SNP
Matheesha Pathirana, CSK vs DC, IPL 2024: ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ అద్భుతం జరిగింది. అది చూసి.. ధోని అంతటోడే ఫిదా అయిపోయాడు. మరి అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Matheesha Pathirana, CSK vs DC, IPL 2024: ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ అద్భుతం జరిగింది. అది చూసి.. ధోని అంతటోడే ఫిదా అయిపోయాడు. మరి అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
SNP
క్రికెట్‌లో కొన్ని సార్లు కళ్లు చెదిరే క్యాచ్‌లు, మతిపోగొట్టే ఫీల్డింగ్ చూస్తూనే ఉంటాం. కానీ, ఐపీఎల్‌లో అలాంటి అద్భుతాలు రోజుకోటి చోటు చేసుకుంటూ ఉంటాయి. అందుకే ఐపీఎల్‌లో సూపర్ క్యాచ్ అనాలంటే అది అసాధ్యమైన క్యాచ్ అయి ఉండాలి. అలాంటి అసాధ్యమైన క్యాచ్ ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకుంది. ఆ క్యాచ్‌ను చాలా మంది క్రికెట్ అభిమానులు క్యాచ్ ఆఫ్ ది డెకెట్‌గా పేర్కొంటున్నారు. ఏకంగా ధోనిలాంటి దిగ్గజ క్రికెటర్, తన కెరీర్‌లో కొన్ని వందల క్యాచ్‌లు అందుకున్న అతను కూడా.. ఈ క్యాచ్ చూసి ఫిదా అయిపోయాడు. ఆ క్యాచ్‌కు అవుటైన డేవిడ్ వార్నర్ సైతం ఫీల్డర్‌ను తన నవ్వుతో అభినందించలేకుండా ఉండలేకపోయాడు. మరి అంత అద్భుతమైన క్యాచ్‌ను పట్టింది ఓ 21 ఏళ్ల కుర్రాడు.
సీఎస్‌కే టీమ్‌లోకి వస్తే చాలు సాధారణ ఆటగాళ్లు కూడా స్టార్లు అయిపోతుంటారు. అలాగే అనామక యువ క్రికెటర్లు సైతం పెద్ద ప్లేయర్లుగా మారిపోతుంటారు. అలాంటి వారిలో ఒక శ్రీలంక యంగ్ బౌలర్ మతీష పతిరాణా. ఈ యువ బౌలర్ స్పీడ్ బౌలింగ్‌తోనే అందరికి తెలుసూ.. కానీ, తనలో ఓ అద్భుతమైన ఫీల్డర్ కూడా ఉన్నాడని ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌తో తెలిసొచ్చింది. అది ఎంత అద్బుతమైన క్యాచ్ అంటే.. దిగ్గజ క్రికెటర్ ధోని కూడా ఫిదా అయిపోయాడు. అలాగే ఆ క్యాచ్‌కు అవుటైన వార్నర్ సైతం పతిరాణా స్టన్నింగ్ క్యాచ్‌ను అభినందించాడు. అందుకే ఈ క్యాచ్‌ను క్యాచ్ ఆఫ్ డెకెడ్‌గా అంతా అభివర్ణిస్తున్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ ముస్తఫీజుర్ రెహ్మన్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్ మూడు బంతికి డేవిడ్ వార్నర్ రివర్స్ స్వీప్ షాట్ ఆడాడు. వేగంగా దూసుకెళ్తున్న బాల్‌ను గల్లీలో నిల్చున్న పతిరాణా గాల్లోకి పక్షిలా దూకి.. సూపర్ సెన్సెషన్ క్యాచ్ అందుకున్నాడు. ఆ క్యాచ్‌కు స్టేడియంలోని ప్రేక్షకులు, సీఎస్‌కే ఆటగాళ్లే కాదు.. ప్రత్యర్థి టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్లు సైతం ఫిదా అయిపోయారు. అప్పటికే 35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులతో 52 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్.. మరింత డేంజరస్‌గా మారుతున్న తరుణంలో పతిరాణా అద్భుతమైన క్యాచ్‌తో అతన్ని పెవిలియన్‌కు పంపాడు. లేదంటే.. వార్నర్ ఆడుతున్న తీరుకు స్కోర్ బోర్డు మరింత పరుగు పెట్టేది. 9.2 ఓవర్లలోనే ఢిల్లీ జట్టు 93 పరుగులు చేసింది. ఓపెనర్లు వార్నర్, పృథ్వీ షా సీఎస్‌కే బౌలర్లపై విరుచుకుపడుతున్న టైమ్‌లో.. సూపర్ క్యాచ్‌తో పతిరాణా వారి జోడీని విడదీశాడు. మరి ఈ అద్భుతమైన క్యాచ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
CATCH OF IPL 2024…!!!!
PATHIRANA, TAKE A BOW. 🔥🤯pic.twitter.com/2WzN2g0JS1
— Johns. (@CricCrazyJohns) March 31, 2024
Stunning catch by Pathirana 😨 pic.twitter.com/7OL6fw3en2
— Likith (@surfpora) March 31, 2024