iDreamPost
android-app
ios-app

IND vs SA: టీ20 సిరీస్.. టీమిండియాకు గుడ్ న్యూస్, సౌతాఫ్రికాకు భారీ షాక్!

  • Author Soma Sekhar Published - 08:39 AM, Sat - 9 December 23

టీమిండియా-సౌతాఫ్రికా మధ్య డిసెంబర్ 10 నుంచి 3 టీ20 మ్యాచ్ ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే ఆ జట్టుకు భారీ షాక్ తగిలింది.

టీమిండియా-సౌతాఫ్రికా మధ్య డిసెంబర్ 10 నుంచి 3 టీ20 మ్యాచ్ ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే ఆ జట్టుకు భారీ షాక్ తగిలింది.

  • Author Soma Sekhar Published - 08:39 AM, Sat - 9 December 23
IND vs SA: టీ20 సిరీస్.. టీమిండియాకు గుడ్ న్యూస్, సౌతాఫ్రికాకు భారీ షాక్!

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ నెగ్గి మంచి జోరుమీదుంది టీమిండియా. ఇక ఇదే జోరును సౌతాఫ్రికాపై కూడా చూపించాలని భావిస్తోంది. సఫారీ టీమ్ తో 3 టీ20లు, 3 వన్డే, రెండు టెస్టు మ్యాచ్ ల సిరీస్ కోసం ఇప్పటికే యంగ్ టీమిండియా ఆ గడ్డపై అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే మరికొద్ది గంటల్లోనే మ్యాచ్ ప్రారంభం అవుతుంది అనగా సౌతాఫ్రికాకు భారీ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. ఆ జట్టు స్టార్ బౌలర్ గాయం కారణంగా పొట్టి సిరీస్ మెుత్తానికి దూరం అయ్యాడు. ఇది టీమిండియాకు ఒక విధంగా గుడ్ న్యూసనే చెప్పాలి. మరి గాయం కారణంగా సిరీస్ కు దూరమైన ఆ ప్లేయర్ ఎవరు? ఇప్పుడు చూద్దాం.

టీమిండియా-సౌతాఫ్రికా మధ్య డిసెంబర్ 10 నుంచి 3 టీ20 మ్యాచ్ ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే మ్యాచ్ కు ఒక్కరోజు ముందే సఫారీ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ లుంగి ఎంగిడి గాయం కారణంగా సిరీస్ మెుత్తానికి దూరం అయ్యాడు. ఎడమ కాలు చీలమండ గాయం నుంచి అతడు పూర్తిగా కోలుకోకపోవడంతో.. జట్టును నుంచి అతడిని తప్పించింది మేనేజ్ మెంట్. అతడి స్థానంలో టీమ్ లోకి బ్యూరాన్ హెండ్రిక్స్ ను తీసుకున్నట్లు తెలుస్తోంది. బుల్లెట్ వేగంతో బంతులు సంధించడంలో ఎంగిడి సిద్ధహస్తుడు.

shock for south africa team

ఈ నేపథ్యంలో ఇప్పుడు అతడు జట్టుకు దూరం కావడం టీమిండియాకు శుభవార్త లాంటిదే. ఎందుకంటే? సఫారీ పిచ్ లపై యంగ్ టీమిండియా ప్లేయర్లకు ఆడిన అనుభవం తక్కువ. పైగా అక్కడి పిచ్ లు పేస్ కు బాగా అనుకూలిస్తాయి. దీంతో ఎంగిడి లాంటి పేసర్ లు విజృంభించే అవకాశాలను కొట్టిపారేయలేం. ఇక అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన హెండ్రిక్స్ పెద్దగా రాణించిన దాఖలాలు లేవు. ఇప్పటి వరకు సౌతాఫ్రికా తరఫున ఒక టెస్టు, 8 వన్డేలు, 19 టీ20లు మాత్రమే ఆడాడు. అతడు 19 టీ20ల్లో 25 బౌలింగ్ సగటుతో కేవలం 25 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. కాగా.. తొలి మ్యాచ్ డర్బన్‌ వేదికగా డిసెంబర్ 10(ఆదివారం) జరగనుంది. మరి ఎంగిడి తప్పుకోవడం టీమిండియాకు అనుకూలమేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి