Somesekhar
తాజాగా జరిగిన ఓ మ్యాచ్ లో ఫిక్సింగ్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే? వారు ఔటైనతీరు అలాగుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
తాజాగా జరిగిన ఓ మ్యాచ్ లో ఫిక్సింగ్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే? వారు ఔటైనతీరు అలాగుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Somesekhar
క్రికెట్ లో ఎక్కువగా వినిపించే పేరు ‘మ్యాచ్ ఫిక్సింగ్’. క్రీడా స్ఫూర్తికి విరుద్దంగా కొందరు ఆటగాళ్లు డబ్బు ఆశకు లొంగిపోయి తమ దేశ గౌరవాన్ని తాకట్టుపెడుతూ ఉంటారు. ఇక ఈ ఆరోపణలతో ఎంతో మంది దిగ్గజ క్రికెటర్లు తమ కెరీర్ లోనే చెడ్డ ముద్రను వేసుకుని రిటైర్మెంట్స్ ప్రకటించారు. తాజాగా జరిగిన ఓ మ్యాచ్ లో ఫిక్సింగ్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే? వారు ఔటైనతీరు అలాగుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం కోల్ కత్తలో ఫస్ట్ డివిజన్ గ్రూప్ ఏ లీగ్ లు జరుగుతున్నాయి. అందులో భాగంగా తాజాగా టౌన్ క్లబ్ వర్సెస్ మహ్మదీయ స్పోర్టింగ్ క్లబ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మహ్మదీయ టీమ్ బ్యాటర్లు ఔటైన తీరు చూస్తుంటే కచ్చితంగా వారు ఫిక్సింగ్ కు పాల్పడ్డారని అనుమానాలు రాకమానవు. అసలేం జరిగిందంటే? ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టౌన్ క్లబ్ జట్టు 446 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన మహ్మదీయ స్పోర్టింగ్ టీమ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంది. సందీప్ తోమర్ బౌలింగ్ లో ఓపెనర్ సంబిత్ రాయ్ 20 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్టంపౌట్ అయ్యాడు. అయితే తన వికెట్ ను కాపాడుకోవడానికి రాయ్ కనీసం క్రీజ్ లోకి వచ్చే ప్రయత్నం కూడా చేయలేదు.
మరో వైపు కెప్టెన్ చటర్జీ సైతం తోమర్ బౌలింగ్ లేనే అవుట్ అయ్యాడు. స్టంప్స్ కు దగ్గరగా పడుతున్న బాల్ ను కనీసం డిఫెన్స్ కూడా చేయలేదు. దీంతో బాల్ సరాసరి వికెట్లను గిరాటేసింది. ఆ తర్వాత వచ్చిన నితిన్ వర్మ కూడా అనుమానాలు రేకెత్తించే విధంగా ఔట్ అయ్యాడు. ప్రస్తుతం ఈ ముగ్గురి ఔట్స్ కు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. మ్యాచ్ లో ఫిక్సింగ్ జరిగిందా? అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇదే విషయాన్ని బెంగాల్ మాజీ క్రికెటర్ శ్రీవత్సవ గోస్వామి కూడా వ్యక్త పరిచాడు. ఈ మ్యాచ్ లో ఆటగాళ్లు ఔట్ అయిన తీరు నాకు నిరాశ, సిగ్గుగా అనిపించిందని చెప్పుకొచ్చాడు. మరి ఈ వీడియో చూసి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
🚨𝐌𝐚𝐭𝐜𝐡 𝐟𝐢𝐱𝐢𝐧𝐠 𝐢𝐧 𝐊𝐨𝐥𝐤𝐚𝐭𝐚 𝐂𝐥𝐮𝐛 𝐂𝐫𝐢𝐜𝐤𝐞𝐭? 𝐕𝐢𝐝𝐞𝐨𝐬 𝐨𝐟 𝐓𝐨𝐰𝐧 𝐂𝐥𝐮𝐛 𝐯𝐬 𝐌𝐨𝐡𝐚𝐦𝐦𝐞𝐝𝐚𝐧 𝐒𝐩𝐨𝐫𝐭𝐢𝐧𝐠 𝐂𝐥𝐮𝐛 𝐰𝐢𝐥𝐥 𝐬𝐡𝐨𝐜𝐤 𝐲𝐨𝐮 😲#BCCI #BCCICentralContract #Kolkata #CricketNews #MatchFixing #IndianCricket pic.twitter.com/RzPKnngENC
— Sportz Point (@sportz_point) February 29, 2024
ఇదికూడా చదవండి: వీడియో: కళ్లు చెదిరే క్యాచ్.. అంపైర్ సైతం చప్పట్లు కొట్టాడు!