iDreamPost
android-app
ios-app

వీడియో: రాహుల్‌నే కాదు.. గతంలో ధోనిని ఇంతకంటే ఘోరంగా అవమానించిన లక్నో ఓనర్‌!

  • Published May 09, 2024 | 1:31 PM Updated Updated May 09, 2024 | 1:49 PM

Sanjiv Goenka, KL Rahul, MS Dhoni: ఎస్‌ఆర్‌హెచ్‌పై దారుణ ఓటమి తర్వాత లక్నో ఓనర్‌ ఆ జట్టు కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌తో ప్రవర్తించిన తీరు వివాదాస్పదమైంది. అయితే.. గతంలో ధోనిని కూడా ఈ లక్నో ఓనర్‌ ఇలాగే అవమానించాడు. దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం..

Sanjiv Goenka, KL Rahul, MS Dhoni: ఎస్‌ఆర్‌హెచ్‌పై దారుణ ఓటమి తర్వాత లక్నో ఓనర్‌ ఆ జట్టు కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌తో ప్రవర్తించిన తీరు వివాదాస్పదమైంది. అయితే.. గతంలో ధోనిని కూడా ఈ లక్నో ఓనర్‌ ఇలాగే అవమానించాడు. దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం..

  • Published May 09, 2024 | 1:31 PMUpdated May 09, 2024 | 1:49 PM
వీడియో: రాహుల్‌నే కాదు.. గతంలో ధోనిని ఇంతకంటే ఘోరంగా అవమానించిన లక్నో ఓనర్‌!

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ చిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్‌ ముగిసిన తర్వాత లక్నో ఓనర్‌ సంజీవ్‌ గోయెంకా.. ఆ జట్టు కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌తో చాలా అగ్రెసివ్‌గా మాట్లాడుతున్న వీడియో సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయింది. మ్యాచ్‌ ఓడిపోయినంత మాత్రం జట్టు కెప్టెన్‌తో ఇలానేనా మాట్లాడేది అంటూ క్రికెట్‌ అభిమానులు గోయెంకాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే గతంలో ధోనిని కూడా సంజీవ్‌ గోయెంకా ఇలాగే అవమానించాడు, ఆటగాళ్ల విషయంలో అతని తీరే అంత అంటూ సోషల్‌ మీడియాలో క్రికెట్‌ అభిమానులు పేర్కొంటున్నారు. అసలు ఇంతకీ.. సంజీవ్‌ గోయెంకా ధోనిని ఎప్పుడు అవమానించాడో ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం.

ఐపీఎల్‌ 2016 సీజన్‌ కంటే ముందు మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లపై రెండేళ్ల నిషేధం పడిన విషయం అందరికీ తెలిసే ఉంటుంది. దాంతో.. 2016, 2017 ఐపీఎల్‌ సీజన్స్‌ను ఎలాంటి అవంతరాలు లేకుండా నిర్వహించేందుకు ఆ రెండు టీమ్స్‌ స్థానంలో బీసీసీఐ మరో రెండు కొత్త టీమ్స్‌ను రెండేళ్ల కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసింది. అందులో గుజరాత్‌ లయన్స్‌ ఒకటి, రెండోది రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్స్‌. గుజరాత్‌ లయన్స్‌కు సురేష్‌ రైనా కెప్టెన్‌ కాగా, రైజింగ్‌ పూణెకు ధోని కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే.. రైజింగ్‌ పూణె ఓనర్‌గా సంజీవ్‌ గోయెంకాను ఉన్నారు. 2016 సీజన్‌లో ధోని కెప్టెన్సీలోని రైజింగ్‌ పూణె సూపర్‌ జెయింట్స్‌ అంత బాగా ప్రదర్శన చేయాలేదు.

14 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, 9 ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. దాంతో.. వెంటనే ధోనిని కెప్టెన్సీ నుంచి తప్పించి, ధోని స్థానంలో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ను 2017 సీజన్‌ కోసం పూణె జట్టు కెప్టెన్‌గా నియమించాడు సంజీవ్‌ గోయెంకా. టీమిండియా కెప్టెన్‌గా ఎంతో ఘనత కలిగిన ధోనిని కేవలం ఒక్క సీజన్‌లో విఫలం అవ్వడంతో కెప్టెన్సీ నుంచి తీసేసి అవమానించాడు. అంతటితో ఆగకుండా.. ధోని ఫిట్‌నెస్‌పై కూడా తీవ్ర విమర్శలు చేశాడు అప్పటి రైజింగ్‌ పూణె సూపర్‌ జెయింట్స్‌ ఓనర్‌, ఇప్పటి లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఓనర్‌ సంజీవ్‌ గోయెంకా. ఇప్పుడు రాహుల్‌ విషయంలో అతని ప్రవర్తించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్న సమయంలో.. ధోని విషయంలో ప్రవర్తించిన తీరు కూడా మరోసారి చర్చనీయాంశంగా మారింది. మరి టీమిండియా ఆటగాళ్ల విషయంలో సంజీవ్‌ గోయెంకా వ్యవహార శైలిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.