గ్రౌండ్‌లో అందరి ముందు తిట్టి.. రాహుల్‌ను ఇంటికి పిలిచిన లక్నో ఓనర్‌!

LSG, Sanjiv Goenka, KL Rahul, IPL 2024: కేఎల్‌ రాహుల్‌తో అగ్రెసివ్‌గా మాట్లాడి విమర్శల పాలైన లక్నో ఓనర్‌ తాజాగా రాహుల్‌ను ఇంటికి పిలిచారు. ఈ భేటీ గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

LSG, Sanjiv Goenka, KL Rahul, IPL 2024: కేఎల్‌ రాహుల్‌తో అగ్రెసివ్‌గా మాట్లాడి విమర్శల పాలైన లక్నో ఓనర్‌ తాజాగా రాహుల్‌ను ఇంటికి పిలిచారు. ఈ భేటీ గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో అస్సలు ఊహించని ఘటనలు జరుగుతున్నాయి. కనీవినీ ఎరుగని రికార్డులు బద్దలు అవుతున్నాయి. గొడవలు జరుగుతాయి అని ఊహించిన మ్యాచ్‌ల్లో ఆటగాళ్లు కలిసిపోతుంటే.. అస్సలు వీళ్లు కాంట్రవర్సీ జోలికి పోరు అన్న వాళ్లు.. గొడవలతో వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఇలా ఐపీఎల్‌ ఆటలోనే కాదు ఇతర విషయాల్లో కూడా అన్‌ప్రెడిక్టబుల్‌గా ఉంది. ఈ నెల 8న లక్నో సూపర్‌ జెయింట్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌ తర్వాత.. ఆ జట్టు ఓనర్‌ సంజీవ్‌ గోయెంకా.. టీమ్‌ కెప్టెన్‌ అయిన కేఎల్‌ రాహుల్‌తో గ్రౌండ్‌లోనే చాలా రూడ్‌గా మాట్లాడిన విషయం తెలిసిందే. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ 10 వికెట్ల తేడాతో చిత్తు చిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో గల రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఎల్‌ఎసీజీ ఘోర ఓటమిని చూసిన లక్నో ఓనర్‌ సంజీవ్‌ గోయెంకా.. మ్యాచ్‌ తర్వాత గ్రౌండ్‌లోనే కెప్టెన్‌ రాహుల్‌ను కడిగిపారేశారు సంజీవ్‌. ఆయన వ్యవహర శైలిపై అంతా మండిపడ్డారు. ఓ టీమిండియా క్రికెటర్‌, టీమ్‌ కెప్టెన్‌తో ఇలాగేనా ప్రవర్తించేది. ఆట అన్నాక గెలుపోటములు సహజం.. ఆ మాత్రం దానికి ఇలా కెమెరా కంటికి చిక్కుతున్నాం అన్న సోయి లేకుండా ఎలా ప్రవర్తిస్తారంటూ క్రికెట్‌ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది.

దీంతో.. కాస్త తగ్గినట్లు ఉన్నారు లక్నో సూపర్‌ జెయింట్‌ ఓనర్‌ సంజీవ్‌ గోయెంకా. సోమవారం రాహుల్‌ను డిన్నర్‌ కోసం తన ఇంటికి పిలిపించారు. ఇంటికి వచ్చిన రాహుల్‌ను సంజీవ్‌ గోయెంకా ఆప్యాయంగా పలకరించారు. లేచి రాహుల్‌ను కౌగిలించుకుని.. లక్నో వర్సెస్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ మ్యాచ్‌ సందర్భంగా జరిగిన దానికి సారీ చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments