iDreamPost
android-app
ios-app

Manu Bhaker: చరిత్ర సృష్టించిన మను భాకర్‌! పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో మెడల్‌

  • Published Jul 30, 2024 | 1:34 PM Updated Updated Jul 30, 2024 | 1:58 PM

Manu Bhaker, Paris Olympics 2024: పారిస్‌ ఒలింపిక్స్‌ 2024లో భారత్‌కు మరో పతకం వచ్చింది. తొలి మెడల్‌ అందించిన షూటర్‌ మను బాకరే రెండో మెడల్ సాధించడం విశేషం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Manu Bhaker, Paris Olympics 2024: పారిస్‌ ఒలింపిక్స్‌ 2024లో భారత్‌కు మరో పతకం వచ్చింది. తొలి మెడల్‌ అందించిన షూటర్‌ మను బాకరే రెండో మెడల్ సాధించడం విశేషం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

  • Published Jul 30, 2024 | 1:34 PMUpdated Jul 30, 2024 | 1:58 PM
Manu Bhaker: చరిత్ర సృష్టించిన మను భాకర్‌! పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో మెడల్‌

ప్రతిష్టాత్మక పారిస్‌ ఒలింపిక్స్‌ 2024లో భారత్‌కు మరో పతకం వచ్చింది. తొలి మెడల్‌ అందించిన షూటర్‌ మను బాకరే రెండో మెడల్ సాధించడం విశేషం. తొలుత వ్యక్తిగత విభాగం 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌లో మను కాంస్య పతకం గెలిచిన విషయం తెలిసిందే. తాజాగా మిక్స్‌డ్‌ విభాగంలో కూడా మను భాకర్‌ కాస్య పతకం సాధించింది. 10 మీటర్ల పిస్టల్‌ మిక్స్‌డ్‌ విభాగంలో సరబ్‌జ్యోత్‌తో కలిసి మను భాకర్‌ కాంస్యం గెలిచింది. ఈ విజయంతో మను భాకర్‌ చరిత్ర సృష్టించింది. మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఒకే ఒలింపిక్‌లో రెండు పతాకలు గెలిచిన తొలి అథ్లెట్‌గా నిలిచింది.

ఒకే ఒలింపిక్‌లో రెండో మెడల్స్‌ గెలిచిన అథ్లెట్‌గా మను భాకర్‌ నిలిచినా.. ఇప్పటి వరకు రెండు పతకాలు గెలిచిన అథ్లెట్లు మరో ఇద్దరు ఉన్నారు. రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌, అలాగే మన తెలుగు తేజం, భారత స్టార్‌ షట్లర్‌ పవీ సింధు. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో కాంస్యం, 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో సిల్వర్‌ మెడల్‌ సాధించాడు సుశీల్‌ కుమార్‌. ఇక సింధు 2016 రియో ఒలింపిక్స్‌లో సిల్వర్‌, 2021 టోక్యో ఒలింపిక్స్‌లో క్యాంస పతకం సాధించిన విషయం తెలిసిందే.