తో వాదనకు దిగడంపై ఐసీసీ సీరియస్‌ అయింది. ఐసీసీ ఆటగాళ్ల ప్రవర్తనా నియమావళి లెవల్‌ 1 రూల్స్‌ను బ్రేక్‌ చేసిన కారణంగా వేడ్‌కు ఒక డీమెరిట్‌ పాయింట్‌తో పాటు మ్యాచ్‌ ఫీజులో 50 శాతం జరిమానా విధించింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఓపెనర్లు ట్రావిస్‌ హెడ్‌ 18 బంతుల్లో 34, డేవిడ్‌ వార్నర్‌ 16 బంతుల్లో 39 పరుగులు చేసి ఆసీస్‌కు మెరుపు ఆరంభాన్ని అందించారు. అలాగే కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ సైతం 35, మ్యాక్స్‌వెల్‌ 28, స్టోయినీస్‌ 30 పరుగులతో రాణించారు. వేడ్‌ 17 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో క్రిస్‌ జోర్దాన్‌ 2 వికెట్లతో రాణించాడు. ఇక 202 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌.. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి కేవలం 165 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఓపెనర్లు ఫిలిప్‌ సాల్ట్‌ 37, జోస్‌ బట్లర్‌ 42 పరుగులు చేసిన రాణించినా.. జట్టును గెలిపించలేకపోయారు. వీరిద్దరు తప్ప మిగతా బ్యాటర్లు ఎవరు పెద్ద స్కోర్లు చేయలేదు. ఆసీస్‌ బౌలర్లలో ప్యాట్‌ కమిన్స్‌, ఆడమ్‌ జంపా రెండేసి వికెట్లు తీసుకున్నారు. జోస్‌ హెజల్‌వుడ్‌, స్టోయినీస్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. మరి ఈ మ్యాచ్‌లో వేడ్‌ అంపైర్‌తో వాదనకు దిగడం, ఐసీసీ జరిమానా విధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments