iDreamPost
android-app
ios-app

లక్నోకు కొత్త కెప్టెన్‌! కేఎల్‌ రాహుల్‌కు మరో అవమానం?

  • Published May 09, 2024 | 1:53 PM Updated Updated May 09, 2024 | 1:53 PM

Sanjiv Goenka, KL Rahul, Rohit Sharma: ప్రస్తుత సీజన్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ ప్రదర్శనపై అసంతృప్తిగా ఉ‍న్న ఆ జట్టు ఓనర్‌ సంజీవ్‌ గోయెంకా.. కెప్టెన్సీ మార్పుపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదేంటో వివరంగా తెలుసుకుందాం..

Sanjiv Goenka, KL Rahul, Rohit Sharma: ప్రస్తుత సీజన్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ ప్రదర్శనపై అసంతృప్తిగా ఉ‍న్న ఆ జట్టు ఓనర్‌ సంజీవ్‌ గోయెంకా.. కెప్టెన్సీ మార్పుపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదేంటో వివరంగా తెలుసుకుందాం..

  • Published May 09, 2024 | 1:53 PMUpdated May 09, 2024 | 1:53 PM
లక్నోకు కొత్త కెప్టెన్‌! కేఎల్‌ రాహుల్‌కు మరో అవమానం?

ఐపీఎల్‌ 2024లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ దారుణంగా ఓటమి పాలైన విషయం తెలిసిందే. బుధవారం హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో గల రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఏకంగా 10 వికెట్ల తేడాతో లక్నోను చిత్తు చేసిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్‌ చేసి.. ముక్కిమూలిగి 165 పరుగులు చేసింది ఎల్‌ఎస్‌జీ. కానీ, ఈ టార్గెట్‌ను సన్‌రైజర్స్‌ ఓపెనర్లు 9.4 ఓవర్లలో ఊదిపారేశారు. దారుణ ఓటమి తర్వాత.. లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఓనర్‌ సంజీవ్‌ గోయెంకా.. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఐపీఎల్‌ 2025వ సీజన్‌ కోసం కేఎల్‌ రాహుల్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి అతని స్థానంలో కొత్త కెప్టెన్‌గా నియమించాలని సంజీవ్‌ గోయెంకా ఫిక్స్‌ అయినట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌లో లక్నోకు ఇంకా 2 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఆ రెండు మ్యాచ్‌లు గెలిస్తే.. లక్నో ఫ్లే ఆఫ్స్‌కు చేరుతుంది. ఒక వేళ లక్నో ప్లే ఆఫ్స్‌కు చేరడంలో విఫలం అయితే మాత్రం.. కెప్టెన్సీ మార్పు తప్పదంటూ ఇప్పటికే సంజీవ్‌ గోయెంకా.. కేఎల్‌ రాహుల్‌కు చెప్పేసినట్లు సమాచారం. ఐపీఎల్‌ 2022 నుంచి లక్నోకు కేఎల్‌ రాహులే కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ సీజన్‌లో కప్పు కొట్టడంలో విఫలం అయితే.. వచ్చే సీజన్‌లో లక్నోకు కొత్త కెప్టెన్‌ను చూడొచ్చు.

New captain for Lucknow

గతంలో 2016, 2017 సీజన్‌లో రైజింగ్‌ పూణె సూపర్‌ జెయింట్స్‌కు సంజీవ్‌ గోయెంకానే యాజమానిగా ఉన్న విషయం తెలిసిందే. అప్పుడు 2016లో పూణె చివరి నుంచి రెండు స్థానంలో నిలిచిందని, దిగ్గజ కెప్టెన్‌ ధోనినే కెప్టెన్సీ నుంచి తప్పించిన స్టీవ్‌ స్మిత్‌కు కెప్టెన్సీ అప్పటించిన చరిత్ర సంజీవ్‌ గోయెంకాది. అలాంటిది రాహుల్‌కు మూడు సీజన్లు ఛాన్స్‌ ఇచ్చాడు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌లో ఉన్న రోహిత్‌ శర్మ.. వచ్చే సీజన్‌లో వేలంలో అందుబాటులో ఉన్నా, జట్టు మారే ఆలోచనలో ఉన్నా.. అతన్ని ఎన్ని కోట్లు పెట్టి అయినా కొనుగోలు చేసి.. లక్నోకు కెప్టెన్‌గా చేయాలని సంజీవ్‌ గోయెంకా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎస్‌ఆర్‌హెచ్‌ మ్యాచ్‌ తర్వాత గ్రౌండ్‌లోనే తనతో ఓనర్‌ రూడ్‌గా మాట్లాడడాన్ని రాహుల్‌కి జరుగుతున్న అవమానంగా భావిస్తున్న తరుణంలో.. ఇప్పుడు కెప్టెన్సీ మార్పు అంశం బయటికి రావడంతో రాహుల్‌కు జరిగిన మరో అవమానంగా క్రికెట్‌ అభిమానులు భావిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.