iDreamPost
android-app
ios-app

వీడియో: SRHపై దారుణ ఓటమి తర్వాత KL రాహుల్‌ను తిట్టిన లక్నో ఓనర్‌! ఫ్యాన్స్‌ ఫైర్‌

  • Published May 09, 2024 | 8:16 AM Updated Updated May 09, 2024 | 8:16 AM

LSG Owner, Sanjiv Goenka, KL Rahul, SRH vs LSG: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో ఓడిపోయిన తర్వాత.. ఆ జట్టు ఓనర్‌.. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ ఘటన గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

LSG Owner, Sanjiv Goenka, KL Rahul, SRH vs LSG: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో ఓడిపోయిన తర్వాత.. ఆ జట్టు ఓనర్‌.. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ ఘటన గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

  • Published May 09, 2024 | 8:16 AMUpdated May 09, 2024 | 8:16 AM
వీడియో: SRHపై దారుణ ఓటమి తర్వాత KL రాహుల్‌ను తిట్టిన లక్నో ఓనర్‌! ఫ్యాన్స్‌ ఫైర్‌

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ముక్కిమూలిగి 165 పరుగులు చేసిన లక్నో.. ఆ టార్గెట్‌ను కేవలం 9.4 ఓవర్లలోనే సమర్పించుకుంది. ఈ చెత్త ఆటతో విసుగుచెందిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఓనర్‌ సంజీవ్ గోయెంకా కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత.. గ్రౌండ్‌లోనే కేఎల్‌ రాహుల్‌తో చాలా ఆగ్రహంగా మాట్లాడుతూ కనిపించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. అయితే.. ఈ వీడియో చూసిన క్రికెట్‌ అభిమానులు లక్నో ఓనర్‌ సంజీవ్ గోయెంకాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంత టీమ్‌కు ఓనర్‌ అయినంత మాత్రనా.. ఒక ప్లేయర్‌తో ఇలానేనా మాట్లాడేది అంటూ మండిపడుతున్నారు.

కేఎల్‌ రాహుల్‌ మ్యాచ్‌ గురించి ఎక్స్‌ప్లేయిన్‌ చేసే ప్రయత్నం చేస్తున్నా.. సంజీవ్ గోయెంకా అస్సలు వినిపించుకోకుండా.. చాలా కోపంగా మాట్లాడుతూనే ఉన్నాడు. పాపం కేఎల్‌ రాహుల్‌ అసలు ఓటమి బాధలో ఉంటే.. ఆ పైన సంజీవ్ గోయెంకా క్లాస్‌ పీకడంతో పేస్‌ చాలా డల్‌గా పెట్టాడు. ఈ సీన్స్‌ చూసిన వారంతా.. సంజీవ్ గోయెంకాను విమర్శిస్తున్నారు. ఒక టీమిండియా ఆటగాడిని, జట్టు కెప్టెన్‌ ఇలా గ్రౌండ్‌లోనే మ్యాచ్‌ గురించి నిందించడం సరికాదంటూ మండిపడుతున్నారు. ఈ మ్యాచ్‌ ఓడిపోయినా.. లక్నోకు ఇంకా ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవకాశం ఉందని, ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలే ఉన్నాయని, ఆ రెండు మ్యాచ్‌లో గెలిస్తే లక్నో ఫ్లే ఆఫ్స్‌కు వెళ్తుందని, కప్పు కొట్టే అవకాశం కూడా ఉందని, కానీ, సంజీవ్ గోయెంకా మాత్రం ఇప్పుడే ఇంతలా ఆవేశపడి.. రాహుల్‌తో సరిగా ప్రవర్తించలేదని క్రికెట్‌ ఫ్యాన్స్‌ అంటున్నారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌ 33 బంతుల్లో 29 పరుగులు, క్వింటన్‌ డికాక్‌ 2, స్టోయినీస్‌ 3, కృనాల్‌ పాండ్యా 24 దారుణంగా విఫలం అయ్యారు. చివర్లో పూరన్‌ 48, ఆయూష్‌ బదోని 55 పరుగులతో రాణించారు. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌ 2, కెప్టెన్‌ కమిన్స్‌ ఒక వికెట్‌ పడగొట్టారు. ఇక 166 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌ కేవలం 9.4 ఓవర్లలోనే ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండా లక్ష్యాన్ని ఊదిపారేసింది. ఓపెనర్లు అభిషేక్‌ శర్మ 28 బంతుల్లో 75, ట్రావిస్‌ హెడ్‌ 30 బంతుల్లో 89 పరుగులు చేసి విధ్వంసం సృష్టించారు. మరి ఈ మ్యాచ్‌లో లక్నో ఓటమిపై ఆ జట్టు ఓనర్‌ సంజీవ్ గోయెంకా కేఎల్‌ రాహుల్‌ను నిందించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.