SNP
Manish Pandey, Ashrita Shetty, Divorce: టీమిండియా క్రికెటర్ మనీష్ పాండే తన భార్యతో విడాకులు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. ప్రేమ పెళ్లి చేసుకున్న పాండే తన భార్యతో విడిపోవడానికి కారణాలు..
Manish Pandey, Ashrita Shetty, Divorce: టీమిండియా క్రికెటర్ మనీష్ పాండే తన భార్యతో విడాకులు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. ప్రేమ పెళ్లి చేసుకున్న పాండే తన భార్యతో విడిపోవడానికి కారణాలు..
SNP
భార్యతో విడిపోయేందుకు మరో టీమిండియా క్రికెటర్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. భారత వెటరన్ క్రికెటర్ మనీష్ పాండే తాజాగా తన భార్య అశ్రిత శెట్టితో విడిపోయేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని, త్వరలోనే విడాకులు తీసుకుంటారని జాతీయ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి. అయితే వీటిపై ఇంకా ఎవరు అధికారికంగా స్పందించలేదు. అలా అని విడాకులు వార్తలను దంపతుల్లో ఏ ఒక్కరు కూడా ఖండించలేదు. ఈ పుకార్ల కారణం.. మనీష్ పాండే తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి తన భార్య అశ్రిత శెట్టి ఫొటోలను తొలగించడమే. మరోవైపు అశ్రిత శెట్టి సైతం తన సోషల్ మీడియా అకౌంట్ల నుంచి తన భర్త మనీష్ పాండే ఫొటోలు లేకుండా డిలీట్ చేసింది.
అయితే.. ఈ ఇద్దరు 2019లో ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లైన కొత్తలో ఎంతో అన్నోన్యంగా ఉన్నారు. పెళ్లికి ముందు సినిమా హీరోయిన్‌గా చేసిన అశ్రిత పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైపోయింది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్‌గా ఉండేది. తన భర్త మనీష్ పాండేతో కలిసి దిగిన ఫొటోలను తరచు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అభిమానులతో పంచుకునేది. అలాంటి ఇప్పుడు ఆమె సోషల్ మీడియాలో అకౌంట్లలో భర్త మనీష్ పాండేతో కలిసి ఉన్న ఒక్క ఫొటో కూడా లేకపోవడం గమనార్హం. అశ్రిత పెళ్లికి ముందు తమిళ్‌లో ఉదయమ్, ఎన్‌హెచ్4, ఒరు కన్నియుమ్ మూను కలవనికలుమ్, ఇంద్రజిత్ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే.
హీరో సిద్ధార్థతో కలిసి నటించిన ఎన్‌హెచ్4 సినిమా తెలుగులోనూ విడుదలైంది. దీంతో.. అశ్రిత శెట్టి తెలుగు సినీ అభిమానులకు కూడా సుపరిచితమే. ఇక మనీష్ పాండే విషయానికి వస్తే.. టీమిండియా తరఫున ఇప్పటి వరకు 29 వన్డేలు ఆడాడు. అందులో ఒక సెంచరీ, 2 హాఫ్ సెంచరీ సాధించాడు. మొత్తంగా 566 పరుగులు చేశాడు. అలాగే 39 టీ20లు ఆడి 709 పరుగులు చేశాడు. అందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే ఐపీఎల్‌లో సెంచరీ చేసిన తొలి భారత క్రికెటర్‌గా మనీష్ పాండే పేరిట అరుదైన రికార్డు ఉంది. ఐపీఎల్ మొత్తం 171 మ్యాచ్‌లు ఆడిన పాండే ఒక సెంచరీ, 22 హాఫ్ సెంచరీలు చేశాడు. ఆర్సీబీ, పూణే వారియర్స్ ఇండియా, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్‌జెయింట్స్, ఎస్‌ఆర్‌హెచ్, కేకేఆర్ జట్లు తరఫున ఆడాడు. మరి ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట విడిపోతున్నారు అని వస్తున్న పుకార్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Manish Pandey & Ashrita Shetty Divorce Rumors: Instagram Moves Spark Speculation!#ManishPandey #AshritaShetty #DivorceRumors #IPL2024 #Bollywood #CelebrityGossip #KKR #EntertainmentNews #CricketNews #BollywoodNews #TrendingNow #SocialMediaBuzz pic.twitter.com/odiVLHMl6n
— Asianet Newsable (@AsianetNewsEN) June 20, 2024