SNP
మాజీ క్రికెటర్లు కలిసి ఆడే లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీ క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించింది. శనివారం జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో హర్భజన్ సింగ్ కెప్టెన్సీలోని మణిపాల్ టైగర్స్ విజయం సాధించింది.
మాజీ క్రికెటర్లు కలిసి ఆడే లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీ క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించింది. శనివారం జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో హర్భజన్ సింగ్ కెప్టెన్సీలోని మణిపాల్ టైగర్స్ విజయం సాధించింది.
SNP
లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023 టైటిల్‌ను టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కెప్టెన్సీలోని మణిపాల్ టైగర్స్ జట్టు కైవసం చేసుకుంది. సురేష్ రైనా కెప్టెన్సీలోని అర్బన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో శనివారం జరిగిన ఫైనల్లో మణిపాల్ జట్టు 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. హైదరాబాద్ ప్లేయర్లు రిక్కీ క్లార్క్ 80, గుర్‌కీరత్ సింగ్ 64 పరుగులతో రాణించినా.. హైదరాబాద్‌ను గెలిపించేందుకు అవి సరిపోలేదు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో అర్బన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ జట్టు ఓపెనర్ స్మిత్ 21 రన్స్ చేసి పర్వాలేదనిపించాడు. కానీ, మరో ఓపెనర్ మార్టిన్ గప్టిల్ డకౌట్ కావడం హైదరాబాద్‌ను కష్టాల్లోకి నెట్టేసింది. కానీ, క్లార్క్, సింగ్ అద్భుతంగా ఆడారు.
మణిపాల్ టైగర్స్ బౌలర్లలో పంకజ్ సింగ్‌కు రెండు వికెట్లు దక్కాయి. మిచ్చెల్, తిషారా పెరీరా చెరో వికెట్ పడగొట్టారు. ఇక 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మణిపాల్ టైగర్స్‌కు ఓపెనర్లు రాబిన్ ఊతప్ప, వాల్టన్ మంచి ఆరంభాన్ని అందించారు. ఇద్దరూ తొలి వికెట్‌కు 71 పరుగులు జోడించారు. ఊతప్ప 27 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 40 పరుగులు చేశాడు. చివర్లలో ఏంజిలో పెరీరా 30, అసీలా గుణరత్నే 51, తీషారా పెరీరా 13 బంతుల్లో 25 రన్స్ చేయడంతో మణిపాల్ టైగర్స్ కేవలం 19 ఓవర్లలోనే 193 పరుగులు చేసి.. 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
29 బంతుల్లో 5 సిక్సులతో 51 పరుగులు చేసి.. మణిపాల్ టైగర్స్ ఛాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించిన అసీలా గుణరత్నేకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక తీషారా పెరీరా ఈ టోర్నీలో మొత్తం 108 పరుగులతో పాటు 8 వికెట్లతో సత్తా చాటడంతో అతనికి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు వరించింది. ఈ క్రికెట్ లెజెండ్స్ తలపడిని ఈ టోర్నీలో సురేష్ రైనా కెప్టెన్సీని అర్భన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును ఓడించి హర్భజన్ సింగ్ కెప్టెన్సీలోని మణిపాల్ టైగర్స్ ఛాంపియన్స్‌గా నిలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Legends League Champions 🏆🙏 #Manipaltigers @llct20 pic.twitter.com/YFEMZdWhQs
— Harbhajan Turbanator (@harbhajan_singh) December 10, 2023