iDreamPost
android-app
ios-app

ముంబై ఓటమికి రోహిత్‌, పాండ్యా కారణం కాదు.. ఇతనే! ఒక్కడే ముంబైని వణికించాడు!

  • Published Apr 15, 2024 | 4:13 PM Updated Updated Apr 15, 2024 | 4:13 PM

Matheesha Pathirana, CSK vs MI, IPL 2024: సీఎస్‌కేపై ముంబై ఇండియన్స్‌ ఓడిపోవడానికి రోహిత్‌, పాండ్యా కారణం అంటున్నారు. కానీ, నిజానికి ముంబైని ఓడించింది ఈ కుర్రాడు. అతనికి భయపడి ముంబై ఓడిపోయింది. అతనెవరో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Matheesha Pathirana, CSK vs MI, IPL 2024: సీఎస్‌కేపై ముంబై ఇండియన్స్‌ ఓడిపోవడానికి రోహిత్‌, పాండ్యా కారణం అంటున్నారు. కానీ, నిజానికి ముంబైని ఓడించింది ఈ కుర్రాడు. అతనికి భయపడి ముంబై ఓడిపోయింది. అతనెవరో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

  • Published Apr 15, 2024 | 4:13 PMUpdated Apr 15, 2024 | 4:13 PM
ముంబై ఓటమికి రోహిత్‌, పాండ్యా కారణం కాదు.. ఇతనే! ఒక్కడే ముంబైని వణికించాడు!

ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ క్రికెట్‌ అభిమానులకు ఫుల్‌ వినోదాన్ని అందించింది. రుతురాజ్‌ గైక్వాడ్‌, శివమ్‌ దూబే ధనాధన్‌ బ్యాటింగ్‌తో పాటు చివరి ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని.. మూడు వరుస సిక్సర్లతో తన కోసం స్టేడియానికి వచ్చిన వారికి పైసల్‌ వసూల్‌ మ్యాచ్‌లా చేశాడు. అలాగే ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌లో ఆ జట్టు మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సెంచరీతో చెలరేగాడు. ధోని మెరుపులతో పాటు రోహిత్‌ సెంచరీ చూసిన క్రికెట్‌ అభిమానులు ఫుల్‌ ఖుషీ అయ్యారు. ముంబైలోని వాంఖడే క్రికెట్‌ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్‌ కింగ్స్‌ 20 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఒక దశలో సీఎస్‌కే నిర్దేశించిన టార్టెట్‌ వైపు వేగంగా అడుగులు వేసిన ముంబై.. చివరి మ్యాచ్‌లో ఓటమి పాలైంది. అయితే.. ముంబై ఓటమికి రోహిత్‌ శర్మ స్లో బ్యాటింగ్‌ కారణమని అంటుంటే.. మరికొంతమంది హార్దిక్‌ పాండ్యా చెత్త కెప్టెన్సీ, లాస్ట్‌ ఓవర్‌ వల్లే ముంబై ఓడిందని అంటున్నారు. నిజానికి ముంబై ఓటమికి ఈ రెండు కారణం కాదని.. అసలైన కారణం ఓ కుర్రాడంటూ క్రికెట్‌ నిపుణులు అంటున్నారు. అతనెవరో ఇప్పుడు చూద్దాం..

చెన్నై సూపర్‌ కింగ్స్‌ విధించిన 207 పరుగుల టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు ఓపెనర్లు రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. పవర్‌ ప్లేలో సీఎస్‌కే బౌలర్లపై విరుచుకుపడిన రోహిత్‌, ఇషాన్‌ జోడి.. కేవలం 6 ఓవర్లలోనే వికెట్‌ కోల్పోకుండా 63 పరుగులు చేసి పట్టిష్టస్థితిలో నిలిచింది. 7 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ కోల్పోకుండా 70 పరుగులు చేసింది ముంబై. సరిగ్గా ఇదే టైమ్‌లో వచ్చాడు మతీష పతిరాణా. వచ్చీ రావడంతోనే మంచి టచ్‌లో ఉన్న ఇషాన్‌ కిషన్‌ను తొలి బంతికే పెవిలియన్‌ చేర్చాడు. సీఎస్‌కే కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ అద్బుతమైన ఫీల్డ్‌ సెట్‌కి తోడు, సూపర్‌ బౌలింగ్‌తో పతిరాణా బౌలింగ్‌లో మిడ్‌ వికెట్‌లో ఉన్న శార్దుల్‌ ఠాకూర్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు.

ఇక్కడి నుంచి ముంబై ఇండియన్స్‌ పతనం స్టార్ట్‌ అయిందనే చెప్పాలి. ఒక్క ఇషాన్‌ కిషనే కాదు.. అదే ఓవర్‌లో మోస్ట్‌ డేంజరస్‌ ప్లేయర్‌ మిస్టర్‌ 360 సూర్యకుమార్‌ యాదవ్‌ను డకౌట్‌ చేశాడు. అంతే ఒక్కసారిగా మ్యాచ్‌ సీఎస్‌కే చేతుల్లోకి వచ్చేసింది. ఇక్కడి ఉంచి సీఎస్‌కే అస్సలు పట్టువదలకుండా.. మ్యాచ్‌ను గెలిచింది. అయితే.. పతిరాణా బౌలింగ్‌లో ఆడాలంటేనే వణికిపోయింది ముంబై ఇండియన్స్‌.. తన 4 ఓవర్ల కోటా పూర్తి చేసిన పతిరాణా కేవలం 28 పరుగులు మాత్రమే ఇచ్చి.. 4 కీలక వికెట్లు తీసి.. సీఎస్‌కేను గెలిపించాడు. పతిరాణా ఇలాంటి బౌలింగ్‌ వేయకుండా ఉండి ఉంటే.. కచ్చితంగా ఫలితం మరోలా ఉండేదని క్రికెట్‌ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ 40 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో 69, శివమ్‌ దూబే 38 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సులతో 68 రన్స్‌ చేసి అదరగొట్టారు. ఇక చివర్లో ధోని 4 బంతుల్లో 3 సిక్సులతో 20 పరుగులు చేసి అద్బుతమైన ముగింపు ఇచ్చాడు. ముంబై బౌలర్లలో కెప్టెన్‌ పాండ్యా 2 వికెట్లతో రాణించాడు. ఇక 207 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ముంబై.. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 186 పరుగులు మాత్రమే చేసి 20 రన్స్‌ తేడాతో ఓటమి పాలైంది. రోహిత్‌ శర్మ 63 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సులతో 105 పరుగులు చేసినా ముంబైని గెలిపించలేకపోయాడు. సీఎస్‌కే బౌలర్లలో మతీష పతిరాణా 4 వికెట్లతో అదరగొట్టాడు. మరి ఈ మ్యాచ్‌లో మతీష పతిరాణా ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.