గవాస్కర్​కు బిగ్ షాక్.. కోట్లు విలువ చేసే జాగా స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం!

Sunil Gavaskar, Ajinkya Rahane, Maharashtra Government: క్రికెట్​కు టీమిండియా అందించిన గొప్ప క్రికెటర్లలో లెజెండ్ సునీల్ గవాస్కర్​ ఒకడు. అద్భుతమైన బ్యాటింగ్​తో ఒక జనరేషన్ ఫ్యాన్స్​కు అభిమాన క్రికెటర్​గా నిలిచాడు.

Sunil Gavaskar, Ajinkya Rahane, Maharashtra Government: క్రికెట్​కు టీమిండియా అందించిన గొప్ప క్రికెటర్లలో లెజెండ్ సునీల్ గవాస్కర్​ ఒకడు. అద్భుతమైన బ్యాటింగ్​తో ఒక జనరేషన్ ఫ్యాన్స్​కు అభిమాన క్రికెటర్​గా నిలిచాడు.

క్రికెట్​కు టీమిండియా అందించిన గొప్ప క్రికెటర్లలో లెజెండ్ సునీల్ గవాస్కర్​ ఒకడు. అద్భుతమైన బ్యాటింగ్​తో ఒక జనరేషన్ ఫ్యాన్స్​కు ఆరాధ్య క్రికెటర్​గా నిలిచాడు. జెంటిల్మన్ గేమ్​లో అతడు చూడని విజయం లేదు. వన్డే ప్రపంచ కప్-1983ని భారత్ గెలుచుకోవడంలో గవాస్కర్​ది కీలక పాత్ర. లిటిల్ మాస్టర్​గా అభిమానులతో పిలిపించుకునే గవాస్కర్ క్రియేట్ చేసిన ఎన్నో రికార్డులు ఇంకా అన్​బ్రేకెన్​గా ఉన్నాయి. క్రికెట్​లోని ఇన్ని ఘనతలు సాధించాడు కాబట్టే అప్పట్లో ప్రభుత్వాలు ఆయన్ను ఎంతో గౌరవించాయి. సత్కారాలు, సన్మాలు చేశాయి. ఈ క్రమంలోనే ఆయనకు భూమి కూడా కేటాయించారు. కానీ ఇప్పుడు అదే కోట్లు విలువ చేసే జాగాను సర్కారు జప్తు చేసి గవాస్కర్​కు షాక్ ఇచ్చింది. అసలేం జరిగిందో వివరంగా తెలుసుకుందాం..

గవాస్కర్​కు మహారాష్ట్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ముంబై బాంద్రాలోని కోట్ల రూపాయల విలువ చేసే ఆయన ల్యాండ్​ను స్వాధీనం చేసుకుంది. ఆయన నుంచి జప్తు చేసుకున్న జాగాను టీమిండియా క్రికెటర్, ముంబై రంజీ టీమ్ కెప్టెన్ అజింక్యా రహానేకు అప్పగించాలని ఏక్​నాథ్ షిండే గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. గవాస్కర్ భూమిని గవర్నమెంట్ తీసుకోవడం వెనుక పెద్ద కథే ఉంది. ఈ లెజెండ్ పుట్టి పెరిగిందంతా ముంబైలోనే. తన అద్భుతమైన బ్యాటింగ్​తో స్టేట్​కు ఎంతో పేరుప్రతిష్టలు తీసుకొచ్చాడు. దీంతో 1988లో అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం బాంద్రాలో 2 వేల చదరపు మీటర్ల స్థలాన్ని ఆయనకు కేటాయించింది. ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేసి ఫ్యూచర్ క్రికెటర్లకు ట్రెయినింగ్ ఇవ్వడం కోసం ఈ జాగాను కేటాయిస్తున్నట్లు కూడా చెప్పింది. కానీ దిగ్గజ క్రికెటర్ మాత్రం ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు.

Show comments