SNP
ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ లీగ్స్‌లో ఒకటిగా భావించే బిగ్‌బాష్ లీగ్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ ఆరంభమైన తర్వాత.. పిచ్‌కు భయపడి మ్యాచ్‌నే ఆపేశారు. అయితే.. ఇంతకి పిచ్ ఎందుకు అంతా వారిని భయపెట్టిందో ఇప్పుడు చూద్దాం..
ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ లీగ్స్‌లో ఒకటిగా భావించే బిగ్‌బాష్ లీగ్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ ఆరంభమైన తర్వాత.. పిచ్‌కు భయపడి మ్యాచ్‌నే ఆపేశారు. అయితే.. ఇంతకి పిచ్ ఎందుకు అంతా వారిని భయపెట్టిందో ఇప్పుడు చూద్దాం..
SNP
క్రికెట్‌లో వర్షం పడి మ్యాచ్‌లు ఆగిపోయిన సంఘటనలు చాలా జరిగి ఉంటాయి. కాని పిచ్ బాలేదని మ్యాచ్ ఆగిపోయిన సంఘటనలు మాత్రం చాలా అరుదుగా జరుగుతాయి. కొన్ని సార్లు టెస్ట్ మ్యాచ్‌లు పిచ్ నుంచి ఊహించని బౌన్స్ ఉండి.. ఆటగాళ్లు గాయపడే ప్రమాదం ఉందంటే.. మ్యాచ్‌లను నిలిపేస్తుంటారు. అలాంటిది ఓ టీ20 మ్యాచ్ పిచ్ బాలేదని ఆగిపోయింది. అది కూడా ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ లీగ్స్‌లో ఒకటైన బిగ్ బాష్ లీగ్ 2023లో. ఆదివారం మెల్బోర్న్ రెనెగేడ్స్ – పెర్త్ స్కార్చర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ బ్యాడ్ పిచ్ వల్ల ఆగిపోయింది. అయితే.. మ్యాచ్ ఆగిపోవడానికి పిచ్ ఏ విధంగా కారణం అయిందో ఇప్పుడు పూర్తి వివరాలతో తెలుసుకుందాం..
ఈ మ్యాచ్ గిలాంగ్ లోని సైమండ్స్ స్టేడియంలో మొదలైంది. మెల్ బోర్న్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకోవడంతో పెర్త్ టీమ్ తొలుత బ్యాటింగ్ కు చేయాల్సి వచ్చింది. ఇన్నింగ్స్ రెండో బంతికే స్టీపెన్ (0)ను టామ్ రోజర్స్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కాసేపటికే మరో ఓపెనర్ కూపర్ (6) కూడా అవుట్ అయ్యాడు. అయితే బౌలర్లు విసిరే బంతులకు పిచ్ భిన్నంగా స్పందిస్తుండటంతో తొలుత అందరూ షాక్ అయ్యారు. మ్యాచ్ మొదలై.. 6.5 ఓవర్ల పాటు సాగిన తర్వాత అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. అప్పటికే ఆటగాళ్లు పిచ్‌ను అనుమానాస్పదంగా చూస్తూ ఆడుతున్నారు.
పిచ్‌పై పడిన తర్వాత బంతి అనూహ్యంగా బౌన్స్ అవ్వడంతో బ్యాటర్లతో సహా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ కూడా షాక్ అయ్యాడు. దీంతో మ్యాచ్ ను కాసేపు అంపైర్లు నిలిపివేశారు. ఇరు జట్లు కెప్టెన్లతో చర్చించి.. పిచ్ ప్రమాదకంగా ఉందని, ఆటను కొనసాగిస్తే.. ఆటగాళ్లు గాయపడే ప్రమాదం ఉందని భావించి.. మ్యాచ్‌ను పూర్తిగా రద్దు చేశారు. అయితే నిన్నరాత్రి గిలాంగ్లో కురిసిన వర్షం కారణంతో పిచ్ ఇలా భిన్నంగా మారిపోయి ఉంటుందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వర్షం సమయంలో పిచ్‌పై కవర్లు ఉన్నా.. అవి లీక్ అయి పిచ్ పై నీరు చేరి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ ఘటనతో ప్రపంచంలోనే పెద్ద లీగ్స్‌లో ఒకటిగా చెప్పుకుంటున్న బిగ్ బాష్ లీగ్ నిర్వాహకులకు ఇది అవమానకరమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Match cancelled due to bad Pitch
Never seen that before#BBL #Cricket #INDvsSApic.twitter.com/d5uXFZDwEY— 🇮🇳Bhanu (@singh_bhan33431) December 10, 2023