SNP
Maro Bhai Mujhe Maro, Momin Saqib: క్రికెట్‌లో ఓ మ్యాచ్ చూసి.. ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడిపోవడంతో బాగా బాధకు గురైన ఓ కుర్రాడు.. చెప్పిన మాటలు అతని తలరాతనే మార్చేశాయి. ఇప్పుడు అతను లక్షలు సంపాదిస్తున్నాడు.
Maro Bhai Mujhe Maro, Momin Saqib: క్రికెట్‌లో ఓ మ్యాచ్ చూసి.. ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడిపోవడంతో బాగా బాధకు గురైన ఓ కుర్రాడు.. చెప్పిన మాటలు అతని తలరాతనే మార్చేశాయి. ఇప్పుడు అతను లక్షలు సంపాదిస్తున్నాడు.
SNP
క్రికెట్‌ను చూసి కోట్ల మంది ఎంజాయ్ చేస్తారు. క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుని చాలా తక్కువ మంది ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. అలాగే డైరెక్ట్‌గా క్రికెట్ ఆడకుండా.. క్రికెట్‌తోనే కొంతమంది జీవనోపాధి పొందుతారు. కామెంట్రీ, అంపైరింగ్, క్యూరేటింగ్, కోచింగ్ ఇలా.. చాలా విధాలుగా క్రికెట్ నుంచి ఉపాధి, నేమ్, ఫేమ్ పొందుచ్చు. కానీ, ప్రేక్షకులకు క్రికెట్ నుంచి వినోదం తప్ప పెద్దగా ఉపయోగం ఉండదు. కానీ, ఈ మాటను అబద్ధం అని నిరూపించిన వ్యక్తి ఒకతను ఉన్నాడు. అతని పేరు మోమిన్ సాకిబ్. ఒక్క మ్యాచ్‌తో క్రికెట్ లోకానికి, దాంతో పాటే మీమ్స్ ప్రపంచానికి ముడిసరుకుగా మారిపోయాడు.
ఓ మ్యాచ్‌లో పాకిస్థాన్ చిత్తుగా ఓడిపోయిన తర్వాత.. ‘మారో భాయ్.. ముజే మారో’ అంటూ తన ఆవేదనను వ్యక్తం చేసిన క్రికెట్ ఫ్యాన్ దాదాపు అందరికీ గుర్తుండే ఉంటాడు. అలా చెప్పింది మోమిన్ సాకిబ్ అనే పాకిస్థాన్ కుర్రాడు. ఆ ఒక్క వీడియో అతని తలరాతనే మార్చేసింది. ఆ వీడియో ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో దారుణమైన రీచ్ వచ్చింది ఆ వీడియోకి. ఆ వీడియో అనే కాదు.. ఆ వీడియోను బేస్ చేసుకుని కొన్ని కోట్ల మీమ్స్, వీడియో మీమ్స్ వచ్చాయి. దాంతో.. ఆ క్రికెట్ ఫ్యాన్ రేంజ్ అమాంతంగా మారిపోయింది. ఒక్క మీమ్ కంటెంట్ ఇచ్చిన వీడియోతో ఏకంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ధోని, బాబర్ అజమ్ లాంటి స్టార్ క్రికెటర్లను నేరుగా కలిసే అవకాశం పొందాడు. అలాగే ప్రస్తుతం అతనికి ఇన్‌స్టాగ్రామ్‌లో 1.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
మీమ్ కంటెంట్ చేసే వారికి అతనో ఆరాధ్య దైవం అయిపోయాడు. తెలుగులో బ్రహ్మానందాన్ని మీమ్ గాడ్‌గ పిలుస్తుంటారు. ఈ క్రికెట్ ఫ్యాన్ కూడా దాదాపు అలాంటి రేంజ్‌లోనే ప్రస్తుతం ఉన్నాడు. ఒక్క వీడియోతో అతనికి ప్రపంచ వ్యాప్తంగా భారీ పాపులారిటీ వచ్చింది. ప్రస్తుతం అతను మోడల్‌గా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్‌గా బాగా సంపాదిస్తున్నాడు. ఇందంతా ఒక్క వీడియోతో వచ్చిన క్రేజ్. అతను ఎక్కడి వెళ్లిన జనాలు గుర్తుపట్టేస్తుంటారు. క్రికెట్‌పై ఇష్టంతో మ్యాచ్ చూసేందుకు వచ్చి, తన సొంత టీమ్ దారుణమై ప్రదర్శనతో హర్ట్ అయిన అతను.. చెప్పిన మాటలే మీమ్ కంటెంట్‌కు రా మెటీరియల్‌గా మారిపోయాయి. ఆ మాటలు చెప్పిన కుర్రాడు ఇప్పుడు మంచి రేంజ్‌లో ఉన్నాడు. క్రికెట్‌కు సంబంధించిన వీడియలో చేస్తూ, స్టార్ క్రికెటర్లను నేరుగా కలుస్తూ.. ఒక సెలబ్రేటీ హోదాను అనుభవిస్తున్నాడు. మరి ఈ మీమ్ కంటెంట్ క్యారెక్టర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.