Arjun Suravaram
Manu Bhaker: ప్రతిష్టాత్మక పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్‌కు మరో పతకం వచ్చింది. తొలి మెడల్ అందించిన షూటర్ మను బాకరే రెండో పతాకాన్ని సాధించడం విశేషం. ఈ విజయంతో మను భాకర్ అరుదైన చరిత్ర సృష్టించింది.
Manu Bhaker: ప్రతిష్టాత్మక పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్‌కు మరో పతకం వచ్చింది. తొలి మెడల్ అందించిన షూటర్ మను బాకరే రెండో పతాకాన్ని సాధించడం విశేషం. ఈ విజయంతో మను భాకర్ అరుదైన చరిత్ర సృష్టించింది.
Arjun Suravaram
ప్రస్తుతం ఎక్కడ చూసిన వినిపిస్తోన్న పేరు మను భాకర్. పారిస్ ఒలంపిక్స్ లో పతకాలతో ఈ మను దూసుకెళ్తూ… అందరి మనస్సులను గెల్చింది. ఈ ఒలంపిక్స్ లో దేశానికి తొలి మెడల్ అందించిన షూటర్ మను బాకరే రెండో మెడల్ సాధించడం విశేషం. తొలుత వ్యక్తిగత విభాగం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో మను కాంస్య పతకం గెలిచిన విషయం తెలిసిందే. తాజాగా మిక్స్‌డ్ విభాగంలో కూడా మను భాకర్ కాంస్య పతకం సాధించింది. 2020 టోక్యో ఒలింపిక్స్ ఆమెకు చేదు జ్ఞాపకంగా మిగల్చగా..నేడు దేశం గర్వించేలా మను చేరడానికి ఆమెకు తన టాటూ స్ఫూర్తి నింపింది. ఇంతకు ఆ టాటూ ఏమని రాసి ఉంది, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…
ప్రతిష్టాత్మక పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్‌కు మరో పతకం వచ్చింది. తొలి మెడల్ అందించిన షూటర్ మను బాకరే రెండో పతాకాన్ని సాధించడం విశేషం. ఈమె తొలుత వ్యక్తిగత విభాగం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో మను బ్రాంజ్ మెడల్ సాధించిన సంగతి తెలిసింది. అలానే మంగళవారం మిక్స్‌డ్ విభాగంలో కూడా మను భాకర్ కాస్య సాధించారు. 10 మీటర్ల పిస్టల్ మిక్స్‌డ్ విభాగంలో సరబ్‌జ్యోత్‌తో కలిసి మను భాకర్ కాంస్యాన్ని దేశానికి అందించింది. ఈ విజయంతో మను భాకర్ అరుదైన చరిత్ర సృష్టించింది. మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఒకే ఒలింపిక్‌లో రెండు పతకాలు గెలిచిన తొలి అథ్లెట్‌గా నిలిచారు. అయితే ఆమెకు ఈ విజయాలు అంత ఈజీగా రాలేదు.
2020 టోక్యో ఒలింపిక్స్ ఆమెకు చేదు జ్ఞాపకంగా మిగిలాయి. ఆ సమయంలో దురదృష్టవశాత్తూ గన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆమె ఫైనల్‌కు చేరుకోలేకపోయారు. ఈక్రమంలోనే ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా, తనలో తాను స్ఫూర్తిని నింపుకునే ఉద్దేశంతో ఆమె ఈ టాటూను వేయించుకున్నారు. మను భాకర్ మెడ వెనుక భాగంలో ”స్టిల్ ఐ రైజ్” అనే టాటూ ఉంటుంది. ఈ కవితను పౌర హక్కుల కార్యకర్త, అమెరికా కవి మాయా ఆంజెలు రాశారు. ఈ పదాల గురించి మను బాకర్ ప్రస్తావిస్తూ.. స్టిల్ ఐ రైజ్ అనేవి కేవలం పదాలు కావని, మనం వైఫల్యాలను ఎదుర్కొంటున్నప్పటికీ మీ విలువను చాటే నినాదమని తెలిపింది.ఈ పదాలే నాకు గొప్ప ప్రేరణ, దృఢ సంకల్పాన్ని అందిస్తాయని ఛండీగఢ్‌లో ఆర్యన్ మాన్ ఫౌండేషన్‌కు సంబంధించిన ఒక కార్యక్రమంలో మను చెప్పారు.
ఇది ఇలా ఉంటే.. 16 ఏళ్ల వయసులో కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొన్ని గోల్డ్ మెడల్ గెలిచిన అతిపిన్న భారత క్రీడాకారిణిగా మను భాకర్ రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసింది. అలానే 2018 గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ క్రీడల్లో మను భాకర్ మహిళల 10మీ. ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో బంగారు పతాకాన్ని గెలిచారు. హరియాణా చెందిన మనుభ భాకర్ టోక్యో ఒలింపిక్స్‌కు ముందు అన్ని వరల్డ్ కప్‌లలో కలిపి 9 స్వర్ణాలు, 2 రజతాలు గెల్చింది. ఇక ఆమె ఫామ్ చూసి.. అందరూ టోక్యో 2020లో పతకం సాధిస్తుందని భావించారు. కానీ, ఆ అంచనాలను ఆమె అందుకోలేకపోయారు.
2020 టోక్యో ఒలింపిక్స్‌లో విఫలం కావడంతో మను చాలా విమర్శల్ని ఎదుర్కొన్నారు. ఎంతలా అంటే చివరకు షూటింగ్ 10మీ. ఎయిర్ పిస్టల్ నేషనల్ టీమ్ లోనూ ఆమె స్థానం కోల్పోయారు. ఈ క్రమంలోనే తనలో స్ఫూర్తి నింపేందుకు ఓ టాటూను వేయించుకుంది. 2022 డిసెంబర్‌లో ఈ టాటూను వేయించుకుంది. అదే మను క్రీడా లైఫ్ ను మలుపు తిప్పిందని ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మొత్తంగా తీవ్ర నిరుత్సాహంలో కూరుపోయిన ఆమె.. కసి,పట్టుదల, శ్రమతో పాటు టాటూ ద్వారా స్ఫూర్తి పొందింది..నేడు ఏకంగా చరిత్రలోనే తనకంటూ ప్రత్యేక పేజిని లిఖించుకుంది. ప్రస్తుతం ఆమెకు దేశ నలుమూలల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.