iDreamPost
android-app
ios-app

వీడియో: కళ్లు చెదిరే క్యాచ్‌… రెండు మూడు సార్లు చూస్తే కానీ నమ్మలేరు!

  • Published Jun 21, 2024 | 4:02 PMUpdated Jun 21, 2024 | 4:02 PM

Vitality Blast T20, Marnus Labuschagne: క్రికెట్‌లో చాలా రకాల క్యాచ్‌లు చూసి ఉంటారు.. కానీ, ఈ క్యాచ్‌ మాత్రం ఒక అద్భుతం. పట్టిన వాడు మనిషేనా అనిపించేలా అవుతాయి. ఆ క్యాచ్‌ గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

Vitality Blast T20, Marnus Labuschagne: క్రికెట్‌లో చాలా రకాల క్యాచ్‌లు చూసి ఉంటారు.. కానీ, ఈ క్యాచ్‌ మాత్రం ఒక అద్భుతం. పట్టిన వాడు మనిషేనా అనిపించేలా అవుతాయి. ఆ క్యాచ్‌ గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

  • Published Jun 21, 2024 | 4:02 PMUpdated Jun 21, 2024 | 4:02 PM
వీడియో: కళ్లు చెదిరే క్యాచ్‌… రెండు మూడు సార్లు చూస్తే కానీ నమ్మలేరు!

క్రికెట్‌లో చాలా అద్భుతమైన క్యాచ్‌లు చూసి ఉంటారు. ఆ క్యాచ్‌లు చూసి.. ఫీల్డర్లను మెచ్చుకుని ఉంటారు. కానీ, ఈ క్యాచ్‌ చూస్తే.. పట్టిన వాడు అసలు మనిషేనా..? అనే డౌట్‌ వస్తుంది. ఎందుకంటే ఆ క్యాచ్‌ అంత అద్భుతంగా ఉంది. నార్మల్‌గా మనుషులు అయితే.. ఇలాంటి క్యాచ్‌లు పట్టడం కష్టం, సూపర్‌ మ్యాన్‌లకే సాధ్యం అవుతుందని అనిపించేలా ఉంది ఆ క్యాచ్‌. ఈ సూపర్‌ డూపర్‌ క్యాచ్‌.. ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న విటాలిటీ బ్లాస్ట్‌ టీ20 టోర్నీలో ఈ అద్భుతమైన క్యాచ్‌ చోటు చేసుకుంది. కార్డిఫ్‌ వేదికగా గ్లోసెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో గ్లామోర్గన్‌ ఆటగాడు మార్నస్‌ లబుషేన్‌ మెరుపు వేగంతో గాల్లోకి ఒక సూపర్‌ మ్యాచ్‌లా దూకుతూ ఈ క్యాచ్‌ను అందుకున్నాడు.

మేసన్‌ క్రేన్‌ బౌలింగ్‌లో బెన్‌ ఛార్లెస్‌వర్త్‌ లాంగ్‌ ఆన్‌ దిశగా ఓ భారీ షాట్‌ ఆడాడు. ఆ బాల్‌ ఆల్‌మోస్ట్‌ సిక్స్‌ అని అంతా అనుకున్నారు. కానీ బౌండరీలైన్‌కు కాస్త ముందు పడేలా ఉండటంతో.. కనీసం బౌండరీ అయినా వస్తుందని అనుకున్నారు. కానీ, అంతలోనూ ఒక తుఫాన్‌ వచ్చినట్లు వచ్చాడు. గాల్లోకి పక్షిలా దూకుతూ.. అద్భుతంగా ఆ క్యాచ్‌ను అందుకున్నాడు. ప్రస్తుతం లబుషేన్‌ పట్టిన ఈ క్యాచ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ క్యాచ్‌ చూసిన వాళ్లంతా.. వామ్మో అలా ఎలా పట్టావ్‌ బ్రో అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. గ్లామోర్గన్‌తో హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో గ్లోసెస్టర్‌షైర్‌ 2 వికెట్ల తేడాతో గెలిచింది. గ్లోసెస్టర్‌షైర్‌ విజయానికి చివరి బాల్‌కు 5 రన్స్‌ అవసరమైన సమయంలో జోష్‌ షా ఆండీ గోర్విన్‌ బౌలింగ్‌లో సిక్సర్‌ కొట్టి తన టీమ్‌కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లొ తొలుత బ్యాటింగ్‌ చేసిన గ్లామోర్గన్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. ఈ టార్గెట్‌ను గ్లోసెస్టర్‌షైర్‌ 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మరి ఈ మ్యాచ్‌లో లబుషేన్‌ పట్టిన సూపర్‌ క్యాచ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి