SNP
SNP
హోరాహోరీగా సాగుతున్న యాషెస్ సిరీస్‌లో మరో సూపర్ డెలవరీ పడింది. ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ వేసిన అద్భుతమైన బంతి ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను కళ్లుతేలేసిన చేసింది. లీడ్స్ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి రోజు మార్క్ ఉడ్స్ ఈ సూపర్ డెలవరీ వేశాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు బౌలర్లు అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. స్టువర్ట్ బ్రాడ్, మార్క్ వుడ్, క్రిస్ ఓక్స్ తలో వికెట్ తీసి ఆసీస్‌ను చావు దెబ్బ తీశారు.
తొలుత డేవిడ్ వార్నర్‌ను బ్రాడ్ అవుట్ చేసి 4 పరుగులకే పెవిలియన్‌కు పంపాడు. ఆ వెంటనే 42 పరుగుల వద్ద మార్క్ వుడ్ ఆసీస్‌కు దిమ్మతిరిగే షాకిచ్చాడు. 37 బంతుల్లో 13 పరుగులతో ఆచీతూచి ఆడుతున్న ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను అద్భుత బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. 152 కిలో మీటర్ల వేగంతో వేసిన ఆ బంతిని ఆడటంలో ఖవాజా పూర్తిగా విఫలమయ్యాడు. బాల్ స్పీడ్‌కు వికెట్ గాల్లో ఎగిరిపడింది. ఆ అవుట్‌కి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఈ మార్క్ వుడ్ వేసిన సూపర్ డెలవరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
A 94mph Mark Wood rocket cleans up Usman Khawaja! 🚀#ENGvAUS | #Ashes pic.twitter.com/Ji0BdzwmvU
— ESPNcricinfo (@ESPNcricinfo) July 6, 2023