iDreamPost

వీడియో: గుర్బాజ్ ఔట్.. స్టోయినిస్ ఓవరాక్షన్! ఓ రేంజ్ లో ఆటాడుకుంటున్న నెటిజన్లు..

ఆఫ్గానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో రహ్మనుల్లా గుర్బాజ్ ను ఔట్ చేసిన తర్వాత ఆసీస్ స్టార్ ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ చేసుకున్న సెలబ్రేషన్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఓవరాక్షన్ చేశాడంటూ.. నెటిజన్లు అతడిని విమర్శిస్తున్నారు.

ఆఫ్గానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో రహ్మనుల్లా గుర్బాజ్ ను ఔట్ చేసిన తర్వాత ఆసీస్ స్టార్ ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ చేసుకున్న సెలబ్రేషన్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఓవరాక్షన్ చేశాడంటూ.. నెటిజన్లు అతడిని విమర్శిస్తున్నారు.

వీడియో: గుర్బాజ్ ఔట్.. స్టోయినిస్ ఓవరాక్షన్! ఓ రేంజ్ లో ఆటాడుకుంటున్న నెటిజన్లు..

టీ20 వరల్డ్ కప్ లో ఆఫ్గానిస్తాన్ ఓ రేంజ్ ఫర్పామెన్స్ తో దూసుకెళ్తోంది. తాజాగా సూపర్ 8 మ్యాచ్ లో పటిష్టమైన ఆస్ట్రేలియాను 21 పరుగుల తేడాతో ఓడించింది. దాంతో ఆఫ్గాన్ పై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆఫ్గాన్ స్టార్ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ ను ఔట్ చేసిన తర్వాత ఆసీస్ స్టార్ ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ వైల్డ్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. దాంతో ఇంత ఓవరాక్షన్ అవసరమా అంటూ నెటిజన్లు స్టోయినిస్ ను విమర్శిస్తున్నారు.

ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ఆఫ్గానిస్తాన్ విజయం సాధించడంతో.. కీలక పాత్ర పోషించారు ఆ జట్టు ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్-ఇబ్రహీం జద్రాన్. వీరిద్దరు ఆసీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ.. తొలి వికెట్ కు 15.5 ఓవర్లలో 118 పరుగుల అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ పార్ట్ నర్ షిప్ ను బ్రేక్ చేశాడు మార్కస్ స్టోయినిస్. ఇన్నింగ్స్ 16వ ఓవర చివరి బంతిని షార్ట్ పిచ్ గా సంధించగా.. ముందుకు వచ్చి భారీ షాట్ ఆడాడు. బాల్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో.. డీప్ స్వ్కైర్ లెగ్ లో ఫీల్డింగ్ చేస్తున్న డేవిడ్ వార్నర్ క్యాచ్ ను అందుకున్నాడు. దాంతో స్టోయినిస్ సెలబ్రేషన్స్ లో ఓవరాక్షన్ చేశాడు. గుర్బాజ్ ను చూస్తూ.. కోపంగా తన చేత్తో బయటకి వెళ్లు అన్నట్లుగా సూచించాడు.

Stoinis Overaction

స్టోయినిస్ ఓవరాక్షన్ చేసిన వీడియో కాస్త వైరల్ గా మారడంతో.. క్రికెట్ ఫ్యాన్స్ తో పాటుగా నెటిజన్లు ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. ఆసీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొని సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పడం సాధారణ విషయం కాదు. అలాంటిది ఔట్ చేసినంత మాత్రానా ఇలా ఓవరాక్షన్ చేయడం అవసరమా? చిన్న జట్ల బ్యాటర్లపై మీ ప్రతాపం ఏంటి? కొంచెమైనా సిగ్గుండాలి అంటూ ఘాటైన విమర్శలు చేశారు. మరి గుర్బాజ్ ను ఔట్ చేసిన తర్వాత స్టోయినిస్ సెలబ్రేషన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

  • ఇదికూడా చదవండి: Hardik Pandya: చరిత్ర సృష్టించిన పాండ్యా.. 17 ఏళ్ల ధోని రికార్డు బద్దలు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి