SNP
Mark Wood, Azam Khan, ENG vs PAK: పాకిస్థాన్ హల్క్ ఆజమ్ ఖాన్‌కు సరైన బాల్ వేసే ఎలా బిత్తరపోతాడో ఇంగ్లండ్ స్టార్ బౌలర్ చేసి చూపించాడు. మరి ఆ బాల్ ఏంటి ఏ మ్యాచ్‌లో జరిగింది. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Mark Wood, Azam Khan, ENG vs PAK: పాకిస్థాన్ హల్క్ ఆజమ్ ఖాన్‌కు సరైన బాల్ వేసే ఎలా బిత్తరపోతాడో ఇంగ్లండ్ స్టార్ బౌలర్ చేసి చూపించాడు. మరి ఆ బాల్ ఏంటి ఏ మ్యాచ్‌లో జరిగింది. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
టీ20 వరల్డ్ కప్ 2024కి ముందు పాకిస్థాన్ జట్టు ఇంగ్లండ్‌తో నాలుగు టీ20ల సిరీస్ ఆడింది. ఈ సిరీస్‌ను 0-2తో ఓడిపోయింది బాబర్ సేన. గురువారం లండన్‌లోని ఓవల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. ఇంగ్లండ్ స్టార్ బౌలర్ మార్క్ వుడ్ వేసిన బౌన్సర్‌కు పాకిస్థాన్ హల్క్‌గా పేరున్న ఆజమ్ ఖాన్ బిత్తరపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంగ్లండ్ పిచ్‌లపై ఉండే బౌన్స్, స్పీడ్‌కు పాకిస్థాన్‌లోని ఫ్లాట్ పిచ్‌లపై ఆడే ఆజమ్ ఖాన్‌కు ఇలాంటి బాల్స్ వేస్తే ఎలా అంటూ నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. అవుట్ అయితే అవుట్ అయ్యాడులే కానీ.. దెబ్బ తగలకుండా భలే తప్పించుకున్నాడు అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇంతకీ అసలు అక్కడ ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంగ్లండ్ స్టార్ బౌలర్ మార్క్ వుడ్ ఇన్నింగ్స్ 11వ ఓవర్ వేసేందుకు వచ్చాడు. అప్పటికే నాలుగు బాల్స్ డాట్స్ ఆడి.. తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. ఆజమ్ ఖాన్ ఫేస్ కనిపిస్తున్న ప్రెజర్‌ను పసిగట్టిన మార్క్ వుడ్ ఇదే సరైన సమయంలో అనుకుని.. తన ఆయుధం ఎక్కుపెట్టాడు. సర్‌ప్రైజింగ్ బౌన్సర్‌తో ఆజమ్ ఖాన్ బిత్తరపోయేలా చేశాడు. ఊహించని బౌన్సర్‌తో షాక్ అయిన ఆజమ్ ఖాన్.. ఆ బాల్ నుంచి తప్పించుకోవడానికి ఒక్కసారిగా వెనక్కి జరిగాడు. ఆ సమయంలో బాల్ అతని గ్లౌజ్‌లకు తాకడం.. వికెట్ కీపర్ ఆ బాల్‌ను అద్భుతంగా అందుకోవడంతో.. ఆజమ్ ఖాన్ ఇన్నింగ్స్‌కు తెలపడింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 19.5 ఓవర్లలో 157 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్లు రిజ్వాన్ 23, బాబర్ ఆజమ్ 36, వన్‌డౌన్‌లో వచ్చిన ఉస్మాన్ ఖాన్ 38 పరుగులు చేసి రాణించారు. కానీ ఆ తర్వాత బ్యాటర్లు దారుణంగా విఫలం అయ్యారు. ఫకర్ జమాన్ 9, షాదాబ్ ఖాన్ 0, ఆజమ్ ఖాన్ 0 విఫలం అవ్వడంతో పాక్ తక్కువ స్కోర్‌కే పరిమితం అయింది. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 2, ఆదిల్ రషీద్ 2, లవింగ్‌స్టోన్ 2 వికెట్లు పడగొట్టి రాణించారు. ఆర్చర్, జోర్దాన్, మొయిన్ అలీ తలో వికెట్ తీసుకున్నారు. 158 పరుగుల టార్గెట్‌ను ఇంగ్లండ్ 15.3 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఊడిపారేసింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ 45, జోస్ బట్లర్ 39 పరుగులతో రాణించారు. మరి ఈ మ్యాచ్‌లో మార్క్ వుడ్ బౌన్సర్‌కు ఆజమ్ ఖాన్ అవుటైన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
An absolute rocket from Mark Wood to dismiss Azam Khan. pic.twitter.com/8F3hpSoIwW
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 30, 2024