మను-నీరజ్‌ పెళ్లి? ఒట్టు వేయించుకున్న మను తల్లి! క్లారిటీ ఇచ్చిన తండ్రి

మను-నీరజ్‌ పెళ్లి? ఒట్టు వేయించుకున్న మను తల్లి! క్లారిటీ ఇచ్చిన తండ్రి

Manu Bhaker, Neeraj Chopra, Marriage: పారిస్‌ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించి.. దేశ ప్రతిష్టతను కీర్తిని పెంచిన నీరజ్‌ చోప్రా, మను భాకర్‌ పెళ్లి చేసుకుంటారంటూ వస్తున్న వార్తలపై మను తంద్రి క్లారిటీ ఇచ్చారు. ఆయన ఏమన్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

Manu Bhaker, Neeraj Chopra, Marriage: పారిస్‌ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించి.. దేశ ప్రతిష్టతను కీర్తిని పెంచిన నీరజ్‌ చోప్రా, మను భాకర్‌ పెళ్లి చేసుకుంటారంటూ వస్తున్న వార్తలపై మను తంద్రి క్లారిటీ ఇచ్చారు. ఆయన ఏమన్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇటీవల ముగిసిన ప్రతిష్టాత్మక పారిస్‌ ఒలింపిక్స్‌ 2024లో ఇండియాకు పతకాలు అందించిన ఇద్దరు స్టార్‌ అథ్లెట్లు.. మను భాకర్‌-నీరజ్‌ చోప్రా పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇటీవలె.. మను భాకర్‌, నీరజ్‌ చోప్రా కలిసి మాట్లాడుకున్న ఒక వీడియో తెగ వైరల్‌ అయింది. ఆ వీడియోలో ఇద్దరు చాలా సిగ్గుపడుతూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, ఆ తర్వాత.. మను తల్లి నీరజ్‌ చోప్రాతో మాట్లాడుతూ.. అతనితో ఒట్టు వేయించుకోవడంతో.. వెంటనే పూకర్లు మొదలయ్యాయి. పెళ్లి విషయం గురించే.. మను భాకర్‌ తల్లి నీరజ్‌తో మాట్లాడి ఒట్టు వేయించుకుందంటూ కథనాలు అల్లేశారు.

అయితే.. ఈ విషయంపై తాజాగా మను భాకర్‌ తండ్రి రామ్‌ కిషన్‌ స్పందిస్తూ.. పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు. మను భాకర్‌ ఇంకా చిన్న పిల్లా.. అప్పుడే పెళ్లి ఈడు రాలేదంటూ పెళ్లి వార్తలను కొట్టిపారేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘మను ఇంకా చిన్నపిల్ల, తనకు ఇంకా పెళ్లి వయసు కూడా రాలేదు. అయినా మేం పెళ్లి గురించి ఏం ఆలోచించడం లేదు, తను కూడా వేరే ఏ విషయాలు పట్టించుకోవడం లేదు. ఇక నీరజ్‌ చోప్రాను తన భార్య ఒక బిడ్డలా భావించి అలా మట్లాడింది’ అంటూ తెలిపారు. మరో వైపు నీరజ్‌ చోప్రా సన్నిహితులు కూడా ఈ వార్తలను ఖండించారు. అలాంటిదేం లేదని, ఒక వేళ నీరజ్‌ పెళ్లి గురించి చెప్పాల్సి వస్తే.. అందరికి తెలిసేలానే చెప్తాం అంటూ స్పష్టం చేశారు.

ఇక పారిస్‌ ఒలింపిక్స్‌లో ఈ ఇద్దరు అథ్లెట్లు పతకాలు గెలిచి.. భారత దేశ కీర్తిని మరింత పెంచిన విషయం తెలిసిందే. నీరజ్‌ చోప్రా జావెలిన్‌ త్రోలో 89.45 మీటర్ల దూరం బల్లెం విసిరి సిల్వర్‌ మెడల్‌ గెలిచాడు. అలాగే మను భాకర్‌ మహిళల 10 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌లో బ్రాంజ్‌ మెడల్‌ సాధించింది. అలాగే మిక్స్‌డ్‌ 10 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌లో సరబ్‌జ్యోత్‌ సింగ్‌తో కలిసి మరో బ్రాంజ్‌ మెడల్‌ను సాధించింది. ఒకే ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్‌ సాధించిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా మను భాకర్‌ చరిత్ర సృష్టించింది. అలాగే పారిస్‌ ఒలింపిక్స్‌లో ఇండియాకు తొలి మెడల్‌ అందించింది కూడా మనునే. మరి వీరిద్దరి పెళ్లి గురించి వస్తున్న వార్తలపై అలాగే మను భాకర్‌ వాళ్ల ఇచ్చిన క్లారిటీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments