Somesekhar
కళ్లుబైర్లు కమ్మే ఇన్ స్వింగ్ తో వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్ నే బోల్తా కొట్టించింది సౌతాఫ్రికా లేడీ బౌలర్. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
కళ్లుబైర్లు కమ్మే ఇన్ స్వింగ్ తో వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్ నే బోల్తా కొట్టించింది సౌతాఫ్రికా లేడీ బౌలర్. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Somesekhar
ప్రపంచ క్రికెట్ లో ఎంతో మంది దిగ్గజ బౌలర్లు ఉన్నారు. అయితే స్వింగ్ కింగ్ లు మాత్రం చాలా అరుదుగా కనిపిస్తారు. ఇన్ స్వింగ్, ఔట్ స్వింగ్ లతో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించడంలో వారు సిద్ధహస్తులు. ఇలాంటి వారిలో ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ మెక్ గ్రాత్ తో పాటుగా పాక్ లెజెండ్ వసీం అక్రమ్ మరికొందరు మనకు కనిపిస్తారు. ఇక మోడ్రన్ క్రికెట్ కు వచ్చేసరికి టీమిండియా స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ స్వింగ్ కింగ్ గా మంచి గుర్తింపు పొందాడు. అయితే తాజాగా జరిగిన ఓ మ్యాచ్ లో కళ్లుబైర్లు కమ్మే స్వింగ్ బాల్ తో వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్ నే బోల్తా కొట్టించింది సౌతాఫ్రికా లేడీ బౌలర్.
దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా జరిగిన రెండో వన్డేలో సౌతాఫ్రికా వుమెన్స్ టీమ్ డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 84 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. ఇదంతా కొద్దిసేపు పక్కనపెడితే.. ఈ మ్యాచ్ లో ఓ అద్భుతమైన బాల్ నమోదు అయ్యింది. డక్ వర్త్ లూయిస్ ప్రకారం 45 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో 234 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది ఆసీస్ వుమెన్స్ టీమ్ కు ఆదిలోనే షాకిచ్చింది సఫారీ బౌలర్ మారిజానే కాప్. ఇన్నింగ్స్ ఐదో ఓవర్ మూడో బంతిని ప్రపంచం నమ్మలేని ఇన్ స్వింగర్ గా విసిరింది. అనూహ్యంగా లోపలికి తిరిగిన బాల్ మిడ్ వికెట్ ను గిరాటేసింది. దీంతో ఏం జరిగిందో అర్ధం కాక కొద్దిసేపు షాక్ కు గురైంది బెత్ మూనీ.
కాగా.. ఇలాంటి ఇన్ స్వింగ్ చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే అభిమానులను అలరిస్తూ ఉంటాయి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. క్రికెట్ లవర్స్ మారిజానే కాప్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి స్వింగ్ గతంలో ఆసీస్ దిగ్గజ బౌలర్ మెక్ గ్రాత్ వేసినప్పుడు చూశాం.. మళ్లీ ఇప్పుడు చూస్తున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే టీమిండియా స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ ను గుర్తు చేశావ్ అంటూ మరికొందరు రాసుకొచ్చారు. ఈ స్వింగ్ చూస్తే.. కంగు తినాల్సిందే అంటూ ఇంకొందరు ప్రశంసించారు. బౌలింగ్ లో మూడు వికెట్లు తీయడంతో పాటుగా బ్యాటింగ్ లోనూ దుమ్మురేపింది మారిజానే. 87 బంతుల్లో 12 ఫోర్లతో 75 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచింది. మరి ఈ ఇన్ స్వింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
What a ball from Marizanne Kapp!
Beth Mooney knocked over second ball by a peach 😮#AUSvSA pic.twitter.com/KOeUbFHhqO
— 7Cricket (@7Cricket) February 7, 2024
ఇదికూడా చదవండి: SL vs AFG: కొద్దిలో సంచలనం మిస్.. శ్రీలంకను వణికించిన పసికూన! మీ పోరాటానికి సెల్యూట్..