Nidhan
లోక్‌సభ ఎన్నికలు-2024లో ఓ టీమిండియా క్రికెటర్ విజయబావుటా ఎగురవేశాడు. కాంగ్రెస్ కంచుకోటలో అతడు విక్టరీ నమోదు చేశాడు.
లోక్‌సభ ఎన్నికలు-2024లో ఓ టీమిండియా క్రికెటర్ విజయబావుటా ఎగురవేశాడు. కాంగ్రెస్ కంచుకోటలో అతడు విక్టరీ నమోదు చేశాడు.
Nidhan
లోక్‌సభ ఎన్నికలు-2024 ఫలితాల కోసం దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు, నేతలు, కార్యకర్తలతో పాటు సాధారణ ప్రజానీకం కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూశారు. ఇవాళ ఉదయం 8 గంటల నుంచే ఎన్నికల లెక్కింపు ప్రక్రియ స్టార్ట్ అయింది. మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో చాలా సీట్లలో గెలుపోటముల మీద క్లారిటీ వచ్చింది. ఇంకా కొన్ని ఫలితాలు రావాల్సి ఉంది. తాజాగా వెస్ట్ బెంగాల్‌లోని బహరంపూర్ నియోజకవర్గం రిజల్ట్ వచ్చింది. ఈ స్థానం గురించి అంత ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఏం ఉందని అనుకునేరు? బహరంపూర్ నుంచి టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యూసఫ్ పఠాన్ పోటీ చేశాడు. 2007, 2011 వరల్డ్ కప్స్ గెలిచిన జట్టులో సభ్యుడైన యూసఫ్.. తన రాజకీయ జీవితాన్ని విజయంతో ప్రారంభించాడు.
ఎంపీగా పోటీ చేసిన తొలి ఎన్నికలోనే గెలిచాడు యూసఫ్ పఠాన్. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగిన ఈ మాజీ క్రికెటర్.. కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరీని ఓడించాడు. యూసఫ్‌కు 4,08,240 ఓట్లు వచ్చాయి. మాజీ ఎంపీ అయిన అధిర్ రంజన్ మీద 59,351 ఓట్ల తేడాతో థంపింగ్ విక్టరీ నమోదు చేశాడు. 25 ఏళ్లుగా కాంగ్రెస్‌కు ఎదురులేని స్థానంలో యూసఫ్ విజయం సాధించడంతో తృణమూల్ కార్యకర్తలతో పాటు అతడి ఫ్యాన్స్ సంబురాల్లో మునిగిపోయారు. క్రికెట్లోనే కాదు.. పాలిటిక్స్‌లోనూ యూసఫ్ తోపు అంటూ మెచ్చుకుంటున్నారు. పార్లమెంట్ ఎలక్షన్స్‌లో నెగ్గిన తర్వాత చాలా మంది భారత స్టార్లు లోక్‌సభకు చేరుకున్నారు. గౌతం గంభీర్, మహ్మద్ అజహరుద్దీన్, కీర్తి ఆజాద్, నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధు, చేతన్ చౌహాన్ ఈ లిస్ట్‌లో ఉన్నారు.
ఇక, యూసఫ్ విజయం సాధించిన బహరంపూర్ నియోజకవర్గం బెంగాల్‌లోని ముర్షీదాబాద్ జిల్లాలో ఉంది. ఇక్కడ రెండున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్ హవా నడుస్తోంది. ఆ పార్టీ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి 1999 నుంచి వరుసగా ఐదుమార్లు ఎంపీగా గెలిచారు. బెంగాల్లో హస్తం పార్టీకి ఆయన పెద్ద దిక్కుగా ఉన్నారు. అలాంటి నేత యూసఫ్ చేతిలో చిత్తయ్యారు. ఇక్కడ బీజేపీ నుంచి బరిలో ఉన్న డాక్టర్ నిర్మల్ చంద్ర సాహో సరైన పోటీ కూడా ఇవ్వలేకపోయారు. ముస్లిం మెజారిటీ నియోజకవర్గమైన బహరంపూర్ నుంచి ఇప్పటి వరకు ఆ కమ్యూనిటీ నుంచి ఎవరూ ఎన్నిక కాలేదు. దీంతో తృణమూల్ వ్యూహాత్మకంగా యూసఫ్‌ను బరిలోకి దింపి ఫలితాన్ని రాబట్టింది.
Yusuf Pathan has won the election from the Baharampur seat in West Bengal.
– Adhir Ranjan Chaudhary lost for the first time in 25 years. pic.twitter.com/9CiOtPV0ia
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 4, 2024