SNP
SNP
సౌతాఫ్రికాతో జరిగిన వన్డేలో ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లబుషేన్ కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి.. సంచలన ఇన్నింగ్స్ ఆడి ఓటమి అంచుల్లో ఉన్న ఆస్ట్రేలియాను గెలిపించాడు. 223 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా 113 పరుగులకే 7 కీలక వికెట్లు కోల్పోయింది. దీంతో ఇక ఆస్ట్రేలియా పని అనిపోయినట్లే.. మ్యాచ్ చేజారినట్టేనని అంతా భావించారు. సౌతాఫ్రికా తక్కువ స్కోర్ చేసినా.. బౌలర్లు అద్భుతంగా చెలరేగి ఆస్ట్రేలియాను మట్టికరిపిస్తున్నారని క్రికెట్ అభిమానులు అనుకున్నారు.
కానీ, అనూహ్యంగా 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన లబుషేన్ 93 బంతుల్లో 8 ఫోర్లుతో 80 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఓటమి కోరల్లో ఉన్న ఆస్ట్రేలియాను విజయ తీరాలకు చేర్చాడు. సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా వచ్చిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అయితే, మ్యాచ్ తర్వాత లబుషేన్ ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. ఈ రోజు తను మ్యాచ్‌లో బాగా ఆడతానని వాళ్ల అమ్మ అతనితో చెప్పిందట.. నిజానికి అప్పటికే తాను ప్లేయింగ్ ఎలెవన్‌లో లేను అనే విషయం లబుషేన్‌కు తెలుసు.
అదే విషయాన్ని లబుషేన్.. వాళ్ల అమ్మతో చెప్పాడు. అసలు నేను టీమ్‌లో లేను అని. కానీ విధి ఎలా మరిపోయిందో చూడండి. మ్యాచ్‌లో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా ఆడే అవకాశం లబుషేన్‌కు రావడంతో అతను అద్భుతంగా ఆడి ఓడిపోతుందనుకున్న మ్యాచ్ గెలిపించడం అంతా అలా జరిగిపోయింది. ఈ సంఘటన చూస్తే లబుషేన్ తల్లి బలమైన నమ్మకం ముందు విధి కూడా ఓడిపోయింది. అయితే.. కంకషన్ సబ్‌స్టిట్యూట్ అంటే.. మ్యాచ్ మధ్యలో ఎవరైన ఆటగాడికి తలకు బలమైన గాయం అయితే.. అతని స్థానంలో మరో ఆటగాడికి ఆడే అవకాశం ఇస్తారు. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కామెరున్ గ్రీన్ తలకు గాయం కావడంతో లబుషేన్ అతని స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Marnus Labuschagne, who came in as a concussion substitute in the first ODI, shone brightly, just how his mother predicted. pic.twitter.com/rFSTvlZea5
— CricTracker (@Cricketracker) September 8, 2023
ఇదీ చదవండి: ఈ ఏడాది బాబర్‌ను తొక్కేసిన బవుమా! ఈ లెక్కలు చూడండి