iDreamPost
android-app
ios-app

వీడియో: తలకు గురిపెట్టి.. 156 కిలో మీటర్ల వేగంతో రాకాసి బౌన్సర్‌! బ్యాటర్‌ పరిస్థితి చూడండి!

  • Published Jul 20, 2024 | 8:07 AMUpdated Jul 20, 2024 | 8:07 AM

Mark Wood, Mikyle Louis, ENG vs WI: ఇంగ్లండ్‌ - వెస్టిండీస్‌ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఓ ఆందోళనకర ఘటన చోటు చేసుకుంది. ఓ బౌలర్‌ వేసిన రాకాసి బౌన్సర్‌కు బ్యాటర్‌ ఫీజులు ఎగిరిపోయాయి. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Mark Wood, Mikyle Louis, ENG vs WI: ఇంగ్లండ్‌ - వెస్టిండీస్‌ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఓ ఆందోళనకర ఘటన చోటు చేసుకుంది. ఓ బౌలర్‌ వేసిన రాకాసి బౌన్సర్‌కు బ్యాటర్‌ ఫీజులు ఎగిరిపోయాయి. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jul 20, 2024 | 8:07 AMUpdated Jul 20, 2024 | 8:07 AM
వీడియో: తలకు గురిపెట్టి.. 156 కిలో మీటర్ల వేగంతో రాకాసి బౌన్సర్‌! బ్యాటర్‌ పరిస్థితి చూడండి!

క్రికెట్‌లో ముఖ్యంగా టెస్ట్‌ క్రికెట్‌లో బౌలర్లు బ్యాటర్లను భయపెట్టేందుకు ఎక్కువగా బౌన్సర్లు సంధిస్తూ ఉంటారు. కొన్ని సార్లు బౌన్సర్లకు వికెట్లు పడతాయి, కొన్ని సార్లు బ్యాటర్లు గాయాలపాలు కూడా అవుతారు. బ్యాటర్లను భయపెట్టేందుకు బౌలర్ల వద్ద ఉన్న ప్రధాన అస్త్రం బౌన్సర్‌. దాన్ని సరిగ్గా వాడితే.. ఎంతటి కొమ్ములు తిరిగి బ్యాటర్‌ అయినా.. తలొంచాల్సిందే. తాజాగా ఇంగ్లండ్‌-వెస్టిండీస్‌ మధ్య నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్‌ బ్రిడ్జ్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో కూడా ఓ రాకాలి బౌన్సర్‌ వేశాడు ఇంగ్లండ్‌ యువ పేసర్‌ మార్క్‌ వుడ్‌. ఏకంగా గంటకు 156.2 కిలో మీటర్ల వేగంతో వేసిన ఆ బంతి నేరుగా బ్యాటర్‌ తన లక్ష్యంగా దూసుకెళ్లింది. ఏకే47 గన్‌ నుంచి బుల్లెట్‌ దూసుకొచ్చినట్లు తన ముఖం వైపు దూసుకొచ్చిన బంతిని చూసి బ్యాటర్‌కు దిమ్మతిరిగిపోయింది.

వెస్టిండీస్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో.. ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌ 5వ బంతిని మార్క్‌ వుడ్‌ చాలా వేగంగా వేశాడు. అవుట్‌ సైడ్‌ ఆఫ్‌ షార్ట్‌బాల్‌ వేశాడు. అది నేరుగా వెస్టిండీస్‌ బ్యాటర్‌ మికిల్ లూయిస్ తలపైకి దూసుకెళ్లింది. ఆ బాల్‌ను చూసి ఉలిక్కి పడిన మికిల్ లూయిస్ రెప్పపాటులో తప్పించుకున్నాడు. లేదంటే ఆ స్పీడ్‌కు తల పుచ్చకాయల పగిలిపోయేది. ఆ బాల్‌ చూసి.. స్టేడియంలో ప్రేక్షకులు కూడా.. ఓఓఓ.. అంటూ హమ్మయ్యా కొద్దిలో మిస్‌ అయింది. లేదంటే ప్రమాదం జరిగేదే అంటూ ఊపిరి పీల్చుకున్నాడు. బాల్‌ను చాకచక్యంగా తప్పించుకున్న తర్వాత.. బ్యాటర్‌ గుండె కూడా వేగంగా కొట్టుకుని ఉంటుంది. కొద్దిలో తప్పించుకున్నానని. తగిలి ఉంటే మాత్రం.. పరిస్థితి దారుణంగా ఉండేది. అయితే.. మార్క్ వుడ్‌ బౌన్సర్లతో భయపెట్టినా.. వెస్టిండీస్‌ జట్టు ఇంగ్లండ్‌కు గట్టి పోటీ ఇస్తోంది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఓలీ పోప్‌ 121, బెన్‌ డకెట్‌ 71, కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ 69 పరుగులు చేసి రాణించారు. హ్యారీ బ్రూక్‌ 36, జెమీ స్మిత్‌ 36, క్రిస్‌ వోక్స్‌ 37 రన్స్‌తో పర్వాలదేనిపించారు. ఇక వెస్టిండీస్‌ బౌలర్లలో అల్జారీ జోసెఫ్‌ 3, జేడెన్ సీల్స్ 2, కెవిన్‌ సింక్లైర్‌ 2, కావెం హాడ్జ్‌ 2 వికెట్లతో రాణించారు. ఇక తొలి ఇన్నింగ్స్‌కు దిగిన వెస్టిండీస్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసి పటిష్టస్థితిలో నిలిచింది. కావెం హాడ్జ్‌ 120 పరుగులు చేసి అదరగొట్టాడు. అలిక్ అథనాజ్ 82 పరుగులతో రాణించాడు. మొత్తంగా ఇంగ్లండ్‌కు వెస్టిండీస్‌ గట్టి పోటీ ఇస్తోంది. మరి ఈ మ్యాచ్‌లో మార్క్‌ వుడ్‌ వేసిన 156.2 కిలో మీటర్ల డెలవరీతో పాటు దాన్ని వెస్టిండీస్‌ బ్యాటర్‌ మికిల్ లూయిస్ తప్పించుకున్న విధానంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి